Health Tips: భారీ పొట్టతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ కలబంద మిశ్రమం మీకోసమే?
Health Tips: కలబంద నిజంగా దివ్య ఔషధం. ఇది అందానికే కాదు ఆరోగ్యానికి కూడా సంజీవని లాంటిదే. అయితే ఈ కలబంద భారీ పొట్ట తగ్గటానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం.

పొట్ట దగ్గర కొవ్వు అనేది నేడు సర్వసాధారణం అయిపోయింది. మారిన ఆహారపు అలవాట్లు సరియైన వ్యాయామం లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. అయితే సరి అయిన వ్యాయామం చేయటంతో పాటు కలబందని మీ ఆహారంలో భాగం చేసుకుంటే మీ పొట్ట త్వరగా తగ్గుతుంది.
aleo vera
కలబందలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీర బరువుని తగ్గించడంలో ఇది చాలా సహాయపడుతుంది. అయితే కలబంద జ్యూస్ లో నిమ్మరసం, తేనె కలిపి ఆ మిశ్రమాన్ని తాగితే అది భారీ పొట్టకి దివ్య ఔషధం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
కలబంద లో ఉండే విటమిన్లు ఖనిజాలతో పాటు బరువుని తగ్గించే కొన్ని క్రియాశీల సమ్మేళనాలు కూడా ఇందులో ఉంటాయి. ఇది శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు శరీరంలో ఉండే అదనపు కొవ్వుని కరిగించడానికి సహాయపడుతుంది.
కాబట్టి తక్కువ మొత్తంలో తీసుకోవటం వలన జీర్ణ క్రియ కు సహాయపడుతుంది. అలాగే భారీపొట్ట తగ్గడానికి కూడా బాగా పనిచేస్తుంది. అలోవెరా జ్యూస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. అలోవెరా జెల్ రెండు టేబుల్ స్పూన్లు, నిమ్మరసం ఒక టీ స్పూన్..
తేనె ఒక టేబుల్ స్పూన్, పుదీనా ఆరు ఆకులు. ఇందులో తేనె తప్ప మిగతావన్నీ వేసి అందులో ఒక టంబ్లర్ నీళ్లు పోసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అందులో తేనె కలిపి తీసుకుంటే కలబంద రసం రెడీ అవుతుంది. దీనిని నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో తాగటం వలన మంచి ఎఫెక్ట్ లభిస్తుంది.
అలాగే అలోవెరా జ్యూస్ ని ఎక్కువగా తాగితే సైడ్ ఎఫెక్ట్స్ ని ఫేస్ చేయవలసి ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ జ్యూస్ లో ఉండే నిమ్మకాయ శరీరానికి డిహైడ్రేషన్ తగ్గించి జీవక్రియని పెంచుతుంది. అలాగే తేనె కొవ్వుని కరిగించి హార్మోన్లు విడుదల చేసేలాగా చేస్తుంది.