ఎర్ర కందిపప్పు ఫేస్ ప్యాక్స్.. ఒక్కసారి వాడితే మెరిసిపోయే సౌందర్యం మీ సొంతం!
కాంతివంతమైన ముఖం సౌందర్యం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి. దీని కోసం బయట మార్కెట్లో అందుబాటులో ఉండే బ్యూటీ ప్రొడక్ట్స్ (Beauty Products) లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే ఇందులోని కెమికల్స్ చర్మ సహజసిద్ధమైన సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. కనుక వంటింటిలో అందుబాటులో ఉండే ఎర్ర కందిపప్పు ఫేస్ ప్యాక్స్ (Masoor dal face packs) లను ఉపయోగిస్తే ముఖాన్ని అందంగా మెరిసేలా చేస్తాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. వీటి తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

ఎర్ర కందిపప్పు చర్మ సమస్యల్ని (Skin problems) తగ్గించడానికి చక్కగా సహాయపడుతుంది. ఎర్ర కందిపప్పుతో చేసుకునే రకరకాల ఫేస్ ప్యాక్ లు ముఖాన్ని తాజాగా ఉంచి అందంగా మెరిసేలా చేస్తాయి. ఇవి చర్మానికి కావలసిన పోషకాలను అందించి మొటిమలు, మచ్చలు, వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన మృత కణాలను (Dead cells) తొలగించి చర్మకణాలను శుభ్రపరుస్తాయి. ముఖంపై పేరుకుపోయిన జిడ్డును కూడా తొలగిస్తాయి.
ఎర్ర కందిపప్పు, పచ్చిపాలు: సగం కప్పు ఎర్ర కందిపప్పును (Masoor dal) రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులో పావు కప్పు పచ్చిపాలు (Milk) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ట్యాన్ ని తొలగించి చర్మ రంధ్రాలు తెరచుకొనేలా చేసి ముఖాన్ని మెరిసేలా చేస్తాయి. అలాగే జిడ్డును తొలగించి మొటిమల్ని రాకుండా అడ్డుకుంటుంది.
ఎర్ర కందిపప్పు, పాలు, పసుపు, కొబ్బరి నూనె: ఒక కప్పులో ఒక టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు పొడి (Masoor dal powder), రెండు టేబుల్ స్పూన్ ల పాలు (Milk), చిటికెడు పసుపు (Turmeric), మూడు చుక్కల కొబ్బరి నూనె (Coconut oil) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతి వేళ్లతో ముఖానికి అప్లై చేసుకుంటూ సున్నితంగా మర్దన చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజు చేస్తే ముఖం తాజాగా ఉంటుంది.
ఎర్ర కందిపప్పు, పాలు, బాదం నూనె: సగం కప్పు ఎర్ర కందిపప్పును (Masoor dal) రాత్రంతా నాననిచ్చి ఉదయాన్నే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టీస్పూన్ పచ్చి పాలు (Milk), ఒక టీస్పూన్ బాదం నూనె (Almond oil) కలిపి పేస్టులా చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. అరగంట తరువాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి. ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మెరవడమే కాదు, మచ్చలు, మొటిమలు కూడా తగ్గుతాయి.
ఎర్ర కందిపప్పు, బియ్యప్పిండి, పచ్చిపాలు: ఒక కప్పులో ఎర్ర కందిపప్పు పొడి (Masoor dal powder), బియ్యప్పిండి (Rice flour) సమాన భాగాలు తీసుకోవాలి. ఇందులో పచ్చి పాలు (Milk) వేసి ఫేస్ ప్యాక్ లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే చర్మకణాలలో పేరుకుపోయిన మృత కణాలు తొలగిపోయి చర్మం శుభ్రపడుతుంది.