MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Health
  • సాక్సులు వేసుకుని నిద్రపోతే ఏమౌతుందో తెలుసా?

సాక్సులు వేసుకుని నిద్రపోతే ఏమౌతుందో తెలుసా?

చలిపెట్టకుండా స్వెట్టర్ వేసుకుని నిండా దుప్పటి కప్పుకోవడంతో పాటుగా కాళ్లకు సాక్సులు కూడా వసుకుంటుంటారు. కానీ సాక్సులు వేసుకుని నిద్రపోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 21 2024, 10:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
socks

socks

చలికాలంలో చాలా మందికి రాత్రిపూట సాక్సులు వేసుకుని నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఎందుకంటే సాక్సులు కాళ్లను వెచ్చగా ఉంచుతాయి. కొంతవరకు చలిని తగ్గిస్తాయి. ఇది అందరికీ తెలుసు. కానీ రాత్రిపూట సాక్సులు వేసుకుని పడుకోవడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు మాత్రం చాలా మందికి తెలియవు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రాత్రిపూట సాక్సులను వేసుకుంటే పాదాలు వెచ్చగా ఉంటాయి. కంఫర్ట్ గా ఉంటుంది. అంతేకాదు కాదు ఇది మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. అసలు రాత్రిపూట సాక్సులు వేసుకుని పడుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

36
<p>Socks</p>

<p>Socks</p>

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది

రాత్రి పడుకునేటప్పుడు సాక్సులను వేసుకోవడం వల్ల కలిగే మొదటి ప్రయోజనం.. మన శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ముందే రాత్రిళ్లు చలి విపరీతంగా పెడుతుంది. దీంతో పాదాలు చల్లగా అవుతాయి. దీంతో రక్త నాళాలు సంకోచించబడతాయి. దీంతో రక్త ప్రసరణ తగ్గుతుంది. అదే మీరు సాక్సులను వేసుకుని పడుకుంటే మీ శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో మీకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

46

మంచి నిద్రకు సహాయపడుతుంది

చలికాలంలో రాత్రిపూట చలివల్ల సరిగ్గా నిద్రపట్టదు. అయితే మీరు సాక్సులను వేసుకుని గనుక పడుకుంటే బాగా నిద్రపోతారు. అవును సాక్సుల వల్ల పాదాలు వెచ్చగా ఉంటాయి. దీంతో మీరు కంటినిండానిద్రపోతారు. పాదాలు వెచ్చగా ఉంటే మీ మెదడు మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయమని గుర్తు చేస్తుంది. దీంతో మీరు వెంటనే నిద్రపోతారు. అలాగే ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా నిద్రపోగలుగుతారు. చలి ఎక్కువగా ఉంటే అసౌకర్యంగా ఉంటుంది. దీంతో మీరు రాత్రిళ్లు తరచుగా మేల్కోవాల్సి వస్తుంది. 
 

56

పొడి చర్మం సమస్య ఉండదు

పగిలిన మడమలు, పొడి చర్మం ఉన్నవారు రాత్రిపూట సాక్సులు వేసుకుని నిద్రపోవడం మంచిది. ఎందుకంటే సాక్సులు మీ చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడతాయి. మీరు గనుక ఫుట్ క్రీమ్ లేదా లోషన్ అప్లై చేసి సాక్సులు వేసుకుని పడుకుంటే మీ పాదాల చర్మం ఎండిపోకుండా ఉంటుంది. దీంతో మీ పాదాలు సున్నితంగా ఉంటాయి. పాదాల పగుళ్లు ఏర్పడే ప్రమాదం కూడా తగ్గుతుంది. పగుళ్లు ఉన్నా తగ్గిపోతాయి. 
 

66

సంక్రమణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

సాక్సులను వేసుకుని పడుకోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీ పాదాలను సాక్సులతో కప్పడం, రక్షించడం వల్ల పగుళ్లు లేదా కోతల నుంచి చర్మం లోపలికి బ్యాక్టీరియా,  శిలీంధ్రాలు వెళ్లే అవకాశం ఉండదు. ముఖ్యంగా మీ బెడ్ పై పెంపుడు జంతువులు పడుకుంటే మాత్రం ఖచ్చితంగా సాక్సులను వేసుకునే పడుకోండి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved