Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Health
  • ఉదయపు ఎండలో నిలబడితే ఇన్నిరోగాలు తగ్గిపోతాయా?

ఉదయపు ఎండలో నిలబడితే ఇన్నిరోగాలు తగ్గిపోతాయా?

సూర్యరశ్మిలో ఉండే అతినీలలోహిత కిరణాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ఇవి చర్మ  సమస్యలను తగ్గిస్తాయి. దురద, ఎర్రబారడం వంటి చర్మ సమస్యలను ఇట్టే తగ్గిస్తాయని కనుగొన్నారు.

Mahesh Rajamoni | Updated : May 31 2023, 07:15 AM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సూర్యరశ్మి కూడా ఎంతగానో సహాయపడుతుంది. ఉదయం కాసేపు సూర్యరశ్మిలో ఉండటం వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్ డి అందుతుంది. అలాగే మన చర్మానికి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే సూర్యరశ్మిలో ఎక్కువ సేపు ఉంటే వడదెబ్బ, చర్మ క్యాన్సర్  వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే చర్మ ఆరోగ్యానికి తగినంత సూర్యరశ్మి పొందడం చాలా అవసరమని పరిశోధకులు అంటున్నారు.

25
Image: Getty Images

Image: Getty Images

సోరియాసిస్, తామర సమస్యలతో బాధపడుతున్న వారిపై పరిశోధకుల బృందం ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనంలో పాల్గొనేవారిలో ఎక్కువ మందికి సోరియాసిస్, తామర లక్షణాలను తగ్గించడానికి సూర్యరశ్మి ఎంతో సహాయపడిందని కనుగొన్నారు. సూర్యరశ్మిలో ఉండే అతినీలలోహిత కిరణాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయని కనుగొన్నారు.
 

35
Asianet Image

ఈ చర్మ సమస్యల వల్ల వచ్చే దద్దుర్లు, ఎర్రబారడం, దురదను సూర్యకిరణాల్లో ఉంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తగ్గిస్తాయని అధ్యయనంలో తేలింది" అని జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుడు డాక్టర్ సంజీవ్ కుమార్ చెప్పారు. 

45
Asianet Image

చర్మ క్యాన్సర్, అకాల వృద్ధాప్యం ఉన్న సోరియాసిస్, తామరతో బాధపడుతున్న రోగులు సూర్యరశ్మికి ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ సూర్యరశ్మి ఈ సమస్యలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని, పేషెంట్ల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. 

 

55
Asianet Image

సూర్యరశ్మిలో ఉండటం వల్ల శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ఉదయపు సూర్యరశ్మి కూడా మంచి నిద్రను పొందడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. సూర్యరశ్మి మనల్ని రోజంతా తాజాగా, ఎనర్జిటిగ్ ఉంచడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
ఆరోగ్యం
 
Recommended Stories
Top Stories