MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Health
  • స్మోకింగ్ చేసే అలవాటుందా? అయితే మీకు ఈ చర్మసమస్యలు రావడం పక్కా..!

స్మోకింగ్ చేసే అలవాటుందా? అయితే మీకు ఈ చర్మసమస్యలు రావడం పక్కా..!

స్మోకింగ్ ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీసే వందలాది రసాయనాలను రిలీజ్ చేస్తుంది. స్మోకింగ్ ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్ వంటి ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుందన్న ముచ్చట చాలా మందికి తెలుసు. అంతేకాదు స్మోకింగ్ ఎన్నో చర్మ సమస్యలకు కూడా దారితీస్తుంది తెలుసా..?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 03 2023, 02:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
smoking

smoking

పొగాకు వాడకం ఆరోగ్యానికి హానికరం అన్న సంగతి అందరికీ తెలుసు. సిగరేట్ పై కూడా ఈ ముచ్చట ఉంటుంది. అయినా దీన్ని తాగేవారు చాలా మందే ఉన్నారు. ఇది క్యాన్సర్ వంటి ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. ధూమపానం శ్వాసకోశ వ్యవస్థ, ఊపిరితిత్తులను మాత్రమే కాదు మన చర్మ ఆరోగ్యాన్ని కూడా ప్రమాదంలో పడేస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
smoking

smoking

ఇది చర్మాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

పొగాకు వినియోగం చర్మ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. పొగాకు పొగలో నికోటిన్ అనే అత్యంత ప్రమాదకరమైన రసాయనంతో పాటుగా చర్మ కణాలు, శ్వాసనాళ కణాలు, మానవ శరీరంలోని ఇతర అవయవాలకు విషపూరితమైన అనేక హానికరమైన పదార్థాలు దీనిలో ఉంటాయి. శరీరం చర్మం, శ్వాసనాళం, పేగు శ్లేష్మంలోకి నికోటిన్ ను గ్రహిస్తుంది. కెరాటినోసైట్లు ప్రత్యేక కణాలు. ఇవి చర్మాన్ని దెబ్బతీస్తాయి. ముఖ్యమైన రోగనిరోధక విధులకు ఆటంకం కలిగిస్తాయి. నికోటిన్ ఈ కణాలలో అపోప్టోసిస్-కణాలు చనిపోవడానికి దారితీస్తుంది. చర్మంలోని రక్త నాళాలను దెబ్బతీస్తుంది. రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. స్మోకింగ్ చర్మాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

 

37

అకాల చర్మం వృద్ధాప్యం

స్మోకింగ్ కొల్లాజెన్, ఎలాస్టిన్ ను ప్రభావితం చేస్తుంది. ఇవి చర్మాన్ని బొద్దుగా, దృఢంగా ఉంచుతాయి. 2021 లో లు యాంగెట్ అల్ ప్రచురించిన సమీక్షలో.. స్మోకింగ్ చేయని వారితో పోలిస్తే ప్రస్తుతం ధూమపానం చేసేవారిలో విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. విటమిన్ డి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే  కణజాల మరమ్మత్తుకు సహాయపడుతుంది.
 

47

ముడతలు

స్మోకింగ్ చేసే వారికి ముడతలు ఎక్కువగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు స్మోకింగ్ చర్మాన్ని జిడ్డుగా మార్చే స్కిన్ కొల్లాజెన్ విచ్ఛిన్నం కావడానికి కూడా దారితీస్తుంది. 
 

57

స్కిన్ పిగ్మెంటేషన్

చర్మంలో మెలనోసైట్లు పెరగడం వల్ల చర్మం పిగ్మెంటేషన్ ను కారణమయ్యే మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది ఎక్కువ కాలం ఉంటే ఇది వయస్సు మచ్చలు, నల్ల మచ్చలుగా అభివృద్ధి చెందుతుంది.

67

చర్మం పొడిబారడం

సిగరెట్ పొగలోని రసాయనాలు ట్రాన్స్ ఎపిడెర్మల్ నీటి నష్టం,  కొల్లాజెన్, ఎలాస్టిన్ ఫైబర్ క్షీణతను పెంచుతాయి. ఇది చర్మం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అలాగే చర్మం పొడిబారేలా చేస్తుంది. 
 

77

డల్ స్కిన్ 

ధూమపానం చేసేవారి చర్మానికి రక్తం సరఫరా తగ్గుతుంది.  దీనివల్ల చర్మం నీరసంగా, పాలిపోయిన రంగులో కనిపిస్తుంది. ఆక్సిజన్, పోషకాలను కోల్పోవడం వల్లే ఇలా జరుగుతుంది. నేచురల్ స్కిన్ ను క్షీణింపజేసే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గిపోతాయి.  
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved