MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Health
  • బీపీ పేషెంట్లు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే..!

బీపీ పేషెంట్లు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే..!

అధిక రక్తపోటుతో బాధపడే వారికి బీట్ రూట్ జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది. రక్తపోటు స్థాయిలను నియంత్రించడానికి, మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి బీట్ రూట్ జ్యూస్ ఎంతో సహాయపడుతుంది.  

3 Min read
Author : Mahesh Rajamoni
Published : May 22 2023, 11:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Beetroot Juice

Beetroot Juice

ఎండాకాలం తాజా పండ్లు, కూరగాయలు, వాటి రసాలకు మంచి సమయం. అయితే కొన్ని ఫ్రూట్ జ్యూస్ లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో బీట్ రూజ్ జ్యూస్. రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ ను తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ఈ పానీయం డిటాక్స్, రక్తపోటు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

బీట్ రూట్ లో ఆరోగ్యకరమైన పోషకాలు, ఖనిజాలు ఉంటాయి. ఇది జీర్ణక్రియకు మంచిది. చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది. అలాగే అథ్లెటిక్ పనితీరును మెరుగుపరుస్తుంది. దీని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మీరు వేగంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

బీట్ రూట్ జ్యూస్ హైపర్ టెన్షన్ కు మంచిదా?

ఒకప్పుడు పెద్దవయసు వారికి మాత్రమే అధిక రక్తపోటు సమస్య వచ్చేది. ఇప్పుడు హై బీపీ అన్నివయసుల వారికీ వస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 30 నుంచి 79 సంవత్సరాల వయస్సు గల దాదాపు 1.3 బిలియన్ల పెద్దలకు అధిక రక్తపోటు ఉంది. ఇందులో 46 శాతం మంది పెద్దలకు తమకు ఈ సమస్య ఉందని తెలియదు. అధిక రక్తపోటు పేషెంట్లు బీట్ రూట్ జ్యూస్ ను రోజూ తాగితే రక్తపోటు స్థాయిలు తగ్గుతాయి. అలాగే ఇంకెన్నో సమస్యలు తగ్గిపోతాయి.

37

బీట్ రూట్ ను మీ రోజు వారి డైట్ లో చేర్చడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వల్ల బీట్ రూట్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. కానీ డైటరీ నైట్రేట్ సమృద్ధిగా ఉండటం రక్తపోటుకు ఇది సూపర్ ఫుడ్ గా పరిగణించబడుతుంది. 

47

డైటరీ నైట్రేట్ నైట్రిక్ ఆక్సైడ్ (ఎన్ఓ)గా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. మానవ శారీరక పనితీరులో నైట్రిక్ ఆక్సైడ్ రక్త నాళాలను సడలిస్తుంది. అలాగే విస్తరిస్తుంది. ఇది అధిక రక్తపోటును గణనీయంగా తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. బచ్చలికూర, సెలెరీ, క్యాబేజీ, ముల్లంగి కూడా నైట్రిక్ ఆక్సైడ్ ను పెంచుతాయి. 

57

ప్రతిరోజూ 250 మిల్లీ లీటర్ల బీట్రూట్ జ్యూస్ ను తాగడం వల్ల అధిక రక్తపోటు ఉన్నవారి రక్తపోటు తగ్గుతుందని లండన్ లోని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయంలోని బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ (బిహెచ్ఎఫ్) 2015 పరిశోధనలో తేలింది. కొన్ని అధ్యయనాలు ప్రతిరోజూ 2 కప్పుల బీట్ టూర్ రసం తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నాయి.

ఒక కప్పు బీట్రూట్ రసం తీసుకోవడం వల్ల రక్తపోటులో 8/4 ఎంఎంహెచ్జి తగ్గిందని బిహెచ్ఎఫ్ అధ్యయనం తేల్చింది. దీర్ఘకాలంలో రక్తపోటు కలిగించే హృదయ సంబంధ సమస్యలను తగ్గించడానికి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. 

67

రక్తపోటుకు బీట్ రూట్ జ్యూస్ ఎలా ఉపయోగించాలి?

మంచి ఫలితాల కోసం... బీట్ రూట్ లో ఉప్పు, పంచదార కలపకుండా జ్యూస్ రూపంలో తీసుకోవడం ఉత్తమ మార్గమని నిపుణులు చెబుతున్నారు. రోజుకు సుమారు 180 మిల్లీలీటర్ల నుంచి 250 మిల్లీలీటర్ల వరకు రెండు వారాల పాటు ఈ జ్యూస్ ను తాగొచ్చు. 

బీట్ రూట్ జ్యూస్ తయారు చేయడం చాలా సులభం. దుంపలను రసం చేయొచ్చు లేదా ఇతర పండ్లు లేదా కూరగాయలతో కలిపి దీన్ని తయారుచేయొచ్చు. ఆపిల్, బీట్రూట్, క్యారెట్ తో  తయారుచేసిన బీట్ రూట్ జ్యూస్ చాలా ప్రాచుర్యం పొందింది.
 

77

రక్తపోటు రోగులకు బీట్ రూట్ రసం దుష్ప్రభావాలు

ఇప్పటికే బీపీ మందులు వాడుతున్న అధిక రక్తపోటు పేషెంట్లు బీట్ రూట్ జ్యూస్ వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అందుకే దీన్ని మీ ఆహారంలో చేర్చాలని నిర్ణయించుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.

నిపుణుల ప్రకారం.. బీట్రూట్ శరీరంపై ఎక్కువ దుష్ప్రభావాలను కలిగించదు. కానీ హైపోటెన్షన్ ఉన్నవారు దీనిని తాగకపోవడమే మంచిది.  అలాగే ఇందులో ఆక్సలేట్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందుకే మూత్రపిండాల్లో రాళ్ళు,  ప్రకోప ప్రేగు సిండ్రోమ్ ఉన్నవారు బీట్రూట్ కు దూరంగా ఉండాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved