MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Health
  • ఉదయాన్నే పరిగడుపున ఆపిల్ జ్యూస్ ను తాగడం అలవాటు చేసుకుంటే.. ఈ అనారోగ్య సమస్యలన్నీ పరార్..

ఉదయాన్నే పరిగడుపున ఆపిల్ జ్యూస్ ను తాగడం అలవాటు చేసుకుంటే.. ఈ అనారోగ్య సమస్యలన్నీ పరార్..

ఆపిల్ జ్యూస్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ జ్యూస్ లో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుస్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి. 

2 Min read
Author : R Shivallela
Published : Sep 30 2023, 09:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఆపిల్స్ ఆరోగ్యానికి ఎంతటి మేలు చేస్తాయో చాలా మందికి తెలుసు. రోజుకో ఆపిల్ ను తింటే హాస్పటల్ కు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదన్న ముచ్చట కూడా మనందరికీ తెలుసు. ఆపిల్స్ లో ఉండే ఔషదగుణాలు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి రక్షస్తాయి. ఆపిల్ ను తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో.. దాని రసం తాగడం వల్ల కూడా అన్ని ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవును ఈ ఆపిల్ జ్యూస్ లో మన శరీరానికి అవసరమైన ఫైబర్, విటమిన్-సి, పొటాషియం, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన పోషకాలన్నీ పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున ఈ జ్యూస్ ను తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. అవేంటంటే? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

గుండె ఆరోగ్యానికి మంచిది

ఆపిల్ జ్యూస్ మన గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ జ్యూస్ ను పరిగడుపున తాగడం వల్ల మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ జ్యూస్ లో ఉండే పెక్టిన్, ఫైబర్ లు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. దీంతో మీకు గుండె జబ్బుల ముప్పు తప్పుతుంది. 
 

36
apple juice

apple juice

బరువును నియంత్రిస్తుంది

బరువు తగ్గాలనుకునేవారికి ఆపిల్ జ్యూస్ బెస్ట్  డ్రింక్ అనే చెప్పాలి. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే ఆపిల్ జ్యూస్ ను తాగడం మీ కడుపు తొందరగా నిండుతుంది. దీంతో మీరు అతిగా తినలేరు. దీనివల్ల మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. 
 

46

కంటి చూపును మెరుగుపరుస్తుంది

ఆపిల్స్ విటమిన్-ఎ కు మంచి వనరు. ఇవి మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది స్క్రీన్లపై ఎక్కువసేపు పనిచేస్తారు. కానీ దీనివల్ల కంటి ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. కంటిచూపు కూడా తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు మీ కంటి చూపును మెరుగుపరచడానికి ఆపిల్ జ్యూస్ ను రోజూ తాగొచ్చు. 
 

56
Image: Freepik

Image: Freepik

ఉబ్బసం రోగులకు ప్రయోజనకరం

ఆపిల్ జ్యూస్ ఆస్తమా రోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆస్తమా పేషెంట్లు ఈ జ్యూస్ ను రోజూ పరిగడుపున తాగడం వల్ల ఈ వ్యాధి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

66

పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది

ఆపిల్ జ్యూస్ లో పెక్టిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇలాంటి ఆపిల్ జ్యూస్ ను రెగ్యులర్ గా పరిగడుపున తాగడం వల్ల మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది గట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే గట్ లో మంచి బ్యాక్టీరియాను పెంచడానికి సహాయపడుతుంది.

About the Author

RS
R Shivallela
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved