కరివేపాకు టీ తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.. ఈ టీ ఎలా చెయ్యాలంటే?
కరివేపాకులో (Curry leaves) ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి. కరివేపాకును నిత్యం ఏదో ఒక రూపంలో మనం వంటలలో వాడుతుంటాం. కరివేపాకును వంటలలోనే మాత్రమే కాకుండా దీంతో టీ చేసుకుని తాగితే కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ (Article) ద్వారా కరివేపాకుతో చేసుకునే టీ తయారీ విధానం, వాటి ఉపయోగాల గురించి తెలుసుకుందాం..

కరివేపాకుతో టీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కరివేపాకు టీకి కావలసిన పదార్థాలు: ఒక కప్పు కరివేపాకు ఆకులు (Curry leaves), ఒక టీ స్పూన్ తేనె (Honey), ఒక టీ స్పూన్ నిమ్మరసం(Lemon juice).
తయారీ విధానం: ముందుగా కరివేపాకు ఆకులను తీసుకొని నీటిలో బాగా శుభ్రపరుచుకోవాలి. ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీరు (Water) తీసుకొని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. ఇలా మరుగుతున్న నీటిలో కరివేపాకు ఆకులను వేసి ఒక నిమిషం తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత కరివేపాకు నీళ్ళు కలర్ మారే వరకు అలాగే ఉండనివ్వాలి. ఈ నీటిని వడగట్టి గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఇందులో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగాలి. ఇలా తయారుచేసుకున్న కరివేపాకు టీని తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ముఖ్యంగా ఈ టీ తాగడంతో మార్నింగ్ సిక్ నెస్, వికారం తగ్గుతుంది. శరీర బరువును తగ్గిస్తుంది. కరివేపాకు టీలో ఉండే హెర్బల్, మెడికల్ కాంపోనెంట్స్ జీర్ణశక్తిని (Digestion) మెరుగు పరుస్తాయి. డయోరియాను నివారిస్తుంది. మనం ఎక్కువగా తీపి పదార్థాలు తిన్నప్పుడు కూల్ డ్రింక్స్ తాగినప్పుడు మన శరీరంలోని బ్లడ్ లో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. దీంతో శరీరంలో చేరే ఎక్స్ ట్రా షుగర్ ఫ్యాట్ గా మారుతుంది. అది శరీరంలో నిల్వ చేరి అధిక బరువుకు కారణం అవుతుంది. ఈ టీని తాగడంతో షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుతుంది. బరువును తగ్గిస్తుంది. డయాబెటిస్ (Diabetes) కు దూరంగా ఉంచుతుంది.
కరివేపాకులో మహానింబిసిన్ అనే కంటెంట్ ఉంటుంది. దీనికి గాయాలను నయం చేసే శక్తి ఉంటుంది. టీ కోసం ఉడికించిన కరివేపాకు పేస్టును గాయాలమీద, పుండ్ల మీద, కాలిన ప్రదేశంలో అప్లై చేసిన త్వరగా నయమవుతాయి. గాయల వద్ద తిరిగి హెయిర్ ఫాలీసెల్స్ ను పుననిర్మితమవడానికి సహాపడుతుంది. కరివేపాకులో కార్బోజోల్ ఆల్కలాయిడ్ (Carbazole alkaloids) అనే పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల, శరీరంలో ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది. అలాగే శరీరం ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కు గురి కాకుండా బ్యాక్టీరియాను (Bacteria) నాశనం చేస్తుంది.
కరివేపాకులో లినోలూల్ అనే కంటెంట్ మంచి అరోమా వాసనను అందిస్తుంది. ఇది శరీరానికి విశ్రాంతి కలిగించి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒత్తిడిగా ఉన్నప్పుడు కరివేపాకు టీ తాగడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ టీ తాగడంతో మతిమరుపు సమస్యలు తగ్గుతాయి. జ్ఞాపక శక్తి (Memory) పెరుగుతుంది. జుట్టు ఆరోగ్యంగా బలంగా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. కరివేపాకులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కళ్లకు విశ్రాంతి కలిగించి ఒత్తిడిని తగ్గిస్తాయి. లుకేమియా, ప్రొస్టేట్ క్యాన్సర్లను (Cancer) నివారించే గుణాలు కరివేపాకు టీలో ఎక్కువగా ఉంటాయి.