- Home
- Entertainment
- Gossips
- కార్తీక దీపం దీప రెమ్యునరేషన్ ఎంత? వంటలక్క ఆస్తులు తెలిస్తే కళ్లు తిరగాల్సిందే..ప్రేమి విశ్వనాథ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్..?
కార్తీక దీపం దీప రెమ్యునరేషన్ ఎంత? వంటలక్క ఆస్తులు తెలిస్తే కళ్లు తిరగాల్సిందే..ప్రేమి విశ్వనాథ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్..?
కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగింటి ఆడపడుచులా మారింది దీప అలియాస్ వంటలక్క. బుల్లితెరపై భారీ ఇమేజ్ సాధించిన ఆమె.. రోజుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ప్రేమీ విశ్వనాథ్ ఆస్తులు ఎంత..?

తెలుగు రాష్ట్రాల్లో సీరియల్స్ క్రేజ్..
తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర సీరియల్స్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ క్రేజ్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ పేరు వింటే చాలు ప్రేక్షకుల మనసులో మొదట గుర్తొచ్చే పాత్ర వంటలక్క. వంటలక్కగా నటించిన నటి ప్రేమి విశ్వనాథ్ తెలుగు ప్రేక్షకులకు ఇంటిపేరు లాంటి గుర్తింపును సంపాదించుకుంది.
వంటలక్క అమాయకత్వం, కుటుంబ విలువలు, డాక్టర్ బాబు కోసం ఆమె చేసే పోరాటం మహిళా ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయ కట్టు, బొట్టు, నిండైన అభినయంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను దగ్గర చేసుకుంది ప్రేమి విశ్వనాథ్. టాలీవుడ్‌లో హీరోయిన్లకు ఎంత ఇమేజ్ ఉంటుందో, బుల్లితెరపై ప్రేమి విశ్వనాథ్‌కు అంతే ఇమేజ్ ఉందని చెప్పుకోవచ్చు.
ప్రేమి విశ్వనాథ్ రెమ్యునరేషన్..
దాదాపు ఆరేళ్ల పాటు ప్రేక్షకులను టీవీలకు అతుక్కునేలా చేసిన కార్తీకదీపం సీరియల్ అపార విజయాన్ని సాధించింది. ఇప్పుడు అదే సీరియల్ సీక్వెల్‌గా కార్తీకదీపం 2 – నవ వసంతం పేరుతో ప్రసారమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రేమి విశ్వనాథ్ ఇమేజ్ అప్పటికీ ఇప్పటికీ భారీగా పెరిగిపోయింది.
దాంతో ఆమె రెమ్యునరేషన్ కూడా భారీగానే పెరిగినట్టు తెలుస్తోంది. మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. కెరీర్ బిగినింగ్ లో రోజుకు 25 వేలు తీసుకుందట ప్రేమి.. ఇక ఇప్పుడు కార్తీకదీపం 2 సీరియల్‌లో ఒక్క రోజు నటించినందుకు ఆమె సుమారు 1 లక్ష రూపాయలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అలా నెలకు ఆమె ఆదాయం దాదాపు 30 లక్షల రూపాయలుపైనే ఉంటుందని టాక్.
వంటలక్క ఆస్తుల వివరాలు..
రెమ్యునరేషన్ విషయంలో బుల్లితెర హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా ప్రేమి విశ్వనాథ్ సంపాదిస్తున్నట్టు సమాచారం. ఆమెకు 50 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అలాగే ఆమె వద్ద రెండు లగ్జరీ కార్లు, ఒక విలాసవంతమైన భవనం ఉన్నాయని తెలుస్తోంది. వంటలక్క పాత్రతో ఫేమస్ అయిన ప్రేమి విశ్వనాథ్ చదువులోనూ ముందుందని సమాచారం. ఆమె లా ప్రాక్టీస్ కూడా చేస్తుందని చెబుతున్నారు.
అంతేకాదు, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కేరళలో ఆమెకు రెండు స్టూడియోలు ఉన్నాయట. ఆ స్టూడియోలలో మలయాళ ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాలు, సీరియల్స్ షూటింగ్స్ జరుగుతాయని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అక్కడే జరుగుతున్నాయని తెలుస్తోంది.
ప్రేమి విశ్వనాథ్ ఫ్యామిలీ..
కార్తీకదీపం సీరియల్ విజయం తర్వాత ప్రేమి విశ్వనాథ్ ఫ్లవర్స్ టీవీలో ఒక కార్యక్రమానికి హోస్ట్‌గా కూడా పనిచేసింది. ఇక ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే, ప్రేమి విశ్వనాథ్ భర్త పేరు డాక్టర్ వినీత్ భట్. ఆయన ఒక ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్‌గా గుర్తింపు పొందారు. 2017లో ఆయన వరల్డ్ బెస్ట్ ఆస్ట్రాలజర్ అవార్డును కూడా అందుకున్నారని సమాచారం. అంతే కాదు ప్రేమి ఒక కొడుకు కూడా ఉన్నాడు.. ప్రస్తుతం అతను బీటెక్ చదువుతున్నాడు.. హీరోలకు ఏమాత్రం తక్కువ కాకుండా హ్యాండ్సమ్ లుక్ తో మెరిసిపోతుంటాడు.

