రోజూ పాలను తాగితే ఈ క్యాన్సర్ వస్తుందా?
పురుషులు రోజూ పాలు తాగితే ప్రోస్టేజ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. అలా అయితే పాలను మొత్తమే మానేయాలా? నిపుణులు ఏమంటున్నారంటే?
పాలు కాల్షియానికి ఉత్తమ వనరు. ఇది మన కండరాలు, ఎముకల ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది. కానీ వీటిని తాగడం వల్ల పురుషులకు ఒక ఆరోగ్య సమస్య ప్రమాదం పెరుగుతుందని కొన్ని అధ్యాయనాలు వెల్లడిస్తున్నాయి. పాలలో ఉండే హార్మోన్లు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయట.
పాలలో ఉండే హార్మోన్లు కారణమా
యూకేకు చెందిన క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ తన పరిశోధన ఫలితాల్లో పాలు.. ప్రోస్టేట్ క్యాన్సర్ మధ్య సంబంధాన్ని వివరించింది. పరిశోధన క్యాన్సర్ ను పాల వినియోగంతో అనుసంధానిస్తుంది. ఈస్ట్రోజెన్, ఇన్సులిన్ వంటి హార్మోన్లు సహజంగా ఆవు పాలలో ఉంటాయి. ఈ హార్మోన్లు గ్రోత్ హార్మోన్లు. ఇవి క్యాన్సర్ పెరగడానికి కారణమవుతాయి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. ప్రమాదాన్ని తగ్గించడానికి పాలను తగ్గించడం మాత్రమే కాదు.. ప్రతిరోజూ కాఫీలో పాలు కలుపుకుని తాగినా కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది.
తక్కువ కొవ్వు పాలు ప్రమాదాన్ని పెంచుతాయా?
అమెరికాలోని లోమా లిండా యూనివర్సిటీ మూడు దశాబ్దాల పాటు దాదాపు 22,000 మంది పురుషులపై అధ్యయనం చేసింది. ప్రతిరోజూ 2.5 సేర్విన్గ్స్ పాల ఉత్పత్తులను తినే పురుషులకు సగం సేర్విన్గ్స్ లేదా అంతకంటే తక్కువ తినే పురుషుల కంటే ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 34 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు నిర్ధారించారు. సాధారణ లేదా ఎక్కువ కొవ్వు పాల కంటే తక్కువ కొవ్వు, క్రీమ్ లేని పాలు ప్రోస్టేట్ క్యాన్సర్ కు ఎక్కువ ప్రమాదం కలిగి ఉన్నాయని అధ్యయనం కనుగొంది.
చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి
రోజుకు 430 గ్రాముల పాలను తాగే పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం.. రోజుకు 1 గ్రాము పాలను తాగే పురుషుల కంటే 25 శాతం ఎక్కువ. ఈ మొత్తం సుమారు ఒక టేబుల్ స్పూన్ పాలు కావొచ్చు. ఈ అధ్యయనంలో.. పాలను మొత్తమే తాగకుంటే ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువ. రోజుకు మూడొంతుల కప్పు పాలు తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదం పెరుగుతుందని అధ్యయనం వెళ్లడిస్తుంది.
Prostate cancer
పాలు లేదా ఏదైనా ఆహారం నుంచి క్యాన్సర్ వచ్చే ఖచ్చితమైన ప్రమాదాన్ని గుర్తించడం కష్టమని లోమా లిండా విశ్వవిద్యాలయ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత పరిశోధన అవసరం. పాలతో పాటు తప్పుడు ఆహారపు అలవాట్లు, పేలవమైన జీవనశైలి కూడా క్యాన్సర్ కు కారణమవుతాయి.
calcium
కాల్షియం ఉన్న పాలేతర ఉత్పత్తులు
ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రకారం.. ప్రోస్టేట్ క్యాన్సర్ 50 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులకు వస్తుంది. మీ పిల్లలను ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం నుంచి రక్షించాలనుకుంటే వారికి బాల్యం నుంచే పాలేతర ఉత్పత్తులను ఇవ్వండి. ఎన్నో పాలేతర ఉత్పత్తులు ఉన్నాయి. ఇవి కాల్షియానికి గొప్ప వనరులు. వీటిలో బాదం పాలు, సోయా పాలు ఉన్నాయి. ఇవి కాల్షియానికి గొప్ప వనరులు. ఇవి కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షిస్తాయి.
పాలతో పాటు కాల్షియం ఎన్నో ఇతర ఆహారాలలో కూడా ఉంటుంది. సాల్మన్, సార్డినెస్, టోఫు, సోయాబీన్స్, సోయా పాలు, బచ్చలికూర, కాలే, బ్రోకలీ, నారింజ రసం, చిలగడదుంపలు, డ్రై ఫ్రూట్స్ ముఖ్యంగా బాదం, విత్తనాలు కూడా కాల్షియానికి ముఖ్య వనరులు.