- Home
- Entertainment
- సుస్మిత కొణిదెల భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? చిరంజీవి పెద్దల్లుడు రేంజ్ తెలిస్తే షాక్ అవుతారు..
సుస్మిత కొణిదెల భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? చిరంజీవి పెద్దల్లుడు రేంజ్ తెలిస్తే షాక్ అవుతారు..
ఉదయ్ కిరణ్ తో ఎంగేజ్మెంట్ బ్రేకప్ తరువాత.. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా? మెగాస్టార్ పెద్దల్లుడు బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఎంత మంది పిల్లలు? ఏం చేస్తుంటారు?

స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి..
సినీ ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి, కష్టంతో, పట్టుదలతో టాలీవుడ్‌లో అగ్రస్థాయికి ఎదిగిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. సినీ రంగంలోకి వచ్చి అసాధారణ విజయాలను అందుకున్నారు చిరు. స్వయంకృషితో టాలీవుడ్‌లో తిరుగులేని హీరోగా ఎదిగారు. దశాబ్దాల పాటు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా కొనసాగిన ఆయన, తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేశారు.
దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోలలో ఒకరిగా చిరు గుర్తింపు పొందారు.చిరంజీవి వేసిన మార్గంలో మెగా ఫ్యామిలీ హీరోలు ముందుకు సాగారు. మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత నిర్మాతగా కొనసాగుతున్నారు. రీసెంట్ గా ఆయనతో మన శంకర వరప్రసాద్ గారు సినిమాను ఆమె నిర్మించారు.
నిర్మాతగా ఎదుగుతున్న సుస్మిత కొణిదెల..
చిరంజీవ పెద్ద కూతురు సుస్మిత నిర్మాతగా ఎదుగుతున్నారు. రీసెంట్ గా ఆమె చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు సినిమాను నిర్మించారు. గతంలో కూడా ఆమె ఓ సినిమాను నిర్మించింది. ఇక చిరంజీవి ఫ్యామిలీలో అందరి గురించి తెలుసు.. కానీ సుస్మిత ఫ్యామిలీ గురించి, ఆమె భర్త గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఉదయ్ కిరణ్ తో ఎంగేజ్మెంట్ బ్రేకప్ తరువాత సుస్మిత ఎవరిని పెళ్లాడింది. వారి ఫ్యామిలీబ్యాక్ గ్రౌండ్ ఏంటి? వారు ఏం చేస్తుంటారు అనేది చాలా తక్కువ మందికి తెలుసు.
సుస్మిత భర్తఎవరు? ఏం చేస్తాడు.
చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల చెన్నైలో సెటిల్ అయిన విష్ణు ప్రసాద్‌ను వివాహం చేసుకుంది. అయితే విష్ణు ప్రసాద్ ఎవరు? ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అనే ఆసక్తి అభిమానుల్లో ఎప్పటి నుంచో ఉంది. విష్ణు ప్రసాద్ కుటుంబం రాయలసీమ నుంచి తమిళనాడుకు వెళ్లి అక్కడ స్థిరపడ్డట్టు సమాచారం. ఆయన తాత ఎల్వి రామారావు ఒకప్పుడు చెన్నైలో పేరొందిన బిజినెస్‌మ్యాన్‌గా గుర్తింపు పొందారు. జపాన్, సింగపూర్, అమెరికా వంటి దేశాలతో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ విస్తృతంగా వ్యాపారాన్ని నడిపేవారు.
వ్యాపారంలో రాణిస్తోన్న విష్ణు ప్రసాద్..?
ఎల్వి రామారావు కుమారుడు ఎల్వి ప్రసాద్, చంద్రిక దంపతులకు ఏకైక కుమారుడు విష్ణు ప్రసాద్. విష్ణు ప్రసాద్ బిజినెస్ రంగంలో అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. చదువు పూర్తయిన వెంటనే కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టారట. తాత స్థాపించిన పామాయిల్ వ్యాపారాన్ని తండ్రి సారథ్యంలో అభివృద్ధి చేయడమే కాకుండా, ప్రస్తుతం ఆ వ్యాపారాన్ని విష్ణు మరింత విస్తరించినట్టు సమాచారం.విష్ణు ప్రసాద్, సుస్మిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
ఇండస్ట్రీలోకి సుస్మిత
సుస్మిత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చదువుకున్నారు. తాను నేర్చుకున్న ఫ్యాషన్ డిజైన్ విద్యను సినీ రంగంలో ఉపయోగిస్తున్నారు. చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 చిత్రానికి సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు.సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పెరిగిన సుస్మితకు సినిమాలపై ఉన్న ఆసక్తిని గమనించిన విష్ణు ప్రసాద్, ఆమెను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేలా ప్రోత్సహించినట్టు సమాచారం. ఈ విధంగా సుస్మిత ఇండస్ట్రీలో అన్ని విభాగాలపై పట్టు సాధించి.. నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు. నెక్ట్స్ ఆమె రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నట్టు సమాచారం.

