MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Health Tips: ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నెయ్యిని కలుపుకుని తాగారంటే మీకు ఆ సమస్యలే రావు

Health Tips: ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నెయ్యిని కలుపుకుని తాగారంటే మీకు ఆ సమస్యలే రావు

Health Tips: చలికాలంలో నెయ్యిని తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే దీన్ని సూపర్ ఫుడ్ అంటారు. నిజానికి నెయ్యిని ఎన్నో ఏండ్ల నుంచి ఎన్నో సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. కాగా చలికాలంలో వేడినీటిలో నెయ్యిని కలిపి తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం పదండి.  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 23 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

చలికాలంలోని చల్లని గాలులు వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయి. కానీ ఇతర సీజన్లతో పోలిస్తే ఈ కాలంలోనే దగ్గు, జలుబు, జ్వరం వంటి ఎన్నో సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఈ సీజన్ లో మన ఆరోగ్యం బాగుండాలంటే  మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. చలికాలంలో ఖచ్చితంగా తినాల్సిన ఆహారాలు కొన్ని ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అలాగే చలికాలో మినల్ని వెచ్చగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. అంతేకాదు మన ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి. ఇలాంటి ఆహారాల్లో నెయ్యి ఒకటి. దీనిని వింటర్ సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. నెయ్యిలో ఎన్నో రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే దీనిని ఎన్నో రకాలుగా తమ ఆహారంలో భాగం చేసుకుంటుంటారు. అయితే గోరువెచ్చని నీటిలో నెయ్యిని కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఉదయాన్నే తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం పదండి. 

38
Image: Freepik

Image: Freepik

నెయ్యి ఎందుకు సూపర్ ఫుడ్?

నెయ్యి భారతీయ వంటశాలలలో ఖచ్చితంగా ఉపయోగించే ఒక పదార్థం. పోషకాలు ఎండుగా ఉండే సూపర్ ఫుడ్ నెయ్యి. అందుకే  దీనిని ఎన్నో విధాలుగా ఉపయోగిస్తారు. ఆహారంతో పాటుగా మతపరమైన ఆచారాలు, ఆయుర్వేదం, మందులు మొదలైన వాటికి కూడా నెయ్యిని ఉపయోగిస్తారు. నెయ్యిలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ డి లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. ఇది మన జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. ఎముకలను బలోపేతం చేస్తుంది. అసలు నెయ్యి కలిపిన వేడినీళ్లను తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

48

కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం

చలికాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువవుతాయి. దీనివల్ల ఏ పనీ చేయలేరు. కూర్చోవడానికి, నడవడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది.  ఇలాంటప్పుడు నెయ్యిలో ఉండే ఔషద గుణాలు ఈ కీళ్ల నొప్పులను తగ్గించి దృఢంగా మారుస్తాయి.

58

చర్మ ఆరోగ్యం

ఈ చలికాలంలో చల్లని గాలులు వల్ల మన చర్మంలో తేమ తగ్గుతుంది. దీంతో చర్మం పొడిబారుతుంది. ఇలాంటప్పుడు  ప్రతిరోజూ వేడి నీటితో నెయ్యిని తాగడం వల్ల చర్మానికి అవసరమైన పోషణ అందుతుంది.  ముఖ్యంగా నెయ్యిలో ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ చర్మం సహజ మెరుపు పెరుగుతుంది. అలాగే చర్మ సంబంధిత సమస్యలు కూడా తగ్గిపోతాయి. 
 

68

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

మీరు ఎప్పుడూ జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే వేడినీటిలో నెయ్యి కలిపి తాగండి. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అవును దీన్ని రెగ్యులర్ గా తాగడం వల్ల జీర్ణ ఎంజైమ్ల స్రావం పెరిగి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 
 

78

బరువు నిర్వహణకు 

నెయ్యి ఆరోగ్యకరమైన కొవ్వు కు మంచి వనరు. నెయ్యి మీ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. అలాగే అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. ఫుడ్ కోరికలను కూడా తగ్గించేందుకు  సహాయపడుతుంది. దీంతో మీరు బరువు పెరిగే అవకాశం ఉండదు. 

88

శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో 

వేడి నీరు మన శరీరం నుంచి విషపదార్థాలను బయటకు పంపుతుంది. అలాగే ఈ వేడినీటిలో నెయ్యిని కలిపి తాగడం వల్ల శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి సహాయపడుతుంది. నిజానికి నెయ్యిలో నిర్విషీకరణ లక్షణాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Isabgol Benefits: దీన్ని నీళ్లల్లో నానబెట్టి తాగితే పొద్దున్న కల్లా మీ మలబద్ధకం పరార్, షుగర్ కంట్రోల్ లో ఉంటుంది
Recommended image2
Ice Apple: తాటి ముంజల్లో ఇన్ని పోషకాలా? తెలిస్తే బుట్టలు బుట్టలు కొంటారు
Recommended image3
Coriander Benefits: రోజులో ఒక్కసారి కొత్తిమీర వాటర్ తాగితే షుగర్ కంట్రోల్ అవ్వడం పక్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved