Health Tips: ఫ్యామిలీ ప్యాక్ సిక్స్ ప్యాక్ అవ్వాలంటే.. తప్పకుండా చేయవలసిన ఎక్సర్సైజులు!
Health Tips: బానలాంటి పొట్టను కరిగించాలంటే చాలా కష్టపడాలి. అందుకే బాన పొట్టని తగ్గించడం కోసం, సరైన శరీర ఆరోగ్యం కోసం తప్పనిసరిగా ఇలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అంటున్నారు ఫిట్నెస్ నిపుణులు అవేంటో చూద్దాం.
బాడీని కరెక్ట్ షేపులో ఉంచుకోవడం కోసం కొన్ని ఎక్సర్సైజులు సూచించారు ఫిట్నెస్ నిపుణులు అందులో కొన్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా స్కేటర్లు. స్కేటర్ లంజ్స్ చెరుకుదనాన్ని పెంచుతాయి. దీనివల్ల బలంగా, ఫిట్టింగ్ తయారవుతాము. ముందుగా పాదాలని వెడల్పుగా ఉంచే నిలబడండి.
ఇప్పుడు మీ ఎడమ కాలనీ కుడివైపుకి తీసుకురండి. మీ కుడి మోకాలు దాదాపు నేలను తాకే వరకు లంజ్ లోకి క్రిందికి వంచండి. ఆ తర్వాత యధా స్థానానికి వచ్చి మళ్లీ మరో కాలితో అలా చేయండి. అలాగే కార్డియో వాస్కులర్, ఏరోబిక్స్ కూడా శరీరాన్ని చక్కని షేపులో ఉంచడానికి, బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ అత్యంత ప్రజాదరణ పొందిన కార్డియో వ్యాయామాలు. ఈ వ్యాయామాలు హృదయ స్పందన రేటుని పెంచడమే కాకుండా మీ రక్తంలో ఆక్సిజన్ స్థాయిని కూడా పెంచుతుంది. బొడ్డు చుట్టూ ఉండే కొవ్వుని కరిగించడానికి జుంబా డాన్స్ కూడా ఎంతో మంచిది. డాన్స్ తో కూడిన ప్రసిద్ధ ఆరోబిక్ వ్యాయామం ఇది.
శరీరం అంతా కొవ్వు కరిగించటానికి వీలు కల్పించే నృత్య విధానాలను కలిగి ఉంటుంది. జుంబా డాన్స్ చేయడం వలన ఒక ఎక్సర్సైజ్ చేస్తున్న ఫీలింగ్ రాదు. ఆనందంగా డాన్స్ చేస్తూ బరువు తగ్గవచ్చు. గ్రూప్ తో కలిసి చేయడం వలన మరింత సరదాగా ఉంటుంది.
అలాగే సెటిల్ బెల్స్ వింగ్స్ కూడా మంచి వ్యాయామము. మీ కాళ్ళ మధ్య సెటిల్ బెల్ ఉంచి నిలబడండి, సెటిల్ బెల్ ను అందుకోవడానికి మీ మోకాళ్ళను ఉంచండి. మీ నడుము నుంచి వెళ్లటం వల్ల వీపుపై ఒత్తిడి పడుతుంది. మీ కాళ్ళ మధ్య స్వింగ్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ శరీరాన్ని చక్కగా టోన్ చేస్తుంది.
వీటితోపాటు రష్యన్ ట్విస్ట్ లు, లెగ్ లిఫ్టులు, ప్లాంక్, క్రంచెస్, సిట్అప్ మొదలైనవి బెల్లీ ఫ్యాట్ ని బాగా తగ్గిస్తాయి. కానీ ఇందులో ఉండే ఎక్సర్సైజులు బాగా అవగాహన చేసుకుని అప్పుడు ఏంటి అంతేకానీ అవగాహన లేకుండా ఈ ఎక్సర్సైజ్ లు అస్సలు చేయకండి.