ఇదొక్కటి చాలు.. మీరు బరువు తగ్గడం నుంచి పొడవు పెరగడం వరకు ఎన్నో లాభాలను పొందడానికి
వ్యాయామాలు మన శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ ముచ్చట అందరికీ తెలుసు. అయితే ఎలాంటి వ్యాయామాలు చేయాలి? ఎలా చేయాలి? అని చాలా మందికి డౌట్ వస్తుంది. అలాగే వ్యాయామాలను చేసేంత తగినంత టైం కూడా ఉండదు. ఇలాంటి వారికి స్కిప్పింగ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది తెలుసా?
ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల ఒకటేమిటీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అవును రెగ్యులర్ గా వ్యాయామం చేసేవారికి అనారోగ్య సమస్యలొచ్చే అవకాశం చాలా తక్కువ. కొంతమంది రెగ్యులర్ వ్యాయామం చేస్తే.. మరికొంతమంది మాత్రం దాని జోలికే వెళ్లరు. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం తప్పకుండా శారీరక శ్రమ చేయాలి. మీకు గంటల తరబడి వ్యాయామం చేసేంత సమయం లేదంటే ప్రతి రోజూ స్కిప్పింగ్ అన్నా చేయండి. ఇది మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
స్కిప్పింగ్ కు మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్యాన్సీ యంత్రాలు కూడా అవసరం లేని వ్యాయామం ఇది. ఈ వ్యాయామం చేయడానికి మీకు కావాల్సిందల్లా ఒక తాడు, కొంచెం స్థలం. నిజానికి స్కిప్పింగ్ మీకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. క్రిస్ క్రాస్, సైడ్ స్వింగ్, ప్రత్యామ్నాయ ఫుట్ జంప్ వంటి ఎన్నో మార్గాల్లో మీరు స్కిప్పింగ్ చేయొచ్చు. అసలు రెగ్యులర్ గా స్కిప్పింగ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మన చేతులు దృఢంగా మారుతాయి.
దీనివల్ల మీ శరీరం మొత్తం ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది.
స్కిప్పింగ్ వల్ల కాళ్ల కండరాలు దృఢంగా ఉంటాయి.
మీ ఆరోగ్యంగా ఉంటుంది.
మీ ఎముకలు దృఢంగా ఉంటాయి.
శరీరం చురుగ్గా మారుతుంది.
శరీర సమతుల్యత బాగుంటుంది.
శరీరంలో అదనపు కేలరీలు బర్న్ అవుతాయి.
కొవ్వు కరుగుతుంది.
ఎండార్ఫిన్ల ఉత్పత్తి పెరుగుతుంది.
మూడ్ ను రిఫ్రెష్ చేస్తుంది.
వ్యాయామానికి ముందు ఈ స్కిప్పింగ్ మీ శరీరాన్ని వేడెక్కిస్తుంది.
కండరాలను టోన్ చేస్తుంది.
స్కిప్పింగ్ వల్ల పొడవు పెరుగుతారు.
ఉదయం ముఖం వాపు ఉంటే తగ్గుతుంది.
ఈ విషయాన్ని గుర్తుంచుకోండి
మీరు ఎలాంటి వ్యాయామం చేసినా.. దానికంటే ముందు మీరు 3-5 నిమిషాలు స్కిప్పింగ్ చేయండి. దీనివల్ల మీ కండరాలు వేడెక్కుతాయి. మీరు వ్యాయామంగా స్కిప్పింగ్ చేయొచ్చు. ఇందుకోసం సాధ్యమైనంత ఎత్తుకు దూకడానికి ప్రయత్నించండి. ఇది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచే మంచి కార్డియో కూడా. ఇది కేలరీలను కరిగించి మీరు బరువు తగ్గేలా చేస్తుంది. మీకు పరిగెత్తాలని అనిపించని లేదా కొన్ని కారణాల వల్ల ఇంటి నుంచి బయటకు వెళ్లలేని రోజు మీరు వ్యాయామం చేయడానికి జంపింగ్ రోప్ ఉత్తమ మార్గం.