దిండు లేకుండా పడుకుంటే ఇన్ని లాభాలున్నాయా..?
చాలా మందికి దిండులేనిదే నిద్రపట్టదు. కానీ... ఆ దిండు లేకుండా పడుకోవడం అలవాటు చేసుకుంటే... చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
రోజంతా కష్టపడిన తర్వాత రాత్రి ప్రశాంతంగా నిద్రపడితే చాలా హాయిగా ఉంటుంది. మంచి బెడ్, తల కిందకు దిండు ఉంటే... చాలా మందికి ప్రశాంతంగా నిద్రపడుతుంది. కానీ.. దిండు వేసుకొని పడుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా..? చాలా మందికి దిండులేనిదే నిద్రపట్టదు. కానీ... ఆ దిండు లేకుండా పడుకోవడం అలవాటు చేసుకుంటే... చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
దిండు లేకుండా నిద్రపోవడం అలవాటు చేసుకుంటే.. మొదటగా మెడ నొప్పి రాకుండా ఉంటుందట. దిండు సరిగా లేకుండా ఉండటం వల్ల.. ఎలా పడితే అలా పడుకొని చాలా మంది మెడ నొప్పులు వస్తూ ఉంటాయట.
అంతేకాదు.. చాలా మందికి తలనొప్పి రావడానికి కూడా దిండు కారణం అంటే మీరు నమ్ముతారా..? దిండు లేకుండా నిద్రపోవడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని మీకు తెలుసా..? అవును, దిండు లేకుండా నిద్రించడం వల్ల వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందడమే కాకుండా తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.
మెడనొప్పి నుంచి ఉపశమనం: మెడనొప్పి ఈరోజుల్లో సర్వసాధారణమైన సమస్య. దాదాపు అన్ని వయసుల వారు దీనితో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం దిండుపై నిద్రపోవడమే. అలాగే తల లేకుండా పడుకోవడం వల్ల మెడ నొప్పి సమస్య రాదు.
మంచి నిద్రలో సహాయపడుతుంది: మీరు మంచి నిద్ర పొందాలనుకుంటే, దిండు లేకుండా నిద్రపోవడాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇది మీ అలసట నుండి ఉపశమనం కలిగిస్తుంది. మంచి రాత్రి నిద్ర పొందడానికి సహాయపడుతుంది. దీని వల్ల మీరు ఉదయం లేవగానే పూర్తిగా రిఫ్రెష్ గా ఉంటారు.
ఒత్తిడిని దూరం చేస్తుంది: ఈ బిజీ లైఫ్‌స్టైల్‌లో వ్యక్తులకు ఒత్తిడి పెద్ద సమస్యగా మారింది. కానీ దిండు లేకుండా నిద్రపోవడం మీ తల పైకి వెళ్లకుండా చేస్తుంది, ఇది మీ మెదడుకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.