రామ్ చరణ్ కోసం మలయాళ హీరోయిన్ ను సెట్ చేస్తోన్న సుకుమార్, నిజమెంత..?
పెద్ది సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.. రామ్ చరణ్ ఈసారి సాలిడ్ హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. పెద్ది తరువాత సుకుమార్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు.. రామ్ చరణ్ కోసం మలయాళ హీరోయిన్ ను సెట్ చేస్తున్నాడట సుకుమార్.

పెద్ది బిజీలో ఉన్న రామ్ చరణ్..
ఆర్ఆర్ఆర్ తరువాత వరుసగా రెండు ఫెయిల్యూర్స్ చూశాడు రామ్ చరణ్.. ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది సినిమా చేస్తున్నాడు చరణ్. ఈసినిమాపై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. పల్లెటూరి మాస్ పాత్రలో చరణ్ రగ్డ్ లుక్ లో కనిపించబోతున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. సుకుమర్ కథను అందించిన ఈసినిమా ఏప్రిల్ 30న న రిలీజ్ కాబోతోంది. ఈసినిమా తరువాత సుకుమార్ తో మరోఅద్భుతమైన సినిమాకు రెడీ అవుతున్నాడు మెగా పవర్ స్టార్.
రంగస్థలం బ్లాక్ బస్టర్ కాంబినేషన్..
సుకుమార్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు రామ్ చరణ్. వీరి కాంబినేషన్ లో గతంలో రంగస్థలం సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో రామ్ చరణ్ కెరీర్ కంప్లీట్ గా మారిపోయింది. చరణ్ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. చరణ్ జాతకమే మారిపోయింది ఈసినిమాతో. పల్లెటూరి పాత్ర.. అందులోను డీగ్లామర్ రోల్ చేశాడీ సినిమాలో. రంగస్థలం లాంటి రీజనల్ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో మరో చిత్రం రూపొందనుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి..
రామ్ చరణ్ , సుకుమార్ కాంబోకు ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు ఉండటంతో కొత్త సినిమాపై అభిమానులు, సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్ – బుచ్చిబాబు పెద్ది కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా షూటింగ్ పూర్తయ్యిన వెంటనే సుకుమార్ తన ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాడని సమాచారం. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు తప్ప మరే ఇతర కార్యక్రమాలు మొదలుకాలేదని తెలుస్తోంది.
రామ్ చరణ్ జోడీగా..
రామ్ చరణ్ , సుకుమార్ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాకపోయినా.. ఈ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ కారణంగా.. తరచూ ఏదో ఒక అప్డేట్ బయటకు వస్తూనే ఉంది. ఇటీవల ఈ సినిమాలో కన్నడ సెన్సేషన్ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించనుందనే వార్తలు వైరల్ అయ్యాయి. కాని తాజాగా మరో హీరోయిన్ పేరు వినిపిస్తోంది. గతంలో రంగస్థలం సినిమా ప్రారంభ దశలో అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. కానీ తరువాత ఆమె స్థానంలో సమంతను తీసుకున్నారు. ఆ సమయంలో ఈ విషయంలో అనుపమ బాధపడినట్లు వార్తలు వచ్చాయి.
అనుపమ పరమేశ్వరన్ ఫైనల్ అయ్యిందా..?
తరువాత అనుపమ నటించిన ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సుకుమార్, ఆమె మంచి నటి అని ప్రశంసిస్తూ, భవిష్యత్తులో తన సినిమాలో ఆమెకు అవకాశం ఇస్తానని ప్రకటించాడట. ఆ మాట ప్రకారం ఈసారి రామ్ చరణ్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ను హీరోయిన్‌గా తీసుకునే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాదు కానీ.. సోషల్ మీడియాలో న్యూస్ మాత్రం వైరల్ అవుతోంది.

