MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • పరిగడుపున పచ్చి కొబ్బరిని తింటే ఎంత మంచిదో..!

పరిగడుపున పచ్చి కొబ్బరిని తింటే ఎంత మంచిదో..!

మనం కొబ్బరిని ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తుంటారు. ఇది వంటలను టేస్టీగా చేస్తుంది. అంతేకాదు ఇది మనల్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. కొబ్బరిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పచ్చి కొబ్బరిని పరిగడుపున తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి తెలుసా? 

2 Min read
Author : R Shivallela
Published : Oct 30 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కొబ్బరి మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. కొంతమంది కొబ్బరిని తినడానికి ఇష్టపడితే, మరికొంతమంది కొబ్బరి నీటిని తాగడానికి ఇష్టపడతారు. కొబ్బరి, కొబ్బరి నీరు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి. ఈ రెండింటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కొబ్బరినీళ్లను తాగడంతో పాటుగా పచ్చి కొబ్బరిని తిన్నా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. 
 

27

పచ్చి కొబ్బరిని తినడం వల్ల వెంట్రుకలు, పొట్ట, గుండె, చర్మం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొబ్బరిని పచ్చిగా తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పచ్చి కొబ్బరిని పరిగడుపున తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

37

పచ్చికొబ్బరిని పరిగడుపున తింటే పొట్ట ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. పచ్చి కొబ్బరిని తినడం వల్ల మీ జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. దీంతో జీర్ణసమస్యలు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. పచ్చి కొబ్బరి మీ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. 
 

47
Image: Freepik

Image: Freepik

పచ్చి కొబ్బరి రక్త నష్టాన్ని నివారించడానికి కూడా సహాయపడుతుంది. ఇందుకోసం మీరు కొబ్బరి పాలను తాగొచ్చు. పచ్చి కొబ్బరిలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఐరన్ బ్లడ్ లెవల్స్ ను పెంచడానికి సహాయపడుతుంది. రక్తం తక్కువగా ఉండేవారు పరిగడుపున పచ్చి కొబ్బరిని తినొచ్చు. 

57

కొబ్బరి బరువు తగ్గడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అలాగే ఇది గుండెజబ్బులతో బాధపడేవారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మారుతున్న సీజన్ లో మనకు దగ్గు, జలుబు, సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. కొబ్బరి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. 

67
coconut

coconut

కొబ్బరి మధుమేహులకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అవును దీన్ని పరిగడుపున తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. పచ్చి కొబ్బరిలో ఉండే ఫైబర్, అమైనో యాసిడ్స్, మంచి ఫ్యాట్స్ డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. 

77

కొబ్బరి మన జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరిని తినడం వల్ల మీ జుట్టు మరింత షైనీగా, అందంగా కనిపిస్తుంది. పచ్చి కొబ్బరి లేదా దాని వాటర్ మన చర్మం మెరిసేలా చేస్తుంది. ఇందులో యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. 

About the Author

RS
R Shivallela
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Watermelon: పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెట్టుకొని తినొచ్చా? తింటే ఏమవుతుంది?
Recommended image2
Sabja Water: ఎండాకాలంలో సబ్జా వాటర్ తాగితే బరువు తగ్గుతారా?
Recommended image3
Menstrual Health: పీరియడ్స్‌లో మలబద్ధకమా? ఈ టిప్స్ పాటిస్తే సమస్య దూరం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved