MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • వారానికి ఓసారి చిలకడ దుంప తింటే ఏం జరుగుతుందో తెలుసా?

వారానికి ఓసారి చిలకడ దుంప తింటే ఏం జరుగుతుందో తెలుసా?

చిలకడదుంప (Sweet potato) గురించి చాలామందికి సరైన అవగాహన ఉండదు. చిలగడదుంప శరీరానికి చేసే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే వాటిని తినకుండా ఉండలేరు. చిలకడ దుంప ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గని వైద్యులు చెబుతున్నారు. నిత్యం ఏదో ఒక రూపంలో చిలగడదుంపలను తీసుకుంటే శరీరానికి  పోషకాలు అంది ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇప్పుడు మనం చిలగడ దుంపలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఈ ఆర్టికల్ (Article) ద్వారా తెలుసుకుందాం..  

2 Min read
Sreeharsha Gopagani | Asianet News
Published : Dec 04 2021, 03:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

చిలకడ దుంపలో మెగ్నీషియం, క్యాల్షియం, విటమిన్లు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి ఎముకలను బలపరచడానికి, క్యాన్సర్ (Cancer) లను సైతం తగ్గించే గుణాలను చిలగడదుంప కలిగి ఉంటుంది. ఎదిగే పిల్లలకు చిలగడ దుంపలను ఉడికించి తినిపించడంతో వారి మానసిక ఎదుగుదల (Mental growth) మెరుగుపడుతుంది. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇప్పుడు ఎన్నో పోషకాలు కలిగిన చిలకడదుంపను తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..

28

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: చిలకడదుంపలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని (Immunity) పెంచి శరీరంలోని ఇన్ఫెక్షన్ (Infection), వైరస్ లను తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.    
 

38

కంటిచూపును మెరుగుపరుస్తుంది: చిలగడ దుంపలో బీటా కెరటిన్‌ (Beta keratin), విటమిన్ ఏ అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి కంటికి కావలసిన పోషకాలను అందించి కంటిచూపును మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలిక కంటి సమస్యలను (Eye problems) తగ్గిస్తుంది. నిత్యం ఏదో ఒక రూపంలో చిలగడ దుంపలను తింటే మంచి ఫలితం ఉంటుంది. 

48

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది: చిలకడదుంపలో బంగాళదుంప, కందగడ్డలో కన్నా అధిక మొత్తంలో పీచు పదార్థం ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను (Digestive system) మెరుగుపరిచి తిన్న ఆహారాన్ని తేలికగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య (Constipation problem) నుంచి విముక్తి కలిగిస్తుంది.  

58
sweet potato

sweet potato

ఒత్తిడిని తగ్గిస్తుంది: చిలగడదుంపలో పాంథోనిక్ యాసిడ్ (Panthonic acid) ఉంటుంది. ఇది శరీర ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ఇది శరీరానికి కావలసిన అన్ని పోషకాలను (Nutrients) అందించి  ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

68
Sweet potato

Sweet potato

అధిక రక్తపోటును తగ్గిస్తుంది: చిలకడ దుంప అధిక రక్తపోటును (High blood pressure) తగ్గించడానికి చక్కగా పనిచేస్తుంది. చిలగడ దుంపలో పొటాషియం (Potassium) పుష్కలంగా ఉండటం కారణంగా అధిక రక్తపోటును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది

78

పంటి సమస్యలను తగ్గిస్తుంది: చిలగడ దుంపలో విటమిన్-సి (Vitamin C) రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది పళ్ళు బలంగా ఉండేందుకు పళ్ల నుంచి రక్తం కారే సమస్యలను అరికట్టడానికి సహాయపడతాయి. పంటి సమస్యలను (Dental problems) దరిచేరనివ్వదు.

88

కండర పుష్టికి సహాయపడుతుంది: చిలగడదుంపలు న్యూటియంట్స్, కార్బోహైడ్రేట్స్ (Carbohydrates) పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి అవసరమయ్యే పోషకాలను అందించి శరీర కండర పుష్టికి (Muscle strength) సహాయపడుతుంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved