Water: భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగుతున్నారా? ఎంత డేంజరో తెలుసుకోండి
వాటర్ తాగడం ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కానీ ఎప్పుడుపడితే అప్పుడు వాటర్ తాగడం అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు మధ్యలో నీళ్లు తాగితే చాలా డేంజర్ అని చెబుతున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. రోజూ కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలని నిపుణులు చెబుతుంటారు. రోజుకు అవసరమైన నీరు తాగడం మంచిదే కానీ, నీరు తాగడానికి సరైన సమయం కూడా తెలుసుకోవాలి.
ఎప్పుడుపడితే అప్పుడు నీరు తాగినా కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. చాలామందికి భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో నీళ్ళు తాగవచ్చా అనే డౌట్ ఉంటుంది. మరి తాగవచ్చో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.
తినేటప్పుడు నీళ్ళు తాగవచ్చా?
నిపుణుల అభిప్రాయం ప్రకారం, తినేటప్పుడు నీరు తాగడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది జీర్ణక్రియపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. జీర్ణక్రియ సమయంలో, పొట్టలోని ఆమ్లం ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. అప్పుడు నీరు తాగితే, అది కడుపులోని ఆమ్లాన్ని పలుచబరుస్తుంది. ఇది జీర్ణక్రియపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. పొట్ట సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.
తినేటప్పుడు నీళ్లు తాగితే?
స్థూలకాయం పెరుగుతుంది:
భోజనం చేసేటప్పుడు నీళ్ళు తాగితే జీర్ణశక్తి బలహీనపడి స్థూలకాయం పెరుగుతుంది. ఇది మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి భోజనం చేసేటప్పుడు నీళ్ళు తాగకండి.
గ్యాస్, ఎసిడిటీ :
తినేటప్పుడు వాటర్ తాగితే ఆహారం జీర్ణం కాకుండా ఆపుతుంది. ఇది అజీర్తి, గ్యాస్, ఎసిడిటీకి దారితీస్తుంది.
ఎప్పుడు నీళ్ళు తాగాలి?
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆహారం జీర్ణం కావడానికి దాదాపు 2 గంటలు పడుతుంది. కాబట్టి భోజనం చేసిన రెండు గంటల తర్వాత మాత్రమే నీరు తాగాలని గుర్తుంచుకోవాలి. ఒకవేళ కారంగా తిన్నట్లయితే, ఒకసారి మాత్రమే నీరు తాగవచ్చు. సరైన సమయంలో నీరు తాగితే, బరువు కూడా అదుపులో ఉంటుంది. జీర్ణవ్యవస్థ కూడా బలంగా ఉంటుంది.