చలికాలంలో చల్ల నీళ్లతో స్నానం చేస్తే ఏమౌతుంది?
ఏ కాలమైనా సరే కొంతమంది చల్ల నీళ్లతోనే స్నానం చేస్తుంటారు. కానీ చలికాలంలో చల్ల నీళ్లతో స్నానం చేస్తే ఏమౌతుందో తెలుసా?
చాలా మందికి చలికాలంలో స్నానమంటేనే ఎక్కడ లేని భయం కలుగుతుంది. ఎందుకంటే ముందే చలికాలం. స్నానం చేస్తే మరింత చలిపెడుతుంది. అయితే చాలా మంది ఈ సీజన్ లో వేడి వేడి లేదా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం అది వానాకాలమైనా, ఎండాకాలమైనా, చలికాలమైనా చల్ల నీళ్లతోనే స్నానం చేస్తుంటారు. అసలు చలికాలంలో చల్ల నీళ్లతో స్నానం చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
రక్త ప్రసరణ మెరుగు
చలికాలంలో చల్ల నీళ్లతో స్నానం చేయడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇది మీ శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది. మీరు చల్ల నీళ్లతో స్నానం చేసినప్పుడు మీ రక్త నాళాలు సంకోచించబడతాయి. దీంతో మీ శరీరమంతా రక్తం బాగా సరఫరా అవుతుంది. అలాగే శరీర మంట కూడా తగ్గుతుంది. మొత్తం గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది
చలికాలంలో చల్ల నీళ్లతో స్నానం చేస్తే మన ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందని ఆరోగ్య నిుణులు అంటున్నారు. చల్లనీటి స్నానం తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే శరీర సహజ రక్షణ సక్రియం అవుతుంది. దీంతో చలికాలంలో మీకు జలుబు, ఫ్లూ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. దీంతో మీరు ఆరోగ్యంగా, బలంగా ఉంటారు.
శక్తి పెరుగుతుంది
చలికాలంలో ఉదయాన్నే చల్ల నీళ్లతో స్నానం చేయడం మంచిది. ఎందుకంటే ఇది మీ శరీరంలో ఎనర్జీ లెవెల్స్ ను పెంచడానికి సహాయపడుతుంది. అలాగే రేపు ఉదయాన్నే శక్తివంతంగా మీరు మేల్కోవడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చన్నీటి స్నానం మీ శరీరం సహజ ఆడ్రినలిన్ ప్రతిస్పందనను సక్రియం చేస్తుంది. దీంతో మీరు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు.
చర్మం, జుట్టు ఆరోగ్యం
చల్ల నీళ్లు మన జుట్టుకు, చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. కూల్ వాటర్ చర్మ రంధ్రాలను బిగించడానికి, చర్మంలో మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే చర్మంలో రక్త ప్రవాహాన్ని కూడా మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. దీంతో మీ చర్మం మంచి రంగులో ఉంటుంది. అలాగే చల్ల నీళ్లు మీ జుట్టుకు మంచి షైనీగా చేస్తాయి. అలాగే స్మూత్ గా ఉంచడానికి సహాయపడతాయి.
మూడ్ ఇంప్రూవ్ మెంట్
చలికాలంలో చల్ల నీళ్లతో స్నానం చేయడం వల్ల మీ మానసిక స్థితి కూడా మెరుగుపడుతుందని పరిశోధనల్లో తేలింది. చల్లని నీటి షాక్ ఎండార్ఫిన్ల విడుదలను ప్రేరేపిస్తుంది. దీనిని "ఫీల్ గుడ్" హార్మోన్లు అని కూడా అంటారు. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపర్చడానికి, ఒత్తిడి, యాంగ్జైటీని తగ్గించడానికి సహాయపడుతుంది.