- Home
- Life
- Health
- వర్షాకాలంలో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే, ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆయుర్వేద చిట్కాలు మీకోసం..
వర్షాకాలంలో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే, ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆయుర్వేద చిట్కాలు మీకోసం..
వర్షాకాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఇది మనల్ని ఎన్నో అంటువ్యాధులు, ఇతర రోగాల బారిన పడేస్తుంది. అయితే కొన్ని ఆయుర్వేద చిట్కాలు మీ రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉంచుతాయి.

వానాకాలంలో స్టార్ట్ అయ్యింది. ఇక వెదర్ ఇప్పటి నుంచి చాలా చల్లగా ఉండబోతోంది. అందుకే మన ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే లేనిపోని రోగాలు వస్తాయి. రోగాల ముప్పు తప్పాలంటే మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం చాలా ముఖ్యం. వర్షాకాలంలో జలుబు, ఫ్లూ, ఇతర సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తాయి. అయితే ఈ సీజన్ లో ఎలాంటి రోగాలు రాకుండా ఉండేందుకు, మన రోగనిరోధక శక్తిని పెంచేందుకు కొన్ని ఆయుర్వేద చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. అవేంటంటే..
హైడ్రేటెడ్ గా ఉండండి
ఆరోగ్యంగా ఉండేందుకు మీరు చేయాల్సిన మొదటి పని మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం. అవును డీహైడ్రేషన్ ఎన్నో వ్యాధులకు దారితీస్తుంది. మీరు నీటిని పుష్కలంగా తాగితే మీ శరీరం నుంచి విషం బయటకు పోతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి అల్లం టీ లేదా తులసి టీ వంటి హెర్బల్ టీలను తాగండి. శీతల పానీయాలను అస్సలు తాగడం మానుకోండి.
balanced diet
సమతుల్య ఆహారం
తాజా పండ్లు, కూరగాయలు పుష్కలంగా ఉండే సమతుల్య ఆహారాన్ని తప్పకుండా తినండి. మామిడి, దోసకాయలు, బచ్చలికూర, ఇతర కూరగాయలు వంటి సీజనల్ కూరగాయలను, పండ్లను తినండి. ఇవి వర్షాకాలం రోగాల నుంచి మిమ్మల్ని కాపాడుతాయి. నిమ్మకాయలు, నారింజ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే వీటిని తినండి. వెల్లుల్లి, ఉల్లిపాయలు, అల్లం వంటి ఆహారాలను కూడా మీ ఆహారంలో చేర్చండి. ఎందుకంటే ఇవి రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగుంటాయి.
spices
మసాలా దినుసులు
వర్షాకాలంలో మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మీ ఆహారంలో మసాలా దినుసులను కూడా చేర్చండి. పసుపు, జీలకర్ర, ధనియాలు, నల్ల మిరియాలు, దాల్చినచెక్క వంటి సుగంధ ద్రవ్యాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరం
ఆయుర్వేదం కూడా వర్షాకాలంలో వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలని సిఫార్సు చేస్తోంది. ఎందుకంటే ఇవి మన జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తాయి. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. అందుకే వీటికి బదులుగా మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన అన్ని పోషకాలను కలిగున్న తాజాగా వండిన భోజనాన్ని తినండి.
Image: Getty
క్రమం తప్పకుండా వ్యాయామం
వర్షాకాలంలో శారీరకంగా చురుగ్గా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మీరు చురుకుగా ఉండటానికి సూర్య నమస్కారం వంటి యోగా భంగిమలను ప్రయత్నించొచ్చు. లేదా ప్రతిరోజూ బ్రిస్క్ వాక్ కూడా చేయొచ్చు. అలాగే రెగ్యులర్ గా ప్రాణాయామం లేదా ధ్యానం చేయండి. ఇది మీ మనస్సు, శరీరం విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది, అలాగే మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
Image: Getty Images
ఆయిల్ మసాజ్ లు
ఆయుర్వేదం వర్షాకాలంలో ఆయిల్ మసాజ్ మంచి మేలు చేస్తుందని చెబుతోంది. ఎందుకంటే ఇవి ప్రసరణను మెరుగుపరచడానికి, మొత్తం రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను మసాజ్ మీకు మంచి ఫలితాలను ఇస్తాయి.