MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Health
  • పాదాల ఆరోగ్యానికి తప్పకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే!

పాదాల ఆరోగ్యానికి తప్పకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే!

పాదాలు అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే వాటికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అందరిలోనూ పాదాల నొప్పులు, పాదాల మీద తెల్లటి, నల్లటి చారలు, పాదాలు వాపులు వంటి సమస్యలు ఉంటాయి. మనకు ఉన్న బిజీ లైఫ్ లో ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తాం. వాటికి తగిన శ్రద్ధ తీసుకోలేము. అయితే కొన్ని ఇంటి చిట్కాలను (Home tips) తెలుసుకోవడంతో మన పాదాలను సంరక్షించుకోవచ్చు. ఈ ఆర్టికల్ (Articles) ద్వారా వాటి సంరక్షణ గురించి తెలుసుకుందాం. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 06 2021, 05:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

పాదాల సంరక్షణకు (Foot care) ముందుగా పాదాలకు సరిపడు పాదరక్షలను ఎంచుకోవాలి. పాదాల సమస్యలకు ముఖ్యంగా కారణం మనం ఎంచుకునే చప్పల్స్. కనుక చప్పల్స్ (Chappals) ఎంచుకునే  విధానంలో మీరు తగిన జాగ్రత్త తీసుకోవాలి. మీ పాదాలకు సరిపడు మంచి ఎన్నికైన వాటిని తీసుకోవడంతో మీ పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

సాధారణంగా పాదాలు (Foot) పొడిబారి నిర్జీవంగా, అందవిహీనంగా కనిపిస్తాయి. అందుకు స్నానం చేసిన వెంటనే పాదాలకు మాయిశ్చరైజర్ (Moisturizers) ను అప్లై చేసుకోవడం మంచిది. ఈ మాయిశ్చరైజర్ పాదాలకు సరిపడే తేమను అందించి పొడిబారకుండా చేస్తాయి.
 

38

పాదాలు అందంగా కనిపించడానికి చాలా మంది నెయిల్ పెయింట్ (Nail polish) ను ఎక్కువగా వాడుతారు. నెయిల్ పెయింట్ ను ఎంచుకునే విధానంలో జాగ్రత్తగా ఉండాలి. మంచి బ్రాండెడ్ నెయిల్ పెయింట్లు ఎంచుకోవడం మంచిది. అప్పుడే మన పాదాలు అందంగా, ఆరోగ్యంగా (Healthy) ఉంటాయి.
 

48

పాదాల పట్ల ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గోళ్లు ఎక్కువగా పెరగకుండా ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి. అప్పుడే గోళ్లలో మురికి చేరకుండా ఉంటుంది. ఇన్ఫెక్షన్ (Infection) బారినుంచి కాపాడుకోవచ్చు. పాదాలకు తగిన విశ్రాంతి (Rest) ఇవ్వాలి.
 

58

స్నానం చేసేటపుడు కొద్ది సమయాన్ని మీ పాదాలకు కేటాయించండి. స్ర్కబ్బర్ (Scrubber) తో రుద్ది శుభ్రపరచుకోవాలి. అప్పుడే మన పాదాల మీద మురికి పోయి అందంగా, మృదువుగా కనిపిస్తాయి. ఎక్కువ సేపు షూలు ధరించడం ద్వారా పాదాలకు చెమట (Sweat) వేస్తుంది. దీనితో పాదాల నుంచి దుర్వాసన వస్తుంది.
 

68

అప్పుడప్పుడు పాదాలకు గాలి తగిలే విధంగా బయట ఉంచడం మంచిది. ఉప్పు, నిమ్మరసం కలిపి బాగా రుద్దుకుంటే పాదాలపై ఉన్న మృతకణాలు పోయి పాదాలు చక్కగా అందంగా కనిపిస్తాయి. బొప్పాయి (Papaya) గుజ్జులో కొంచెం తేనె (Honey) కలిపి దీన్ని పాదాలపై ప్యాక్ ల వేసుకోవాలి. బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో పాదాలను శుభ్రపరుచుకోవాలి. 
 

78

పాదాలు పొడిబారి చిట్లుతుంటే రాత్రిపూట పడుకునే ముందు కొబ్బరి నూనెతో మర్దన చేసుకోవాలి. దీంతో పాదాలకు తగిన విశ్రాంతి లభిస్తుంది.  గోరువెచ్చని నీటిలో గులాబీరేకులు, ఉప్పు (Salt), నిమ్మరసం (Lemon juice) వేసి అందులో ఐదు నిమిషాలు మీ పాదాలను పెట్టి బయటకు తీయాలి. తరువాత పొడి టవల్ తో మీ పాదాలను శుభ్రపరచుకోవాలి.
 

88

పాదాలకు తగిన మాయిశ్చరైజ్ క్రీమ్స్ ను అప్లై చేసుకోవాలి. దీంతో మీ పాదాలు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి. పెడిక్యూర్ చేసుకోవడం, పాదాలకు మసాజ్ (Massage) లు చేసుకోవడంతో పాదాల చర్మం మీద కణాలు యాక్టివ్ గా ఉండి చర్మ (Skin) సమస్యలను దూరంగా ఉంచుతాయి.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved