ఇంట్లోనే వెజ్ బర్గర్ ఎలా చేయాలో తెలుసా.. ఇలా చేస్తే సేమ్ రెస్టారెంట్ టెస్ట్?
వెజ్ బర్గర్ (Veg burger) ఇది మంచి స్నాక్స్ ఐటమ్. దీని తయారీ విధానం కూడా సులభం. వీటిని తినడానికి పిల్లలు ఇష్టపడతారు. పిల్లలకు ఎంతో ఇష్టమైన వెజ్ బర్గర్ స్నాక్ రెసిపీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీని రుచి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా వెజ్ బర్గర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు: నాలుగు బర్గర్ బ్రెడ్ బన్నులు (Burger bread buns), పావు కప్పు బీన్స్ (Beans), పావు కప్పు పచ్చి బఠాణీలు (Green peas), సగం కప్పు క్యారెట్ (Carrot) తురుము, చిటికెడు పసుపు (Turmeric), సగం టీస్పూన్ మిరియాలపొడి (Black pepper), రెండు బంగాళదుంపలు (Potato).
బ్రెడ్ క్రంబ్స్ (Bread crumbs), రెండు టేబుల్ స్పూన్ ల మైదా (Maida), ఢీ ఫ్రై కి సరిపడా నూనె (Oil), టమోటా కెచప్ (Tomato ketchup), మాయొన్నైస్ (Mayonnaise), టమటా (Tomato) ఒకటి , ఉల్లిపాయ (Onion) ఒకటి, క్యాబేజి ఆకులు (Cabbage leaves), రుచికి సరిపడా ఉప్పు (Salt).
తయారీ విధానం: ముందుగా బంగాళ దుంపలను, పచ్చిబఠానీలను ఉడికించుకొని మెత్తగా చిదుముకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో పోపుకు సరిపడా నూనె (Oil) వేసి నూనె వేడెక్కిన తరవాత ఇందులో ముందుగా ఉడికించి చిదుముకున్న పచ్చిబఠానీలను, బీన్స్, క్యారెట్ తరుగును వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులో చిటికెడు పసుపు, మిరియాలపొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి (Mix well).
ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ ల బ్రెడ్ క్రంబ్స్ పౌడర్ వేసి కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని పెట్టిస్ ఆకారంలో (Patties shape) ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మైదా వేసి కొద్దికొద్దిగా నీళ్లు (Water) పోస్తూ పిండిని జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మైదా మిశ్రమంలో పెట్టిస్ ను ముంచి తరువాత బ్రెడ్ క్రంబ్స్ పౌడర్ లో ముంచాలి.
ఇప్పుడు ఈ పెట్టిస్ ని ఢీ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఢీ ఫ్రైకి సరిపడా ఆయిల్ (Oil) వేయాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో పెట్టిస్ ని వేసి తక్కువ మంట (Low flame) మీద అన్ని వైపులా బాగా ఎర్రగా, క్రిస్పీగా, మంచి కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పెట్టిస్ ని ఒక ప్లేట్ లో తీసుకోవాలి. ఇప్పుడు బర్గర్ బన్స్ తీసుకొని సగానికి కట్ చేసుకోవాలి. ఇందులో ఒక భాగానికి టమటా కెచప్ ను అప్లై చేసుకోవాలి.
మరొక భాగానికి మాయొన్నైస్ (Mayonnaise) అప్లై చేయాలి. ఇప్పుడు టమోటా కెచప్ అప్లై చేసుకున్న బన్ను పై క్యాబేజి ఆకులు పెట్టి దానిపై ప్రైడ్ పెట్టిస్ ను పెట్టాలి. ఇప్పుడు దీనిపై చీజ్ స్లైస్ నీ పెట్టి గుండ్రంగా కట్ చేసుకున్న టమటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు పెట్టి కొంచెం ఉప్పు మిరియాల పొడి చల్లాలి. ఇప్పుడు దీనిపై మరొక బ్రెడ్ ముక్కను ఉంచాలి. అంతే ఎంతో రుచికరమైన వెజ్ బర్గర్ రెడీ (Veg Burger Ready).