వర్షాకాలంలో ఈ ఆహారాలను అస్సలు తినకండి.. లేదంటే ఆరోగ్యం దెబ్బతింటుంది జాగ్రత్త..
వాతావరణంతో పాటుగా మనం తినే ఆహారం కూడా మారుతుంది. దీనికి కారణం లేకపోలేదు. అసలు వానాకాలంలో ఎలాంటి ఆహారాలకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

వానల రాకతో వేడి నుంచి ఉపశమనం లభించింది. ఈ వానలతో వాతావరణం ఆహ్లాదంగా మారుతుంది. కానీ ఈ వానాకాలంలో ఎన్నో అంటువ్యాధులు, ఇతర రోగాల ప్రమాదం కూడా పెరుగుతుంది. ఎందుకంటే వర్షాకాలంలో ఫంగస్, బ్యాక్టీరియాలు విపరీతంగా పెరుగుతాయి. ఈ సీజన్ లో ఈ సూక్ష్మజీవులు ఆహారాలపై పెరుగుతాయి. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి వర్షాకాలంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యంగా ఉండాలంటే వానాకాలంలో ఎలాంటి ఆహారాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
Leafy Vegetables
ఆకుకూరలు
ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. అందుకే డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు ఆకు కూరలను ఎక్కువగా తినాలని సలహానిస్తుంటారు. కానీ వర్షాకాలంలో వీటిని తినకపోవడమే మంచిది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం..వర్షాకాలంలోని ఉష్ణోగ్రత, తేమ బ్యాక్టీరియా, ఫంగల్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా ఆకుకూరలపై. ఇలాంటి వాటిని తింటే ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లు సోకుతాయి.
బచ్చలికూర, మెంతి ఆకులు, క్యాబేజి వంటి కూరగాయలు ఇన్ఫెక్షన్ కలిగించే సూక్ష్మక్రిములకు నిలయం. అందుకే వర్షాకాలంలో వీలైనంత వరకు ఈ కూరగాయలకు దూరంగా ఉండండి. వీటికి బదులుగా కాకరకాయ, గుమ్మడికాయ, బెండకాయ వంటి కూరగాయలను తినండి.
స్పైసీ, ఫ్రైడ్ ఫుడ్స్
వర్షాకాలంలో టీ, కాఫీలతో పాటుగా వేడి వేడి కచోరీ, పకోడి, సమోసా వంటి వేయించిన ఆహారాలను ఎక్కువగా తింటుంటారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఈ ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ కడుపు ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే అజీర్ణం, మలబద్ధకం, విరేచనాలు వంటి ఇతర సమస్యలు కూడా వస్తాయి. అందుకే వీలైనంత వరకు స్పైసీ, ఫ్రైడ్ ఫుడ్స్ ను తగ్గించండి.
Image: Getty Images
పుట్టగొడుగులు
పుట్టగొడుగులను తడి నేలలో పెంచుతారు. అక్కడ అన్ని రకాల బ్యాక్టీరియాలు పెరుగుతాయి. ఇలాంటి వాటిని వర్షాకాలంలో తింటే ఇన్ఫెక్షన్ బారిన పడతారు. కాబట్టి వర్షాకాలంలో పుట్టగొడుగులను తినకపోవడమే మంచిది.
సీఫుడ్
వర్షాకాలంలో నీటి ద్వారా వచ్చే వ్యాధులన్నీ వచ్చే ప్రమాదం ఉంది. నీటిలో అన్ని రకాల హానికారక బ్యాక్టీరియా, శిలీంధ్రాలు పేరుకుపోతాయి. అందుకే వర్షాకాలంలో చేపలు, రొయ్యలు వంటి సీఫుడ్ ను తినకండి.
వీటిలో ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ వర్షాకాలంలో సీఫుడ్ ను తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.
పాల ఉత్పత్తులు
వర్షాకాలంలో పాల ఉత్పత్తులను లిమిట్ లోనే తీసుకోవాలి. ఎందుకంటే వర్షాకాలంలో మన జీర్ణవ్యవస్థ సున్నితంగా మారుతుంది. ఇలాంటి సమయంలో పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం వల్ల విరేచనాలు, ఇతర జీర్ణ సమస్యలు వస్తాయి. దీంతో పాటుగా పెరుగును కూడా ఈ సీజన్ లో తినకండి. ఎందుకంటే ఇది వర్షాకాలంలో జలుబు, దగ్గు వంటి సంక్రమణకు గురి చేస్తుంది.
సిట్రస్ ఫుడ్స్
చట్నీ, ఊరగాయలు, చింతపండు వంటి సిట్రస్ తో తయారుచేసిన ఆహారాలను ఈ సీజన్ లో తినకపోవడమే మంచిది. ఎందుకంటే వీటిని తింటే శరీరంలో నీరు నిల్వ ఉంటుంది. ఇది మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. దీనితో పాటుగా గొంతు సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది.