ఉదయాన్నే బెల్లం టీ తాగితే ఇన్ని లాభాలా? దీన్ని ఇలా ఈజీగా తయారు చేయండి
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి జనాలు ఎన్నో రకాల ఆహారాలను తమ ఆహారంలో చేర్చుకుంటారు. ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారాల్లో బెల్లం కూడా ఉంది. దీనికి ఎన్నో విధాలుగా ఉపయోగించొచ్చు. అంతేకాదు ఈ చలికాలంలో మీరు ప్రతిరోజు ఉదయాన్నే బెల్లం టీని తాగొచ్చు. ఈ టీ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
చాలా మంది చలికాలంలో ఎక్కువగా అనారోగ్యం బారిన పడుతుంటారు. చల్లని గాలులు మన ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. ఈ సీజన్ లో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కష్టమే. కానీ ఈ సీజన్ లో ఫిట్ గా ఉండాలంటే కొన్ని ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా చలికాలంలో బెల్లాన్ని ఖచ్చితంగా తినాలని నిపుణులు సలహానిస్తున్నారు. ఎందుకంటే ఇది మన శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుతుంది. మీరు బెల్లాన్ని టీ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఈ బెల్లం టీని రోజూ ఉదయాన్నే పరగడుపున తాగితే మీరు ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. బెల్లం టీ ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
బెల్లం టీ జీర్ణక్రియకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ టీలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. మీకు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉంటే ప్రతిరోజూ ఉదయం పరిగడుపున బెల్లం టీని తాగండి. ఇది మీ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.
రోగనిరోధక వ్యవస్థ బలోపేతం
బెల్లం పోషకాలకు మంచి వనరు. మనం దీన్ని ఎన్నో విధాలుగా ఉపయోగించొచ్చు. దీనిలో కాల్షియం, విటమిన్ బి, పొటాషియం, ఐరన్ తో పాటుగా ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. అలాగే ఇవి లోపలి నుంచి మనల్ని పోషిస్తాయి. చలికాలంలో రోజూ ఉదయాన్నే బెల్లం టీ ని తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
బరువు తగ్గడానికి
చలికాలంలో బరువు పెరగడమే కానీ తగ్గడం ఉండదు. ఎందుకంటే ఈ సీజన్ లో చాలా మంది వ్యాయామం చేయరు. అలాగే వేడి బజ్జీలు, సమోసాలు వంటి నూనె పదార్థాలను ఎక్కువగా తింటుంటారు. మీరు బరువు తగ్గాలంటే మాత్రం కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినకూడదు. అయితే ఈ సీజన్ లో ప్రతిరోజూ ఉదయం బెల్లం టీని తాగొచ్చు. బెల్లం టీ జీవక్రియను పెంచుతుంది. దీంతో మీరు సులువుగా బరువు తగ్గుతారు.
పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం
బెల్లం మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. ఇది పీరియడ్స్ సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. పీరియడ్స్ సమయంలో బెల్లం టీని తాగితే కడుపు నొప్పి, తిమ్మిరి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది
బెల్లం టీ శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి కూడా సహాయపడుతుంది. మీరు రెగ్యులర్ గా బెల్లం టీ తాగితే మీ ఊపిరితిత్తులు, పేగులు, పొట్ట శుభ్రపడతాయి. బెల్లం టీ మలబద్దకం సమస్యను కూడా పోగొడుతుంది.
బెల్లం టీ ఎలా తయారు చేయాలంటే?
ముందుగా ఒక బాణలిలో నీళ్లు పోసి మీడియం మంట మీద మరిగించండి. మరుగుతున్న నీటిలో అల్లం, పచ్చి యాలకులు, బెల్లం వేసి చెంచా చొప్పున వేయండి.ఈ మిశ్రమాన్ని తక్కువ మంట మీద మరిగించండి. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. అంటే బెల్లీ టీ రెడీ అయినట్టే..