వడదెబ్బ తగలకూడదంటే.. ఎండాకాలంలో వీటిని తప్పకుండా తినండి
ఎండలు మండిపోతున్నాయి. ఎండలో ఎక్కువ సేపు ఉంటే వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. అయితే ఈ సీజన్ లో కొన్ని పండ్లను తింటే వడదెబ్బ తగిలే అవకాశం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే దీనికి తగ్గట్టు మన ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి. ఎండాకాలంలో ఇంట్లో ఉండటమే మంచిది. కానీ పనుల వల్ల బయట ఉండాల్సి వస్తుంది. ఇలాంటి వారు శరీరాన్ని హైడ్రేట్ గా, ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. వడగాల్పుల వల్ల చాలా మంది తీవ్రంగా అలసిపోవడమే కాకుండా వడదెబ్బకు గురవుతున్నారు.
Heatwave
హీట్ స్ట్రోక్ అంటే ఏంటి?
హీట్ స్ట్రోక్ అనేది ఒక సాధారణ సమస్య. ఇది శరీరం వేడెక్కడం వల్ల వస్తుంది. వేడి, సూర్యరశ్మి, శారీరక శ్రమకు ఎక్కువసేపు గురికావడం వల్ల ఇది వస్తుంది. శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వడదెబ్బతో బాధపడే అవకాశం ఉంది. వెంటనే చికిత్స చేయకపోతే మెదడు బాగా దెబ్బతింటుంది. అలాగే అంతర్గత అవయవాల పనితీరు కూడా దెబ్బతింటుంది. వడదెబ్బ తగలకూడదంటే ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
cucumber
కీరదోసకాయ
వడదెబ్బ నుంచి మనల్ని రక్షించడానికి కీరదోసకాయలు ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. దీనిలో నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే దీనిలో విటమిన్ ఎ, విటమిన్ బి, ఫోలేట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఎండాకాలంలో వీటిని తింటే మీ శరీరం చల్లగా, హైడ్రేట్ గా ఉంటుంది.
tomatoes
టొమాటోలు
వేడిని తట్టుకోవడానికి టమోటాలు కూడా సహాయపడతాయనే విషయం చాలా మందికి తెలియదు. ఇవి హైడ్రేటింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలను కలిగి ఉంటాయి. వీటిలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మంట ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
పెరుగు
పెరుగులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఎండాకాలంలో పెరుగును ఖచ్చితంగా తినాలంటరు ఆరోగ్య నిపుణులు. దీనిని రైతా, మజ్జిగ, లస్సీ వంటి ఎన్నో విధాలుగా తినొచ్చు. ఇది ప్రోబయోటిక్,. ఇది గట్ ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుతుంది. మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
Image: Getty Images
కొబ్బరి నీరు
వడగాల్పులతో పోరాడటానికి కొబ్బరి నీరు కూడా బాగా సహాయపడుతుంది. దీనిలో ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా ఉంటాయి. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నీళ్లను తాగితే మీరు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇది శరీరంలో సోడియం, పొటాషియం సమతుల్యతను కాపాడుతుంది.
<p>mint leaves</p>
పుదీనా
పుదీనా కూడా ఎండాకాలంలో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఎక్కువగా చట్నీ గా తింటారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
Image: Getty
పుచ్చకాయ
పుచ్చకాయ నుంచి మస్క్మెలోన్ వరకు.. ఇవి మీరు కోల్పోకూడని నీటిని అందిస్తాయి. ఇవి హైడ్రేటింగ్ వేసవి పండ్లు. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వాటర్ కంటెంట్ కూడా వీటిలో ఎక్కువగా ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. వేడికి మీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
వడదెబ్బ కోసం ఇతర నివారణ చిట్కాలు
హైడ్రేటెడ్ గా ఉండండి. ఎండాకాలంలో మన శరీరానికి సాధారణం కంటే ఎక్కువ నీరు అవసరం. కాబట్టి పుష్కలంగా ద్రవాలు తీసుకోండి.
ఎండలో ఎక్కువగా పనిచేయకూడదు. ఎండలు తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే బయటకు వెళ్లండి.
లేత రంగు, వదులుగా, తేలికపాటి బరువున్న దుస్తులను ధరించండి.
శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి సహాయపడటానికి చన్నీటి స్నానాలు చేయండి.