MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Health
  • ఈ విషయం తెలిస్తే అంజీర పండును తినకుండా అస్సలు ఉండలేరు

ఈ విషయం తెలిస్తే అంజీర పండును తినకుండా అస్సలు ఉండలేరు

అంజీర్ ఒక రకమైన పండు. దీన్ని అలాగే లేదా ఎండబెట్టి కూడా తినొచ్చు. ఏ రకంగా తిన్నా దీనితో మీరు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అవును అంజీర్ ను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 14 2023, 04:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

అంజీర్ ను అత్తి పండ్లు అని కూడా అంటారు. ఈ పండు పోషకాలకు మంచి వనరు. వీటిని ఎన్నో రకాల వంటల్లో కూడా ఉపయోగించొచ్చు. మనం ఈ పండును తాజా, ఎండబెట్టి కూడా తినొచ్చు. దీన్ని ఏ రకంగా తిన్నా మన శరీరానికి బోలెడు పోషకాలు అందుతాయి. ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి 6, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో డైటరీ ఫైబర్, సహజ చక్కెరలు కూడా పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఈ పండు బాగా ఉపయోగపడుతుంది. ఈ పండును తింటే జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అసలు రోజూ అంజీర్ ను తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
figs

figs

మీ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది

అత్తి పండ్లలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ సాధారణ ప్రేగు కదలికలకు  చాలా అవసరం. ఎందుకంటే ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. గట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో మీ జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. కరిగే ఫైబర్ వ్యర్థ ఉత్పత్తులను బంధిస్తుంది. అలాగే పేగు గుండా బయటకు వెళ్లడానికి సహాయపడుతుంది. 
 

39

యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది

అంజీర పండు ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కూడా. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స ను తటస్తం చేయడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లలో క్వెర్సెటిన్, కాటెచిన్స్, ఆంథోసైనిన్స్ వంటి పాలీఫెనాల్స్ కూడా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. దీనిలో ఉండే సమ్మేళనాలు కణాల నష్టం నుంచి రక్షిస్తాయి. 

49
figs

figs

గుండె ఆరోగ్యం 

అంజీర పండ్లు మన గుండె ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. దీనిలోని పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంజీర పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. అంతేకాదు దీనిలో ఉండే మెగ్నీషియం, డైటరీ ఫైబర్ రక్త నాళాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.అలాగే ఇది రక్తపోటును నియంత్రించడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 
 

59

ఎముకల ఆరోగ్యం

మన అస్థిపంజరాన్ని, ఎముకలను బలంగా ఉంచడంలో అంజీర పండు కీలక పాత్ర పోషిస్తుంది. అంజీర్ లో ఎముకల నిర్మాణం, బలంగా ఉంచడానికి అవసరమయ్యే కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజాలు ఎముక సాంద్రతను మెరుగుపరుస్తాయి. అలాగే బోలు ఎముకల వ్యాధితో పాటుగా ఎముకలకు సంబంధిత సమస్యల ప్రమాదాన్నికూడా తగ్గిస్తాయి.
 

69

రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది

అంజీర్ తీయగా ఉన్నా.. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే వీటిని మధుమేహులు కూడా తినొచ్చు. దీనిలోని ఫైబర్ చక్కెరల శోషణ మందగించడానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఫాస్ట్ గా పెరిగే అవకాశం ఉండదు. 
 

79

బరువు నిర్వహణ

బరువు తగ్గాలనుకునే వారికి కూడా అంజీర్ పండ్లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పండ్లలో ఉండే డైటరీ ఫైబర్ కడుపును తొందరగా నింపుతుంది. అతి ఆకలిని తగ్గిస్తుంది. అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. ఈ పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. 

89

చర్మ ఆరోగ్యానికి 

అంజీర పండ్లు మన చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ ఇ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఈ పండు సన్నని గీతలు, ముడతలను తగ్గిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

99
Image: Freepik

Image: Freepik

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

అత్తి పండ్లలో ఉండే పోషకాలు మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీనిలో ఉండే విటమిన్ సి వంటి విటమిన్లు, జింక్ వంటి ఖనిజాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. మన శరీరాన్ని సంక్రమణ నుంచి రక్షించడానికి, వ్యాధులను తొందరగా తగ్గించడానికి సహాయపడతాయి. ఈ పోషకాల కలయిక శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved