MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Health
  • మందులు వాడకుండా బీపీని కంట్రోల్ చేసే చిట్కాలు

మందులు వాడకుండా బీపీని కంట్రోల్ చేసే చిట్కాలు

అధిక రక్తపోటు సమస్యను తగ్గించుకోవడానికి చాలా మంది మందులను వాడుతుంటారు. కానీ కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం మందులు వాడకుండానే బీపీని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Aug 24 2025, 06:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బీపీ కంట్రోల్ లో ఉండాలంటే?
Image Credit : Getty

బీపీ కంట్రోల్ లో ఉండాలంటే?

బీపీ పెరగడానికి ప్రధాన కారణం ఉప్పు. అందుకే మీరు రక్తపోటును కంట్రోల్ లో ఉంచుకోవాలంటే ఉప్పును తగ్గించాలి. అలాగే ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలను మానేయాలి. మీరు రోజూ తినే ఫుడ్ లో ఉప్పును తగ్గించి మసాలా దినుసులను వాడి ఫుడ్ టేస్ట్ ను పెంచండి. 

దీనివల్ల మీ శరీరంలో నీటి నిల్వ తగ్గుతుంది. అలాగే రక్తనాళాల్లో ఒత్తిడి తగ్గుతుంది. మీరు రోజూ అరటిపండ్లు, టమాటాలు, ఆకు కూరలు, అవకాడో, చిలగడదుంపలు వంటి ఆహారాలను బాగా తనిండి. ఇవి సోడియం ను మీ శరీరంలోంచి బయటకు పంపడానికి సహాయపడుతుంది. అలాగే రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వ్యాయామం చేయాలి
Image Credit : Getty

వ్యాయామం చేయాలి

రక్తపోటు అదుపులో ఉండాలంటే మీరు ప్రతిరోజూ అర్దగంటైనా వ్యాయామం చేయాలి. ఇది రక్తపోటును తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం జాగింగ్, సైక్లింగ్, ఫాస్ట్ గా నడవడం, స్విమ్మింగ్, డ్యాన్స్ వంటి కార్డియో వ్యాయామాలు చేయండి. ఈ వ్యాయామాలు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే బరువు పెరగకుండా కాపాడుతాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇందుకోసం మీరు వారానికి 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. 

34
పండ్లు, కూరగాయలు తినాలి
Image Credit : Getty

పండ్లు, కూరగాయలు తినాలి

మందులు వాడకుండా బీపీ తగ్గాలంటే మీరు పండ్లను, కూరగాయలను, తృణధాన్యాలను, కొవ్వు లేని ప్రోటీన్లను ఎక్కువగా తినాలి. ఇవి మీ బీపీని నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. బీపీ కంట్రోల్ లో ఉండాలంటే మీరు చక్కెర పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు,సంతృప్త, ట్రాన్స్ కొవ్వులను తీసుకోకూడదు.

44
బరువు పెరగకూడదు
Image Credit : Getty

బరువు పెరగకూడదు

బరువు ఎక్కువగా ఉంటే కూడా రక్తపోటు అటోమెటిక్ గా పెరుగుతుంది. అందుకే బరువును కంట్రోల్ లో ఉంచుకోవాలి. అలాగే  మీ ఎత్తుకు తగ్గ బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 18.5 నుంచి 24.9 వరకు ఉండాలి. మీకు తెలుసా? కొన్ని కిలోల బరువు తగ్గినా రక్తపోటులో చాలా మార్పు వస్తుంది. రోజూ వ్యాయామం చేస్తూ, ఆరోగ్యకరమైన ఆహారాలను తింటే మీ బరువు నియంత్రణలో ఉంటుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆరోగ్యం
జీవనశైలి
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved