అరికెలను తింటున్నారా.. మీ శరీరంలో కలిగే మార్పులు, ప్రయోజనాలు ఇవే!
చిరుధాన్యాలలో అరికెలు (Arikelu) చాలా ముఖ్యమైనవి. అరికెలు తీపి, వగరు, చేదు రుచులను కలిగి ఉంటాయి. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతాయి. కనుక అరికెలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతారు. మరి అరికెలను తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అరికెలలో క్యాల్షియం, ఐరన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) కూడా ఉంటాయి. అరికెలలో ఉండే పోషక విలువలు (Nutritional values) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అరికెలతో అన్నం, ఉప్మా వంటివి వండుకుని తినవచ్చు. ఎన్నో పోషకాలను కలిగిన అరికెలను ఆహారంగా తీసుకుంటే జీవితకాలం పెరుగుతుంది.
ఉదర సమస్యలను తగ్గిస్తాయి: అరికెలలో ఉండే పోషకాలు ఉదర భాగాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని తీసుకుంటే కడుపులో నొప్పి, వాంతులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ (Gastric problem) వంటి ఉదర సమస్యలకు (Abdominal problems) దూరంగా ఉండవచ్చు.
మధుమేహగ్రస్తులకు మంచిది: అరికెలలో ఉండే పోషకాలు షుగర్ లెవెల్స్ (Sugar levels) రక్తంలో కలవకుండా అడ్డుకొని మధుమేహాన్ని (Diabetes) నియంత్రణలో ఉంచుతాయి. కనుక అరికెలు మధుమేహగ్రస్తులకు మంచి హెల్దీ ఫుడ్ అని వైద్యులు చెబుతున్నారు.
క్యాన్సర్ ను తగ్గిస్తాయి: అరికెలలో యాంటీఆక్సిడెంట్స్ (Antioxidants) పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని క్యాన్సర్ కణాల వ్యాప్తిని అరికట్టి క్యాన్సర్ విరుగుడుగా సహాయపడుతాయి. దీంతో క్యాన్సర్ (Cancer) వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
నెలసరి సమస్యలు తగ్గిస్తుంది: నెలసరి సమయంలో అధిక రక్తస్రావం (Bleeding) కారణంగా మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటప్పుడు మహిళలు అరికెలను ఆహారంగా తీసుకుంటే నెలసరి సమస్యలు (Menstrual problems) తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు.
జ్వరాలను తగ్గిస్తుంది: డెంగ్యూ, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు (Toxic fevers) వచ్చినప్పుడు అరికెలను తీసుకుంటే రక్త శుద్ధి (Purifying the blood) జరిగి త్వరగా కోలుకునేందుకు సహాయపడతాయి. ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించడానికి కూడా అరికెలు సహాయపడతాయి.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది: అరికెలలో అధికమొత్తంలో మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందించి వ్యాధులతో (Diseases) పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. శరీర రోగనిరోధక శక్తిని (Immunity) పెంచి అనేక వ్యాధుల నుంచి కాపాడుతాయి.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: అరికెలలో ఫైబర్ (Fiber) పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను (Digestion) మెరుగుపరిచి జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా మలబద్దకం వంటి సమస్యలను కూడ తగ్గిస్తాయి.
ఎముకలు దృఢంగా ఉంటాయి: అరికెలలో ఉండే క్యాల్షియం (Calcium) ఎముకల దృఢత్వానికి (Bone Strength) సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలను తగ్గిస్తుంది.
వీటితో పాటు నిద్రలేమి (Insomnia) సమస్యలు, గుండె జబ్బులు, స్థూలకాయం (Obesity) వంటి సమస్యలు కూడ తగ్గుతాయి. కనుక అరికెలను ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది.