Hair Growth: గుడ్డుతో వీటిని కలిపిరాస్తే.. జుట్టు చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది!
జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలని ఎవరు కోరుకోరు చెప్పండి. జుట్టు త్వరగా పెరగాలని చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారికోసమే ఈ చిట్కాలు. వీటిని క్రమం తప్పకుండా వాడితే జుట్టు పెరుగుదల చూసి మీరే ఆశ్చర్యపోతారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
గుడ్డు, ఆలివ్ ఆయిల్ హెయిర్ మాస్క్
గుడ్డులోని ప్రోటీన్, ఆలివ్ ఆయిల్ లోని తేమ గుణాలు జుట్టుకు మెరుపునిస్తాయి. జుట్టు విరిగిపోకుండా, రాలిపోకుండా సహాయపడతాయి. జుట్టు పెరుగుదలకు తోడ్పడుతాయి. అంతేకాదు ఆలివ్ ఆయిల్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
తయారీ విధానం
గుడ్డు - 1, ఆలివ్ ఆయిల్ - 2 టీస్పూన్లు
ఒక గిన్నెలో ఒక గుడ్డు, 2 టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. తర్వాత జుట్టుకు పట్టించి గంట సేపు ఉంచాలి. తర్వాత షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 1-2 సార్లు చేస్తే మంచి ఫలితాలు చూడవచ్చు.
కొబ్బరి నూనె, గుడ్డు హెయిర్ మాస్క్
కొబ్బరి నూనె జుట్టుకు తేమను అందిస్తుంది. గుడ్డుతో కలిపి జుట్టు పెరుగుదలకు, ఇన్ఫెక్షన్ల నివారణకు సహాయపడుతుంది.
తయారీ విధానం
గుడ్డు - 1, కొబ్బరి నూనె - 2 టీస్పూన్లు
గుడ్డు, కొబ్బరి నూనె కలిపి జుట్టుకు పట్టించి గంట సేపు అలాగే ఉంచాలి. తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేయచ్చు. దానివల్ల జుట్టు ఆరోగ్యం బాగుంటుంది.
ఉల్లిపాయ, గుడ్డు హెయిర్ మాస్క్
ఉల్లిపాయ రసంలోని సల్ఫర్ జుట్టు పెరుగుదలకు చాలా మంచిది. ఇది జుట్టుకు రక్త ప్రసరణను పెంచుతుంది. గుడ్డుతో కలిపి వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గిపోతుంది.
తయారీ విధానం
గుడ్డు - 1, ఉల్లిపాయ రసం - 2 టీస్పూన్లు
ఒక గిన్నెలో గుడ్డు, ఉల్లి రసం వేసి బాగా కలపాలి. తర్వాత జుట్టుకు పట్టించి 45 నిమిషాలు ఉంచుకోవాలి. అనంతరం షాంపూ, కండిషనర్‌తో శుభ్రం చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ ను వారానికి ఒకసారి వాడచ్చు. త్వరలోనే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
పెరుగు, గుడ్డు హెయిర్ మాస్క్
పెరుగులోని లాక్టిక్ యాసిడ్ జుట్టును శుభ్రపరుస్తుంది. మృదువుగా చేస్తుంది. గుడ్డుతో కలిపి పెట్టుకుంటే జుట్టు పెరుగుదల బాగుంటుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
తయారీ విధానం
గుడ్డు - 1, పెరుగు - 3 టీస్పూన్లు
గుడ్డు, పెరుగు కలిపి జుట్టుకు పట్టించాలి. 45 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ ను వారానికి ఒకసారి వాడచ్చు.
కలబంద, గుడ్డు హెయిర్ మాస్క్
కలబంద.. జుట్టు పెరుగుదలకు సహాయపడే ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది. ఇది జుట్టు పోషణ, pH బ్యాలెన్స్, చుండ్రు నివారణకు సహాయపడుతుంది. గుడ్డుతో కలిపి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
తయారీ విధానం
గుడ్డు - 1, కలబంద జెల్ - 2 టీస్పూన్లు
గుడ్డు, కలబంద జెల్ కలిపి జుట్టుకు పట్టించి 45 నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి. వారానికి 1-2 సార్లు దీన్ని వాడవచ్చు. మంచి ఫలితాలు కనిపిస్తాయి.
అవకాడో, గుడ్డు హెయిర్ మాస్క్
అవకాడోలోని విటమిన్లు జుట్టుకు పోషణ, బలం చేకూరుస్తాయి. ఇది జుట్టు విరిగిపోకుండా, రాలిపోకుండా సహాయపడుతుంది. గుడ్డుతో కలిపి జుట్టుకు మృదుత్వం, మెరుపును ఇస్తుంది.
తయారీ విధానం
గుడ్డు - 1, అవకాడో - 1/2
అవకాడో గుజ్జు, గుడ్డు కలిపి జుట్టుకు పట్టించాలి. 45 నిమిషాలు అలాగే ఉంచి.. షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ ను వారానికి ఒకసారి వాడచ్చు.