MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Gossips
  • ఎన్టీఆర్ కు హ్యాండ్ ఇచ్చిన దర్శకుడు.. బాలకృష్ణ తో సినిమా చేయబోతున్నాడా? నిజమెంత?

ఎన్టీఆర్ కు హ్యాండ్ ఇచ్చిన దర్శకుడు.. బాలకృష్ణ తో సినిమా చేయబోతున్నాడా? నిజమెంత?

ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రెడీగా ఉన్న దర్శకుడు.... రూట్ మార్చి బాలకృష్ణతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడా? తారక్ సినిమాను పక్కన పెట్టి.. బాలయ్య సినిమా చేయడానికి కారణం ఏంటి? ఇందులో నిజమెంత.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 06 2026, 07:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎన్టీర్ సినిమాకు బ్రేక్ పడిందా?
Image Credit : our own

ఎన్టీర్ సినిమాకు బ్రేక్ పడిందా?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు తారక్. ఈసినిమాలో యంగ్ టైగర్ పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ ను చూడటానికి అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈసినిమా తరువాత ఆడియన్స్ అందరి దృష్టి.. దేవర పార్ట్ 2 పైనే ఉంది. ఆర్ఆర్ఆర్ తరువాత దేవర సినిమాతో ఎన్టీఆర్ మాస్ అవతార్‌లో మెప్పించాడు. పవర్ ఫ్యాక్ యాక్షన్ తో అభిమానులకు మాస్ ట్రీట్ ఇచ్చాడు. ఇక దేవర సినిమాకు వచ్చిన క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అదే కారణంగా దేవర పార్ట్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

25
దేవర 2 షూటింగ్ అప్ డేట్..
Image Credit : youtube/sreyas media

దేవర 2 షూటింగ్ అప్ డేట్..

డ్రాగన్ సినిమాపై భారీగా అంచనాలు పెరిగినా కానీ.. దేవర 2 గురించి కూడా ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గురించి చిన్న అప్‌డేట్ వచ్చినా, అది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ నేపథ్యంలో ఇటీవల దేవర చిత్ర నిర్మాత సుధాకర్ మిక్కిలినేని చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్‌లో ఆశలు రేపాయి. ఎ

న్టీఆర్ వరుసగా కొత్త సినిమాలకు కమిట్ అవుతున్న నేపథ్యంలో దేవర పార్ట్ 2 క్యాన్సిల్ అయ్యిందన్న ప్రచారం జరిగింది. దాంతో అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. అయితే, తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సుధాకర్ మిక్కిలినేని మాట్లాడుతూ, జూన్ నుంచి దేవర పార్ట్ 2 షూటింగ్ మొదలవుతుందని వెల్లడించారు. ఈ కామెంట్స్‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మళ్లీ ఆశలు చిగురించాయి.

Related Articles

Related image1
4 వ తరగతి చదివిన ఏఎన్నార్.. ఇంగ్లీష్ అంత అద్భుతంగా ఎలా మాట్లాడేవారో తెలుసా? అక్కినేని చెప్పిన సీక్రెట్..
Related image2
రామ్ చరణ్ కి స్పెషల్ గిఫ్ట్ పంపించిన బాలకృష్ణ, కవల పిల్లలు పుట్టినందుకు ఏం ఇచ్చాడంటే?
35
ఎన్టీఆర్ కు కొరటాల షాక్ ఇవ్వబోతున్నాడా..?
Image Credit : our own

ఎన్టీఆర్ కు కొరటాల షాక్ ఇవ్వబోతున్నాడా..?

దేవర 2 షూటింగ్ పై అప్ డేట్ వచ్చిన కొన్ని రోజులకే .. మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. ఎన్టీఆర్ అభిమానులను భయపెడుతోంది. ఆడియన్స్ ను మళ్లీ కన్ఫ్యూజన్‌లోకి నెట్టేస్తోంది. చాలా కాలంగా ఖాళీగా ఉన్న కొరటాల శివతో నిర్మాత నాగ వంశీ భారీ సినిమా ఒకటి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. 

వీరి కాంబినేషన్‌లో రూపొందబోతున్న సినిమాలో హీరోగా నందమూరి బాలకృష్ణ నటించనున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దేవర 2 సినిమా కంటే ముందే బాలయ్య సినిమా కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నాడట కొరటాల. ఎన్టీఆర్ సినిమాను కొంత కాలం పక్కన పెట్టే సూచనలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.

45
అభిమానులు ఎదురుచూస్తున్నారు
Image Credit : our own

అభిమానులు ఎదురుచూస్తున్నారు

ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండటంతో, ఆ గ్యాప్‌లో బాలకృష్ణ సినిమా పూర్తిచేయాలనే ఆలోచనలో కొరటాల శివ ఉన్నాడని ఇండస్ట్రీవర్గాలు చెబుతున్నాయి. దీంతో దేవర పార్ట్ 2 షూటింగ్ టైమ్‌లైన్‌పై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఈ పరిస్థితుల్లో దేవర పార్ట్ 2 ఎప్పుడు మొదలవుతుంది, కొరటాల శివ ప్రాధాన్యం ఏ ప్రాజెక్ట్‌కు ఉంటుందన్న అంశంపై క్లారిటీ ఇస్తాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

55
అధికారిక ప్రకటన ఎప్పుడు?
Image Credit : Asianet News

అధికారిక ప్రకటన ఎప్పుడు?

గతంలో నాగ వంశీ, బాలకృష్ణ కాంబోలో డాకు మహారాజ్ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా.. నిర్మాత ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అందుకే ఈసారి ఎలాగైనా బాలకృష్ణతో హిట్ కొట్టాలని నాగ వంశీ గట్టిగా నిర్ణయించుకున్నారని సమాచారం.

 ఈ క్రమంలోనే కొరటాల శివ, బాలకృష్ణ కాంబోలో ఓ పక్కా మాస్ సినిమాను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథ చర్చలు జరుగుతున్నట్లు టాక్. ఉగాది రోజున ఈ సినిమాను అధికారికంగా ప్రకటించాలని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి బాలకృష్ణ
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
ప్రశాంత్ నీల్

Latest Videos
Recommended Stories
Recommended image1
రామ్ చరణ్ కి స్పెషల్ గిఫ్ట్ పంపించిన బాలకృష్ణ, కవల పిల్లలు పుట్టినందుకు ఏం ఇచ్చాడంటే?
Recommended image2
అక్కినేని అభిమానులకు నాగార్జున బిగ్ షాక్, 100 వ సినిమా విషయంలో కింగ్ ఇలా చేశాడేంటి?
Recommended image3
చిరంజీవి , బాలకృష్ణ మధ్య అనిల్ రావిపూడి గమనించిన పోలిక ఏంటో తెలుసా? ఇద్దరి మధ్య ఉన్న తేడాలేంటి?
Related Stories
Recommended image1
4 వ తరగతి చదివిన ఏఎన్నార్.. ఇంగ్లీష్ అంత అద్భుతంగా ఎలా మాట్లాడేవారో తెలుసా? అక్కినేని చెప్పిన సీక్రెట్..
Recommended image2
రామ్ చరణ్ కి స్పెషల్ గిఫ్ట్ పంపించిన బాలకృష్ణ, కవల పిల్లలు పుట్టినందుకు ఏం ఇచ్చాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved