90 రోజులు.. రోజూ 5 గంటలకే నిద్రలేస్తే ఏమౌతుందో తెలుసా?
చాలా మంది రాత్రిపూట లేట్ గా పడుకుని ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తుంటారు. కానీ ఇది మంచి అలవాటు అస్సలు కాదు. మీరు గనుక ఒక 3 నెలలు ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే నిద్రలేస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారో తెలుసా?
మనలో చాలా మందికి తెల్లవార్లూ ఫోన్ చూస్తూ.. ఏ సగం రాత్రికో నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఇలాంటి వారే ఉదయం 9, 10 అయినా నిద్రలేవరు. కానీ ఈ అలవాటు అస్సలు మంచిది కాదు. ఎవ్వరికైనా సరే రాత్రి ఆలస్యంగా పడుకుని, ఉదయం లేట్ గా నిద్రపోయే ఇష్టం ఉండదు. కానీ ఇది సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది.
మీరు గనుక లేట్ గా పడుకుని, ఉదయం లేట్ గా నిద్రలేచే అలవాటు నుంచి బయటపడాలంటే 90 రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు నిద్రలేవడం అలవాటు చేసుకోండి. ఇది వినడానికి చాలా కష్టంగా ఉండొచ్చు. అలాగే మొదట్లో ఉదయాన్నే నిద్రలేవడం చాలా కష్టం.
కానీ ఈ అలవాటు మీ శరీరంలో ఎన్నో మార్పులను తీసుకొస్తుంది. వీటిని చూసి మీరే ఆశ్చర్యపోతారు. 3 నెలల పాటు మీరు ప్రతిరోజూ ఉదయాన్నే 5 గంటలకు నిద్రలేస్తే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఉదయం 5 గంటలకు నిద్రలేవడం వల్ల వచ్చే శారీరక మార్పులు
బరువు తగ్గుతారు: మీరు ప్రతిరోజూ ఉదయాన్నే 5 గంటలకు నిద్రలేవడం వల్ల మీరు వ్యాయామం చేయడానికి, ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తినడానికి సరిపోయే సమయం మీకు లభిస్తుంది. మీరు ఇలా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ను తినడం వల్ల మీరు తొందరగా బరువు తగ్గుతారు.
మెరుగైన జీర్ణక్రియ: మీరు గనుక 90 రోజులు ఉదయాన్నే నిద్రలేవడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ అలవాటు వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. అలాగే వచ్చే సమస్య కూడా ఉండదు.
విటమిన్ డి: ప్రతిరోజూ మీరు ఉదయాన్నే 5 గంటలకు నిద్రలేవడం వల్ల మీరు ఉదయం సూర్యరశ్మిని పొందుతారు. ఉదయపు ఎండ విటమిన్ డికి మంచి వనరు. ఇది మీ శరీరంలో శక్తి స్థాయిలను పెంచడానికి మీకు బాగా సహాయపడుతుంది. అంతేకాదు ఉదయాన్నే నిద్రలేవడం వల్ల మీరు రోజంతా ఫ్రెష్ గా ఫీలవుతారు.
ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది: ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు. అయితే మీ రోగనిరోధక శక్తిని బలంగా ఉండాలంటే మీరు కంటినిండా నిద్రపోవాలి. మీరు ఉదయాన్నే నిద్రలేస్తే రాత్రిపూట మీకు సమయానికి నిద్ర వస్తుంది. అలాగే మీ జీవ గడియారం కూడా తదనుగుణంగా పనిచేస్తుంది. ఇది మీకు బాగా నిద్రపట్టేలా చేస్తుంది.
గుండె ఆరోగ్యం: రోజూ ఉదయాన్నే మీరు 5 గంటలకు నిద్రలేవడం అలవాటు చేసుకుంటే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ప్రతిరోజూ వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం వల్ల మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కండరాలు బలంగా ఉంటాయి: మీరు ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడం వల్ల మీ కండరాలు బలంగా అవుతాయి. ఇది మీ శరీర శక్తిని పెంచుతుంది.
ఉదయం 5 గంటలకు నిద్రలేవడం వల్ల కలిగే మానసిక మార్పులు
ఒత్తిడిని తగ్గిస్తుంది: ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మీరు ఉదయం 5 గంటలకే నిద్రలేవడం వల్ల మీకు తగినంత టైం దొరుకుతుంది. ఇది మిమ్మల్ని ప్రశాంతంగా, శాంతిగా ఉంచుతుంది.
మీరు ఉదయాన్నే నిద్రలేవడం వల్ల మీరు ముఖ్యమైన పనులను తొందరగా పూర్తి చేస్తారు. అలాగే మీరు రాత్రిపూట బాగా నిద్రపోవడ వల్ల మీ జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. అంతేకాదు ఈ అలవాటు మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది.