MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • వావ్.. కోపం కూడా మంచిదేనా?

వావ్.. కోపం కూడా మంచిదేనా?

కోపం రానివారెవరు చెప్పండి. నచ్చని పనులు చేసినా.. ఎవరైనా తిట్టినా.. గొడవ పెట్టుకున్నా కోపం ఇట్టే తన్నుకొస్తుంది. నిజానికి కోపం సహజమే అయినా ఇది ఆరోగ్యానికి మంచిది కాదని అంటుంటారు. ఇది నిజమే. కానీ కొన్ని కొన్ని సార్లు కోపం ఎంతో మంచి చేస్తుందని నిపుణులు అంటున్నారు. కోపంతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? 
 

Shivaleela Rajamoni | Published : Dec 01 2023, 11:13 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

కోపాన్ని తగ్గించుకోవాలని, కోపం తెచ్చకోకూడదని చాలా మంది చెప్తుంటారు. ఎందుకంటే కోపం ఎన్నో వల్ల బంధాలు తెగిపోతాయి. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. సాధారణంగా కోపంగా ఉన్నప్పుడు ఏవేవో మాట్లాడుతుంటారు. ఇదే పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. కోపం చెడ్డదే అయినా.. ఇది మీ వృత్తి జీవితంలో ఎంతో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. అవును దీనిపై పరిశోధనలు కూడా జరిగాయి. ఇవన్నీ కోపం ప్రయోజనకరంగా ఉంటాయని వెల్లడించాయి. 
 

27
Asianet Image

కోపం గురించి అధ్యయనం ఏమి చెబుతోంది? 

జర్నల్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ సోషల్ సైకాలజీ నిర్వహించిన ఒక అధ్యయనంలో.. మన లక్ష్యాలను సాధించడంలో కోపం పాత్రను తెలుసుకోవడానికి ప్రయత్నించారు. 1,000 మందికి పైగా పాల్గొన్న వారిపై వరుస ప్రయోగాలు నిర్వహించింది. అలాగే 1,400 మందికి పైగా ఇతరుల డేటాను విశ్లేషించారు. దనీిలో పాల్గొన్న వారికి వినోదం నుంచి విచారం, కోపం, తటస్థత వరకు వివిధ భావోద్వేగాలను కలిగించడానికి వేర్వేరు దృశ్యాలను చూపించారు. ఈ సమయంలో వారికి వర్డ్ పజిల్స్, వీడియో గేమ్స్ వంటి వాటిని కూడా ఆడమని చెప్పారు. డేటాను విశ్లేషించడంలో.. పరిశోధకులు ఇటీవలి యూఎస్ అధ్యక్ష ఎన్నికలలో ఓట్లపై నిర్వహించిన సర్వేలు, ఎన్నికల సమయంలో పాల్గొన్న వారు అనుభవించిన ఆగ్రహాన్ని కూడా చూశారు.
 

37
Asianet Image

ఈ రెండు సందర్భాల్లో.. కోపం ప్రజల ప్రవర్తనలో తేడాను నిరూపించింది. వీళ్లు తమ లక్ష్యాలను ఎంత బాగా చేరుకున్నారో కూడా చూశారు. అంటే కోపం క్రీడా సవాళ్లలో వారి లక్ష్యాలను చేరుకునే సామర్థ్యాన్ని మెరుగుపరిచిందని తేలింది.

47
Asianet Image

లక్ష్యాలను సాధించడానికి కోపం ఎలా సహాయపడుతుంది?

ఫోకస్ పెంచడానికి.. 

కోపం అడ్డంకులను అధిగమించాలనే సంకల్పాన్ని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. ఎలా అంటే కోసం మీ దృష్టిని మార్చి మీ లక్ష్యానికి చేరుకునేలా చేస్తుంది. అలాగే విజయం సాధించడానికి మీరు మరింత పట్టుదలగా ఉండటానికి సహాయపడుతుంది.

57
Asianet Image

ప్రేరణను పెంచడానికి.. 

కోపం ఇతరులను తప్పు అని నిరూపించడానికి లేదా సవాళ్లను అధిగమించడానికి శక్తివంతమైన ప్రేరణగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు మీరు కష్టపడి పనిచేయడానికి, మరింత పట్టుదలతో పనిచేయడానికి కోపం మిమ్మల్ని ప్రేరేపిస్తుందని నిపుణులు అంటున్నారు.

67
Asianet Image

స్పష్టత, నిర్ణయం తీసుకోవడానికి.. 

కోపం కొన్నిసార్లు మీ దృష్టిని మార్చే విషయాలను తొలగిస్తుంది. దీంతో మీకు విషయాలపై స్పష్టమైన అవగాహన కలుగుతుంది. నిర్దిష్టమైన లక్ష్యాన్ని సాధించడానికి  బలమైన భావోద్వేగ మద్దతుతో ముందుకు సాగుతారు. అలాగే మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సహాయపడుతుంది. 

77
angry man

angry man

ప్రతికూలతలను సానుకూలంగా మార్చడానికి..

వైఫల్యాలు లేదా విమర్శల వల్ల పట్టరాని కోపం వస్తుంది. అయితే ఈ కోపం ఈ వైఫల్యాలను  పోగొట్టడానికి, సానుకూల పనులను పూర్తి చేయడానికి అవసరమైన శక్తిగా మారుస్తుంది. ప్రతికూలతను ఎదుగుదలకు, విజయానికి అవకాశంగా మార్చడానికి కోపం మీకు  బాగా సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. 

Shivaleela Rajamoni
About the Author
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు. Read More...
ఆరోగ్యం
 
Recommended Stories
Top Stories