MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Health
  • పొట్ట తగ్గాలంటే రాత్రిపూట అన్నం మానేయాలా?

పొట్ట తగ్గాలంటే రాత్రిపూట అన్నం మానేయాలా?

పొట్టను చాలా ఈజీ.. తగ్గించడమే చాలా కష్టం. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా ఇంచు కూడా తగ్గదు. అయితే రాత్రి పూట అన్నానికి బదులుగా వేరే ఆహారాలను తింటే సులువగా పొట్ట కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jan 29 2024, 04:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
belly fat

belly fat

నిజానికి బరువు పెరగడం, పొట్టను పెంచడం చాలా అంటే చాలా ఈజీ. వీటిని తగ్గించడమే చాలా కష్టమన్న సంగతి ప్రయత్నిస్తున్నప్పుడు తెలుస్తుంది. పొట్టను తగ్గించడానికి ఎన్నో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా లాభం ఉండదు. పొట్ట కరగకపోవడానికి మీరు చేసే కొన్ని పొరపాట్లే కారణం. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి మీరు చేయాల్సిన మొదటి పని ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ఫాలో అవ్వడం. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పెంపొందించుకోవడం. బెల్లీ ఫ్యాట్ తగ్గాలనుకునే వారు రాత్రిపూట అన్నం అసలే తినకూడదు. బదులుగా  మీరు తినాల్సిన కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవేంటంటే..? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆపిల్

రోజుకో ఆపిల్ పండును తింటే హాస్పటల్ కు వెళ్లాల్సిన అవసరం లేదన్న మాటను వినే ఉంటారుగా. అవును ఆపిల్ మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. యాపిల్స్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండు. ఆపిల్ పండును తింటే మీ ఆకలి చాలా వరకు తగ్గుతుంది. అలాగే హెవీగా తినకుండా ఉంటారు. దీంతో మీ బరువు తగ్గడం మొదలవుతుంది. పెక్టిన్ ఎక్కువగా ఉండే ఆపిల్ ఒంట్లో కొవ్వు పేరుకుపోకుండా నివారిస్తుంది. అందుకే రాత్రిపూట అన్నం తినకుండా ఒకటి లేదా రెండు యాపిల్స్ తిని పడుకోండి. 
 

36

జామకాయ

జామకాయ పోషకాలకు మంచి వనరు. ఇది కూడా మీరు బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. జామకాయలో కూడా ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వీటిలో పెక్టిన్ కూడా ఉంటుంది. పెక్టిన్ కణాలు కొవ్వును గ్రహించకుండా నిరోధిస్తుంది. ఇది మీరు బరువు తగ్గడానికి సహాయడుతుంది. అందుకే రాత్రిపూట ఆహారంలో జామపండును చేర్చుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు.
 

46

ఓట్స్

ఓట్స్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీన్ని రాత్రిపూట అన్నానికి బదులుగా తినడం ఉత్తమం. ఇది మిమ్మల్ని ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతుంది. ఒక కప్పు ఓట్ మీల్ లో 7.5 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది మీ ఆకలిని తగ్గిస్తుంది. అందుకే బరువు తగ్గడానికి, బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి రాత్రిపూట అన్నానికి బదులుగా ఓట్స్ ను తినండి. 
 

56

చపాతీలు

అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ కూర రుచిగా అయితే అన్నాన్ని ఎక్కువగా తింటుంటారు. ఇది మీ బరువును మరింత పెంచుతుంది. అందుకే రాత్రిపూట అన్నానికి బదులుగా చపాతీలు, వెజిటబుల్ కర్రీ తినడం అలవాటు చేసుకోండి. ఇది మీ బరువును నియంత్రిస్తుంది. 
 

66

బెర్రీలు

బెర్రీలు పోషకాలకు మంచి మూలం. ఈ పండ్లలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇలాంటి బెర్రీలను తినడం వల్ల మీ ఆకలి చాలా వరకు తగ్గుతుంది. దీంతో మీ బరువు తగ్గడంతో పాటుగా బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved