Health Tips: మీకు ఈ అలవాట్లు ఉన్నాయా.. అయితే మీ ఊపిరితిత్తులు ప్రమాదంలో పడినట్లే!
Health Tips: శరీరంలో అత్యంత ప్రధానమైన అవయవం ఊపిరితిత్తులు. అయితే కొన్ని అలవాట్ల వల్ల ఇది ప్రమాదానికి గురవుతుంది. ఇంతకు ఆ అలవాట్లు మీకు ఉన్నాయేమో ఒకసారి తెలుసుకోండి.

ఊపిరితిత్తులు మనిషి శరీరంలో అత్యంత ప్రధానమైన అవయవం. ఊపిరితిత్తులు సరిగా పని చేయకపోతే సరిగ్గా శ్వాస పీల్చుకోలేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఊపిరితిత్తుల ఆరోగ్యం చాలా ముఖ్యం. కరోనా ఇన్ఫెక్షన్లు కూడా ఊపిరితిత్తుల మీద తీవ్ర ప్రభావాన్ని కలిగించాయి. చాలా సందర్భాలలో ఊపిరితిత్తులు పూర్తిగా పాడైన వరకు సదరు వ్యక్తి ఆ విషయాన్ని గుర్తించలేడు.
ఊపిరితిత్తులు ప్రమాదానికి గురైనప్పుడు మనం శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడతాం. ఇప్పుడు ఊపిరితిత్తులకు హాని కలిగించే అలవాట్లు ఏమిటో వాటి నుంచి ఎలా ఉపశమనం పొందవచ్చో తెలుసుకుందాం. ఇందులో మొదటగా వ్యాయామం గురించి తెలుసుకుందాం. శరీరానికి అవసరమైన వ్యాయామాన్ని చేయకపోతే దాని ప్రభావం ఊపిరితిత్తుల మీద పడుతుంది.
శరీరం చురుకుగా ఉన్నప్పుడు కండరాలు మరియు ఇతర కణాలకు ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది అందువలన ఊపిరితిత్తులకు ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది అందుకోసం తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. వ్యాయామ సమయంలో మీరు లోతుగా ఊపిరి పీల్చుకునేటప్పుడు శ్వాసకోస నాళాలని మెరుగుపరుచుకోవచ్చు.
వ్యాయామంలో ముఖ్యంగా నడక, సైక్లింగ్ లేదా ఈత వంటివి చేయటం వలన మీ ఊపిరితిత్తులతో పాటు గుండెకు కూడా చాలా మంచిది. ఇక ధూమపానం కూడా మీ ఊపిరితిత్తులకు పెద్ద శత్రువు. ధూమపానం చేసినప్పుడు ఊపిరితిత్తుల నిర్మాణం మారుతుంది. ఇది ఊపిరితిత్తుల వాపుని పెంచుతుంది అందువలన ధూమపానానికి ఎంత దూరంగా ఉంటే మీ ఊపిరితిత్తులకు అంత మేలు చేసిన వారు అవుతారు.
ఇక మూడవది మీరు కూర్చునే విధానం. నిజమేనండి కూర్చునే తీరు కూడా ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపిస్తుంది. మీరు కూర్చునే పద్ధతి మీరు శ్వాస తీసుకోవటానికి అనువుగా ఉన్నదై ఉండాలి. ఎలా పడితే అలా కూర్చోవడం తక్కువ శ్వాసను లోతుగా చేస్తుంది. శ్వాస పూర్తిగా తీసుకోలేనప్పుడు ఎక్కువ ఆక్సిజన్ ని తీసుకోలేరు కాలక్రమమైన నిస్సార శ్వాస మీ ఊపిరితిత్తులను బలహీన పరుస్తుంది.
కాబట్టి కూర్చునే విధానంలో కూడా జాగ్రత్తలు పాటించండి. ఇక మరొక ముఖ్యమైన అలవాటు జంక్ ఫుడ్ ఇది కూడా ఊపిరితిత్తుల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి జంక్ ఫుడ్ తినటం తగ్గించి ఫైబర్ ఫుడ్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధనలో నిరూపించబడింది. కాబట్టి మన ఆయువుకి ఆధారమైన ఊపిరితిత్తులని జాగ్రత్తగా కాపాడుకుందాం.