తొక్కలే కదా అని తీసిపారేయకండి.. వీటితో బోలెడు లాభాలున్నాయి మరి..
చాలా మంది పండ్లు, కూరగాయల తొక్కలు తీసేసి డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు. నిజానికి ఈ తొక్కల్లో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో పోషకాలు ఉంటాయి తెలుసా..?
- FB
- TW
- Linkdin
Follow Us
)
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు, కూరగాయలను పుష్కలంగా తినాలి. ఎందుకంటే వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు మన శరీరంలో పోషకాల పరిమాణాన్ని కాపాడుతాయి. అయితే టేస్ట్ కోసం చాలా మంది పండ్లు లేదా కూరగాయల తొక్కలను తీసేసి తింటుంటారు. కానీ వీటి తొక్కలను తీసేస్తే వీటిలో పోషకాలు తగ్గుతాయి తెలుసా..? ఎందుకంటే తొక్కల్లో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పండ్లు, కూరగాయలతో పాటుగా వాటి తొక్కలు కూడా మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. అవేంటంటే..
జీర్ణవ్యవస్థపై తొక్కల ప్రభావాలు
కూరగాయలు, పండ్ల తొక్కల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కానీ చాలా మంది వీటి తొక్కలను తీసేస్తారు. అయితే జీర్ణసమస్యల వల్ల కొంతమంది తొక్కలను అరిగించుకోలేక తొక్కలను తినరు. అందుకే చాలా మంది తొక్కను తీసేసే తింటుంటారు. కానీ దోసకాయ, టమోటాలు, ఆపిల్, ద్రాక్ష, పియర్స్ వంటి పండ్లు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. వీటితో పాటుగా వీటి తొక్కలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.
ఏ పండ్లు, కూరగాయల తొక్కలు సులభంగా జీర్ణమవుతాయి
ఆపిల్, చెర్రీలు, బెర్రీలు, ద్రాక్ష పండ్లు, పీచెస్, ప్లమ్స్, దోసకాయలు, వంకాయలు, బఠానీలు, టమోటాలు, బంగాళాదుంపలు, దోసకాయలు, గుమ్మడికాయ తొక్కలు చాలా సులువుగా జీర్ణమవుతాయి.
ఏ పండ్లు, కూరగాయల తొక్కలు సులభంగా జీర్ణం కావు
పుచ్చకాయ, ఖర్బూజా, మామిడి, అవొకాడో, ఉల్లిపాయ, లిచీ, పైన్ ఆపిల్, బొప్పాయి, బీట్ రూట్, నిమ్మ, నారింజ, జాక్ ఫ్రూట్ తొక్కలు అంత తొందరగా జీర్ణం కావు.
పోషకాలు ఎక్కువగా ఉంటాయి
పొట్టు తీయని కూరగాయలు, పండ్లను తినడం వల్ల మన శరీరానికి పోషకాలు పుష్కలంగా అందుతాయి. తొక్కలతో సహా కూరగాయలను తినడం వల్ల శరీరానికి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా అందుతాయి. వీటిలో ఉండే ఎన్నో మొక్కల సమ్మేళనాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పొట్టు తీయని ఆపిల్ పండ్లలో 332 శాతం ఎక్కువ విటమిన్ కె, 142 శాతం విటమిన్ ఎ, 115 శాతం విటమిన్ సి, 20 శాతం ఎక్కువ కాల్షియం, 19 శాతం ఎక్కువ పొటాషియం ఉంటాయి.
ఎక్కువసేపు ఆకలి లేకపోవడం
తొక్కల్లో ఉండే ఫైబర్ వల్ల మన కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. ఎన్సీబీఐ ప్రకారం.. తొక్కలలో ఉండే ఫైబర్ ను విస్కోస్ ఫైబర్ అంటారు. దీన్ని తీసుకోవడం ద్వారా ఎక్కువసేపు ఆకలి వేయదు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరంలో గట్-ఫ్రెండ్లీ బ్యాక్టీరియా పెరుగుతుంది.
vegetable peels
వ్యాధుల నుంచి విముక్తి
ఎన్సీబీఐ ప్రకారం.. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే తొక్కలు ఫ్రీ రాడికల్స్ ను తొలగించడానికి సహాయపడతాయి. ఇది శరీరంలో పెరుగుతున్న ఆక్సీకరణ ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పండ్లు, కూరగాయల తొక్కల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు, అనేక రకాల క్యాన్సర్ల ప్రమాదం నుంచి శరీరాన్ని రక్షించడానికి సహాయపడతాయి. దీంతో పాటు న్యూరోలాజికల్ డిజార్డర్స్ ను కూడా దూరం చేస్తుంది.
ఏం గుర్తుంచుకోవాలి?
అయితే ప్రస్తుతం పంటలకు పురుగుల మందులను, ఇతర రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ఇది కూరగాయలు, పండ్లపై కూడా ప్రభావం చూపుతుంది. అయితే పురుగుల మందు పోవాలని కూరగాయలను, పండ్లను కడుగుతుంటారు. కానీ ఈ పురుగుల మందు తొక్కల్లోనే ఉంటుంది. ఇది శరీరానికి హాని కలిగిస్తుంది. కొన్ని తొక్కలు కఠినంగా ఉంటాయి. వీటిని నమలడం, తినడం అంత సులభం కాదు. అందుకే కఠినమైన తొక్కలను తినడం మానుకోండి. ఇది జీర్ణ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఉదర సంబంధిత సమస్యలు ఉంటే తొక్కలతో సహా పండ్లు, కూరగాయలను తినకండి.