- Home
- Life
- Health
- మీకు చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందా? అయితే వీటిని ఎట్టి పరిస్థితిలో తినకండి.. లేదంటే?
మీకు చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందా? అయితే వీటిని ఎట్టి పరిస్థితిలో తినకండి.. లేదంటే?
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఇది గుండెపోటు, స్ట్రోక్, గుండెజబ్బులతో సహా ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. ఇప్పటికీ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు కొన్ని ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే..

మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరగడానికి ఆహారాలే ప్రధానకారణం. కొన్ని ఆహారాలలో ఎక్కువ మొత్తంలో సంతృప్త, ట్రాన్స్ కొవ్వులు ఉంటాయి. ఇవి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను బాగా పెంచుతాయి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని కూడా పిలువబడే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ స్థాయిలో ఉంటే మన శరీరానికి ఎంతోహాని కలుగుతుంది. ఇది ఫలకాన్ని ఏర్పరుస్తుంది. ధమనులను మూసేస్తుంది. దీంతో గుండెకు రక్తం సరిగ్గా వెళ్లదు. ఇది చివరికి అథెరోస్క్లెరోసిస్ కు దారితీస్తుంది. ధమనులలో ఫలకాన్ని తగ్గించుకోకపోతే గుండెపోటు, స్ట్రోక్, పరిధీయ ధమని వ్యాధి వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. చెడు కొలెస్ట్రాల్ వేటిలో ఎక్కువగా ఉంటుందంటే..
వేయించిన ఆహారాలు
డీప్ ఫ్రైడ్ మాంసాలు, చీజ్ స్టిక్స్ వంటి వేయించిన ఆహారాలలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. ధమనులలో ఫలకం పేరుకుపోవడానికి, రక్తప్రవాహంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి దారితీస్తుంది. అందుకే ఇలాంటి ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలి.
ఫాస్ట్ ఫుడ్
గుండె జబ్బులు, డయాబెటిస్, ఊబకాయం వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ఫాస్ట్ ఫుడ్ యే ప్రధాన కారణం. ఫాస్ట్ ఫుడ్ ను తరచుగా తినేవారిలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుంది. ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ పెరగడం, బ్లడ్ షుగర్ రెగ్యులేషన్ దెబ్బతినడం వంటి సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. ఫాస్ట్ ఫుడ్ దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.
ప్రాసెస్ చేసిన మాంసాలు
ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలనుకునేవారు సాసేజ్లు, బేకన్, హాట్ డాగ్స్ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలను వీలైనంత తక్కువగా తినాలి. ఎందుకంటే వీటిలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆహారాలను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్, ముఖ్యంగా పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.
ice cream
డెజర్ట్లు కుకీలు, కేకులు, ఐస్ క్రీం, పేస్ట్రీలు
డెజర్ట్లు, కుకీలు, కేకులు వంటి వాటిలో చెడు కొలెస్ట్రాల్, అనారోగ్యకరమైన కొవ్వులు, అదనపు చక్కెరలు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే మీ ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. అంతేకాదు వీటిని తినడం వల్ల కాలక్రమేణా మీరు విపరీతంగా బరువు పెరుగుతారు. అదనపు చక్కెరలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం, డయాబెటిస్, గుండె జబ్బులు, మానసిక క్షీణత, కొన్ని క్యాన్సర్లు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రాసెస్ చేసిన మాంసాలు, వేయించిన ఆహారాలు, డెజర్ట్లు వంటి ఎక్కువ కొలెస్ట్రాల్ ఆహారాలు మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచేస్తాయి. అలాగే బరువును పెంచుతాయి. ఇవి మన మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ ఆహారాలను తరచుగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అందుకే మీరు తినే ఆహార రకాలు, మీ ఆరోగ్యంపై వాటి ప్రభావం గురించి తప్పకుండా తెలుసుకోవాలి.