Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Health
  • రోజూ పొద్దున ఓట్స్ ను తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

రోజూ పొద్దున ఓట్స్ ను తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

ఓట్స్ తో ఒక్కటేమిటీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం. వీటిని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో తింటే బరువు తగ్గడంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యల ముప్పు తగ్గుతుంది.   

Mahesh Rajamoni | Updated : Sep 17 2023, 07:15 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
oats

oats

ఓట్ మీల్ అనగానే అందరూ అనుకునేది బరువు తగ్గడానికి మాత్రమే ఉపయోగపడుతుందని. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే.. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఓట్ మీల్ ను అన్ని వయసుల వారు తినొచ్చు. దీన్ని బ్రేక్ ఫాస్ట్ గా తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ఓట్స్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అలాగే కాల్షియం, ప్రోటీన్, ఐరన్, జింక్, థయామిన్, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఓట్స్ లో మన ఎముకలను బలంగా ఉంచే విటమిన్ బి కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఓట్స్ ను రెగ్యులర్ గా తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కాలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

28
Image: Getty Images

Image: Getty Images

గుండె ఆరోగ్యం

ఓట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.  ఓట్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా సహాయపడుతుంది. 
 

38
oats

oats

బ్లడ్ షుగర్

మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఓట్స్ ఎంతో సహాయపడుతుంది. ఓట్స్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. డయాబెటీస్ పేషెంట్లు ఓట్స్ ను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశమే ఉండదు.
 

48
Asianet Image

మలబద్దకం
 
ఓట్స్ లో పుష్కలంగా ఉంటే ఫైబర్ కంటెంట్ బరువు తగ్గడానికి సహాయపడటమే కాకుండా మలబద్దకం సమస్యను కూడా పోగొడుతుంది. ఓట్ మీల్ ను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. 
 

58
Asianet Image

క్యాన్సర్ల ముప్పు

క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఓట్స్ ను తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదం తగ్గుతుంది. అందుకే ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ ను తినడానికి ప్రయత్నించండి. 

68
Asianet Image

అధిక రక్తపోటు

ఓట్స్ లో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నివారించడానికి ఎంతగానో సహాయపడుతుంది. అందుకే హై బీపీ పేషెంట్లు ఓట్స్ ను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. 
 

78
<p>oats</p>

<p>oats</p>

వెయిట్ లాస్

ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్స్ ను తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. అలాగే తొందరగా కడుపు నిండుతుంది. దీంతో మీరు అతిగా తినే అవకాశం ఉండదు. అలాగే ఓట్స్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే బ్రేక్ ఫాస్ట్ లో వీటిని తింటే మీరు ఫాస్ట్ గా, ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. 
 

88
Asianet Image

చర్మ ఆరోగ్యం

ఓట్స్ లో విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఎన్నో చర్మ ప్రయోజనాలను కలిగిస్తుంది. ఓట్ మీల్ లోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ముఖంపై ముడతలను, నల్ల మచ్చలను, నల్ల రంగును పోగొట్టడానికి సహాయపడతాయి.  ఓట్స్ లో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. కాబట్టి దీన్ని తినడం వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
ఆరోగ్యం
 
Recommended Stories
Top Stories