ఈ టీ తాగితే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి
టీ సిప్ చేయకుండా మీ రోజు ప్రారంభం కాదా? నార్మల్ టీ బదులు ఈ ప్రత్యేకమైన టీ ట్రై చేయండి. మీకు మంచి టేస్ట్ తో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఈ టీ తాగడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, కీళ్ల నొప్పులు, ఎసిడిటీ వంటి అనేక సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యాన్ని అందించే ఆ టీ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఇండియా మొత్తం మెచ్చే డ్రింక్ టీ. ఇప్పుడిది ప్రపంచంలోనే బెస్ట్ డ్రింక్ ఐటమ్స్ లో ఒకటిగా మారింది. ప్రతి రోజు కొన్ని కోట్ల మంది టీ తాగుతూ వారి దినచర్యను ప్రారంభిస్తున్నారు. టీ లో కూడా చాలా రకాలున్నాయి. వాటిలో ఒకటి లెమన్ టీ. ఇది రోజూ తాగడం వల్ల అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి శరీరానికి సరైన పోషకాలు అందిస్తాయి. టీ లోని యాంటీ ఆక్సిడెంట్స్, నిమ్మకాయలో ఇమ్యూనిటీ బూస్టర్స్ కలిసి మిమ్మల్ని మరింత శక్తివంతంగా మారుస్తాయి. లెమన్ టీ చేయడానికి మీరు చేయాల్సిందల్లా బ్లాక్ టీలో కొంచెం నిమ్మరసాన్ని వేస్తే సరిపోతుంది. మీరు రుచిని బట్టి టీలో షుగర్, కొన్ని మసాలా పౌడర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇండియాలోనే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు లెమన్ టీలో నల్ల ఉప్పును కూడా కలుపుతారు. ఈ టీ మీరు రోజూ తాగడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఇమ్యూనిటీ పెరుగుతుంది
లెమన్‌లోని విటమిన్ C శరీరానికి ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడుతుంది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది. సీజనల్ ఫ్లూ వంటి వ్యాధుల నుండి రక్షణ కలిగిస్తుంది.
బరువు తగ్గొచ్చు
మీరు బరువు తగ్గాలని చూస్తున్నట్లయితే లెమన్ టీ రోజూ సిప్ చేయండి. ఇది శరీరాన్ని ఫిట్‌గా ఉంచే అనేక యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఇందులో ఉన్నాయి. లెమన్ టీ కొవ్వును కరిగిస్తుంది. మెటబాలిజాన్ని పెంచుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల ఇది బరువు తగ్గాలనుకునేవారికి మంచిది.
జీర్ణశక్తి మెరుగవుతుంది
లెమన్ టీ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థకు సహాయపడుతూ గ్యాస్, నీరసం వంటి సమస్యలను నివారిస్తుంది.
డిటాక్స్ ఫలితాలు
లెమన్ టీలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మీ శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తాయి. నాడీ వ్యవస్థను శుభ్రపరచడంలో సహాయపడతాయి. ఇది జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తాయి.
lemon tea
స్కిన్ గ్లో అవుతుంది
నిమ్మకాయలో ఆస్ట్రింజెంట్ గుణాలు ఉంటాయి. ఇది చర్మానికి సూపర్ ఫుడ్‌గా పనిచేస్తుంది. నిమ్మకాయలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా టీకి మంచి రుచిని అందిస్తాయి. లెమన్ టీ మొటిమలు, తామర వంటి చర్మ వ్యాధులను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీ మొత్తం చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. లెమన్ టీలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. ముడతలు, మచ్చలను తగ్గించడంలో లెమన్ టీ సహాయపడుతుంది.
మెంటల్ పీస్ లభిస్తుంది
మనసు బాగోలేక పోతే చాలా మంది సిగిరెట్, మందు తాగడం అలవాటు చేసుకుంటారు. వాటి బదులు లెమన్ టీ రోజూ తాగడం అలవాటు చేసుకుంటే మానసిక ఆందోళన తగ్గుతుంది. ఇది శరీరానికి విశ్రాంతినిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.
హార్ట్ కు చాలా మంచిది
లెమన్ టీ రెగ్యులర్‌గా తాగడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో లెమన్ టీ సహాయపడుతుంది. హార్ట్ వాల్వులు మూసుకుపోకుండా ఇది సహాయపడుతుంది.
జలుబు, కీళ్ల నొప్పిలను తగ్గిస్తుంది
లెమన్ టీ దగ్గు, జలుబు వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. శ్వాసకోశ సమస్యలను తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. లెమన్ టీ వాడడం వల్ల యూరిక్ ఆమ్లం తగ్గి, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. గౌట్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ముఖ్యమైన సూచనల ఏమిటంటే లెమెన్ టీ కూడా ఎక్కువగా తాగకూడదు. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తాగాలి. ఇలా అయితేనే హెల్త్ బెనిఫిట్స్ అందుతాయి.