MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Health
  • రోజూ కరివేపాకు నీటిని తాగితే ఏమౌతుందో తెలుసా?

రోజూ కరివేపాకు నీటిని తాగితే ఏమౌతుందో తెలుసా?

కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. ఇవి మనల్ని ఎన్నో అంటువ్యాధులు, ఇతర రోగాలకు దూరంగా ఉంచడానికి సహాయపడతాయి. మీరు గనుక ప్రతిరోజూ ఉదయాన్నే కరివేపాకు నీటిని తాగడం అలవాటు చేసుకుంటే ఎన్నో జబ్బులకు దూరంగా ఉంటారో తెలుసా? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Oct 21 2024, 11:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కొత్తిమీర, పూదీనాతో పాటుగా మనం చేసే ప్రతి కూరలో కరివేపాకు ఖచ్చితంగా ఉంటుంది. ఇది కూరను మంచి వాసన వచ్చేలా చేయడమే కాదు.. మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అసలు ఈ కరివేపాకు మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తుందన్న సంగతి చాలా మందికి తెలియదు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

కరివేపాకును దక్షిణ భారతదేశంలో ప్రతి వంటలో ఉపయోగిస్తారు. నిజానికి కరివేపాకు ఎన్నో ఔషధ గుణాలున్న మొక్క. ఈ ఆకులు మనకు కడుపు సమస్యల నుంచి మంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి. 

కరివేపాకులో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఇమ్యూనిటీ పవర్ ను బాగా పెంచుతాయి. ఈ కరివేపాకులతో పొడి లేదా చట్నీ చేసుకుని కూడా తినొచ్చు. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అయితే ప్రతిరోజూ ఉదయాన్నే కరివేపాకు నీటిని తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు జరుగుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

35
Benefits of drinking curry leaves water

Benefits of drinking curry leaves water

జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది

కరివేపాకులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. మీరు ఉదయాన్నే కరివేపాకు నీటిని తాగితే మీ కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. అంటే మలబద్ధకం వంటి సమస్యలు వెంటనే తగ్గిపోతాయి. ఇది మలబద్దకంతో బాధపడుతున్న వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కరివేపాకు వాటర్ మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఈ నీటిని తాగితే మలబద్దకంతో పాటుగా అజీర్ణం వంటి సమస్యలు తగ్గిపోతాయి. 

గుండె ఆరోగ్యం

కరివేపాకు నీళ్లను తాగడం వల్ల మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కరివేపాకు వాటర్ శరీరంలో  కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. ఇది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 
 

45
benefits of Curry Leaves

benefits of Curry Leaves

చర్మానికి కూడా మేలు

కరివేపాకు వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. అంటే ఇది మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. మీరు గనుక ప్రతిరోజూ కరివేపాకు వాటర్ ను తాగితే మీ చర్మం కాంతివంతంగా, తేమగా ఉంటుంది. అంతేకాదు ఇది చర్మంపై ఉన్న మచ్చలను తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది. 

బరువు తగ్గడంలో సహాయం

బరువు తగ్గాలనుకునేవారికి కూడా కరివేపాకు వాటర్ బాగా సహాయపడుతుంది. ఈ నీటిని రోజూ తాగితే చాలా వరకు బరువు తగ్గుతారు. ఈ వాటర్ ను తాగితే మీ జీవక్రియ పెరుగుతుంది. ఈ వాటర్ ను తాగితే మీరు తిన్నది త్వరగా జీర్ణం అవుతుంది. అలాగే ఫాస్ట్ గా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. 
 

55


చక్కెరను నియంత్రిస్తుంది

కరివేపాకు వాటర్ డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎలా అంటే కరివేపాకు వాటర్ ను తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అకస్మత్తుగా షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం తగ్గుతుంది. 

జుట్టును బలపరుస్తుంది

కరివేపాకు వాటర్ ను తాగితే మీ జుట్టు కూడా హెల్తీగా ఉంటుంది. కరివేపాకులో ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ జుట్టును బలంగా ఉంచడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఈ వాటర్ ను రోజూ తాగితే జుట్టు రాలే సమస్య చాలా వరకు తగ్గుతుంది. అలాగే మీ జుట్టు షైనీగా ఉంటుంది. నల్లగా ఉంటుంది. పొడుగ్గా పెరుగుతుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved