Healthy Teeth: ఇవి రెగ్యులర్‌గా తింటే మీ పళ్లు సూపర్ స్ట్రాంగ్ అవుతాయి
Healthy Teeth: ఎవరికైనా పళ్లు స్ట్రాంగ్ గా ఉంటేనే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మరి పళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే..? కొన్ని ప్రత్యేక ఆహారాలు మీ రెగ్యులర్ మెనూ లో ఉండేలా చూసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
క్యాండీలు, కూల్ డ్రింక్స్, సమోసాలు లాంటి జంక్ ఫుడ్ తింటే మీ పళ్ల చుట్టూ రకరకాల క్రిములు చేరతాయి. తర్వాత మీ పళ్లను శుభ్రం చేసుకోకపోతే పళ్లు గార పట్టి కావిటీస్, చిగుళ్ల సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ఇక్కడ ఉన్న 6 రకాల ఫుడ్ ఐటమ్స్ మీరు తరచూ తినాలి.
1. చీజ్: కొన్ని ప్రత్యేకమైన వంటకాల్లో తప్ప చీజ్ ను ఎక్కువగా వాడరు. కాని తరచూ చీజ్ తినే వారికి దంత సమస్యలు తక్కువగా వస్తాయని వైద్యులు చెబుతున్నారు. చీజ్ లో కాల్షియం, ప్రోటీన్ ఉంటాయి. ఇవి దంతాలను బలంగా చేస్తాయి. చీజ్ తినడం వల్ల నోటిలోని pH పెరుగుతుంది. దీని వల్ల నోటిలో లాలాజలం కూడా పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
2. ఆకుకూరలు: ఆకుకూరలు ఎన్నో రకాలుగా ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. కాల్షియం అధికంగా ఉండే పాలకూర వంటి ఆకుకూరలు దంతాలపై ఎనామిల్ పొరను కాపాడటమే కాకుండా కొత్తగా ఎనామిల్ ను తయారు చేస్తాయి.
3. ఆపిల్స్: ఆపిల్స్ లో నీరు, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఆపిల్ తినడం వల్ల మీ నోటిలో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఇది చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. పళ్ల సందుల్లో ఇరుకున్న ఆహార పదార్థాలను బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఆపిల్ పై తోలు చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆపిల్ తినడం వల్ల నోరు, పళ్లలో ఫ్లోరైడ్ సమస్యలు తీరతాయి.
4. పెరుగు: చీజ్ లాగానే పెరుగులో కూడా కాల్షియం, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇది మీ దంతాలను బలంగా ఉండటం ద్వారా మీకు సంపూర్ణ ఆరోగ్యం కలిగేలా దోహదం చేస్తుంది. పెరుగులో లభించే ప్రోబయోటిక్స్ బ్యాక్టీరియా మీ చిగుళ్ళకు మేలు చేస్తుంది. మంచి బ్యాక్టీరియా కావిటీలను కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.
5. క్యారెట్లు: ఆపిల్ లాగానే క్యారెట్లలో కూడా ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ప్రతి రోజు భోజనం చేసిన తర్వాత పచ్చి క్యారెట్ తినడం వల్ల మీ నోటిలో లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది. దీని వల్ల దంతాలు, నోటి ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. ఫైబర్, విటమిన్ ఎ ఉండటం వల్ల తరచూ క్యారెట్ తినండి.
6. బాదం: బాదంలో కాల్షియం, ప్రోటీన్ ఉండటం వల్ల ఇవి మీ దంతాలకు మేలు చేస్తాయి. రోజుకు ఒక గుప్పెడు బాదం పప్పులను తినేలా ప్లాన్ చేసుకోండి. ఒక వేళ మీరు అలా తినలేని పరిస్థితుల్లో సలాడ్ గా కూడా తీసుకోవచ్చు.