MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ఈ రోజు నుంచి కొన్ని బాదం పప్పులను తిన్నా.. ఈ సమస్యలకు దూరంగా ఉంటారు తెలుసా?

ఈ రోజు నుంచి కొన్ని బాదం పప్పులను తిన్నా.. ఈ సమస్యలకు దూరంగా ఉంటారు తెలుసా?

బాదం పప్పులను పోషకాలకు మంచి వనరు. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. రోజూ గుప్పెడు బాదం పప్పులను తింటే ఎన్నో రోగాలకు దూరంగా ఉండొచ్చంటారు ఆరోగ్య నిపుణులు.

R Shivallela | Updated : Oct 23 2023, 07:15 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది; మీరు ప్రతిరోజూ ఈ గింజలను తినవచ్చు.
పిస్తాపప్పులను మితంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిస్తాపప్పులో మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే ఫైటోస్టెరాల్స్ కొలెస్ట్రాల్ శోషణను తగ్గించి గుండెను మరింత ఆరోగ్యంగా ఉంచుతాయి.

27
Asianet Image

డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే వీటిలో మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి వాటిలో బాదం పప్పులు ఒకటి. బాదం పప్పుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. బాదంలో బీటా కెరోటిన్, డైటరీ ఫైబర్, ఫాస్పరస్, ప్రోటీన్, ఫోలేట్, థయామిన్, కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం, రాగి, పొటాషియం, విటమిన్ ఎ,విటమిన్ బి 6, విటమిన్ కె,  విటమిన్ సి, విటమిన్ ఇ లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ గుప్పెడు బాదం పప్పులను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పడు తెలుసుకుందాం.. 
 

37
Asianet Image

గుండె ఆరోగ్యం

బాదం పప్పులను మితంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బాదం పప్పుల్లో మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును తగ్గించడానికి  సహాయపడతాయి. బాదం పప్పుల్లో ఉండే ఫైటోస్టెరాల్స్ కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తాయి. దీంతో మీ గుండె మరింత ఆరోగ్యంగా ఉంటుంది. 
 

47
Asianet Image

వెయిట్ లాస్

బాదం పప్పుల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కడుపును తొందరగా నింపుతుంది. దీంతో మీరు అతిగా తినలేరు. వీటిలో ఉండే ఫైబర్ మెటబాలిజంను పెంచడానికి సహాయపడుతుంది. అలాగే బాదంలో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు మీ బరువు పెరగకుండా సహాయపడతాయి.

57
Asianet Image

గట్ ఆరోగ్యం

బాదం పప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. బాదం గట్ బ్యాక్టీరియాకు మంచిది. అలాగే ఇది మంచి గట్ బ్యాక్టీరియాను పెంచడానికి కూడా సహాయపడుతుంది. 
 

67
Asianet Image

ఇమ్యూనిటీ పవర్

బాదం పప్పులను రోజూ కొన్ని తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఈ పప్పుల్లో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ఈ విటమిన్ చాలా అవసరం. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి.

77
Asianet Image

కంటి ఆరోగ్యం

బాదం పప్పుల్లో ఉండే విటమిన్ ఇ మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటిచూపును కూడా మెరుగుపరుస్తాయి. మాక్యులర్ క్షీణత, కంటిశుక్లం నుంచి మన కళ్లను రక్షించే కెరోటినాయిడ్లు కూడా వీటిలో ఉంటాయి. పిస్తాల్లో లుటిన్, జియాక్సంతిన్ లు కూడా ఉంటాయి. ఇవి మన కళ్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. 

R Shivallela
About the Author
R Shivallela
ఆహారం
ఆరోగ్యం
 
Recommended Stories
Top Stories