Health Tips: ఇంట్లోనే బీపీ చెక్ చేసుకుంటున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి!
Health Tips: బీపీ అనేది నేటి రోజుల్లో అందరికీ కామన్ అయిపోయింది. దీనిని చెక్ చేసుకోవటం కోసం మిషన్లని ఇంట్లోనే పెట్టి చెక్ చేసుకుంటున్నారు చాలామంది అయితే బీపీ చెక్ చేసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటున్నారు నిపుణులు అవేంటో చూద్దాం.
బీపీ ప్రతి పదిమందిలో ముగ్గురిని ఇబ్బంది పెడుతుంది. అయితే బీపీ చెక్ చేసుకోవాల్సిన ప్రతిసారి హాస్పిటల్ కి వెళ్ళటం అంటే ఇబ్బందితో కూడుకున్న వ్యవహారం. అందుకే బీపీ ఇంట్లోనే చెక్ చేసుకోవటం కోసం డివైస్లని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు చాలామంది. అయితే వాటిని ఉపయోగించడంలో కొన్ని జాగ్రత్తలు పాటించమంటున్నారు నిపుణులు.
బీపీ చెక్ చేసుకునేటప్పుడు హడావుడిగా చెక్ చేసుకోకండి. ప్రశాంతంగా కూర్చొని ఒక ఐదు నిమిషాలు రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు బీపీ చెక్ చేసుకోండి. అప్పుడే బీపీ లెవెల్స్ కరెక్ట్ గా తెలుస్తాయి. అలాగే చేతిని గుండెకి సమాంతరంగా ఉండేలాగా చూసుకోవాలి.
లేదంటే అది సరియైన బీపీ లెవెల్ ని చూపించదు. అలాగే బీపీ మిషన్ యొక్క కఫ్ ని మన చేతికి ఉండే వస్త్రం మీద కాకుండా వస్త్రాన్ని తీసేసి కేవలం శరీరం మీద మాత్రమే పెట్టి బీపీ ని కౌంట్ చేయాలి లేదంటే తప్పుడు బీపీ లెవెల్స్ ని చూపిస్తుంది.
దాని వలన బీపీ టాబ్లెట్స్ లో డోసేజ్ మార్పు కి కారణం అవుతుంది కాబట్టి ఈ విషయంలో పూర్తి అవగాహన కలిగి ఉండండి. అలాగే కఫ్ ని చేతికి కట్టుకున్న తర్వాత దానికి ఉన్న వైరు మోచేతి వైపు కాకుండా చేతి ముందుకి ఉండేలాగా చూసుకోవాలి.
అలాగే 70, 80 కేజీల వెయిట్ ఉన్న మనుషులకి కఫ్ సైజు ఒకలాగా ఉంటుంది. 80 కేజీలు దాటి, చేతులు లావుగా ఉన్న వాళ్ళ కఫ్ సైజు ఒకలాగా ఉంటుంది. కాబట్టి మీ చేతుల సైజుని బట్టి మీ కఫ్ సైజు సెలెక్ట్ చేసుకోండి. అలాగే ప్రతి రోజు మీరు చెక్ చేసుకున్న బీపీ రీడింగ్స్ ని ఒక బుక్ మీద రాసుకోవడం మర్చిపోకండి.
డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రీడింగ్ యావరేజెస్ చూసి అప్పుడు సరియైన మెడిసిన్ మీకు సజెస్ట్ చేస్తారు. బీపీ చెకింగ్ మీద అవగాహన లేకుండా, తప్పుడు రీడింగ్స్ డాక్టర్ దగ్గరికి పట్టుకు వెళ్తే వాళ్ళు సరైన డోసేజ్ లో టాబ్లెట్లు ఇవ్వలేక పోతారు. కాబట్టి సరైన జాగ్రత్తలతో బీపీ రీడింగ్ లు తీసుకోండి.