- Home
- Entertainment
- Gossips
- అల్లు అర్జున్ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ మూవీ, డైరెక్టర్ ఎవరో తెలుసా? నిజమెంత?
అల్లు అర్జున్ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ మూవీ, డైరెక్టర్ ఎవరో తెలుసా? నిజమెంత?
Allu Arjun Junior NTR : ఆర్ఆర్ఆర్ తరువాత మళ్లీ ఆస్థాయిలో భారీ మల్టీ స్టారర్ మూవీకి ప్లానింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తే.. ఈసారి అల్లు అర్జున్, ఎన్టీఆర్ కాంబినేషన్ సందడి చేయబోతుందట. ఇంతకీ ఇందులో నిజమెంత?

మళ్లీ మల్టీ స్టారర్ ల ట్రెండ్
గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు లాంటి స్టార్స్ మల్టీ స్టారర్ మూవీస్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకున్నారు. ఆతరువాత కాలంలో మహేష్ బాబు, వెంకటే, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి హీరోలు కూడా మల్టీ స్టారర్స్ తో సందడి చేశారు. ఈ ఫార్ములాను మాన్ ఇండియా రేంజ్ లో వర్కౌట్ చేసింది మాత్రం దర్శకుడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ మల్టీ స్టారర్ సినిమాతో టాలీవుడ్ కు ఏకంగా ఆస్కార్ నే తీసుకువచ్చారు. ఈక్రమంలో ఆ స్థాయిలో మరో మల్టీ స్టారర్ మూవీకి రంగం రెడీ అవుతునట్టు తెలుస్తంది. ఈసారి పాన్ ఇండియా ఇమేజ్ తో అల్లు అర్జున్, ఎన్టీఆర్ కలిసి సినిమా చేయబోతున్నట్టు టాక్. ఇంతకీ ఈసినిమాకు దర్శకుడు ఎవరు?
దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
ఆర్ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ దూసుకుపోతున్నారు. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో తీరిక లేకుండా గడిపేస్తున్నారు. దేవర సినిమాతో పాన్ ఇండియాలో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. నార్త్ లో మరింత పాపులారిటీని సాధించాడు. ఆ సినిమా సాధించిన సక్సెస్ తో.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో భారీ మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈసినిమా అయిపోగానే తారక్.. వెంటనే దేవర 2 సెట్స్ లో జాయిన్ కాబోతున్నట్టు సమాచారం. ఈసినిమాలు ఎలాంటి రిజల్ట్ చూపిస్తాయి అన్నదాన్ని బట్టి ఎన్టీఆర్ నెక్ట్స్ స్టెప్ ఉండబోతోంది. అటు రిషబ్ శెట్టి కూడా తారక్ తో భారీ బడ్జెటె మూవీ ప్లాన్ చేస్తున్నాట. ఈక్రమంలోనే అల్లు అర్జున్ తో మల్టీ స్టారర్ మూవీ న్యూస్ వినిపిస్తోంది.
అల్లు అర్జున్ ను అందుకోవడం కష్టమే..
ప్రస్తుతం అల్లు అర్జున్ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ‘పుష్ప’ సినిమాతో బాహుబలి రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేసిన బన్నీ.. ప్రస్తతుం దేశంలోనే నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు. పుష్పతో పాన్ ఇండియా స్థాయిలో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్.. ‘పుష్ప 2’ సినిమా రూ.1850 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్ట్రీలోనే ఒక కొత్త చరిత్రను సృష్టించాడు. ఈ విజయం అల్లు అర్జున్ క్రేజ్‌ను మరింత పెంచింది. ప్రస్తుతం అంతకు మించిన సినిమా చేస్తున్నాడు బన్నీ.. అట్లీ డైరెక్షన్ లో 800 కోట్ల భారీ బడ్జెట్ తో.. హాలీవుడ్ రేంజ్ లో మూవీ చేస్తున్నాడు అల్లు అర్జున్.
అల్లు అర్జున్ - జూనియర్ ఎన్టీఆర్ సినిమా సాధ్యమేనా?
ఈ క్రమంలో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీ తెరపైకి వచ్చింది. ఈ ఇద్దరూ స్టార్స్ మంచి స్నేహితులు, బావా, బావా అని పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్‌లో ఎలాంటి మల్టీస్టారర్ సినిమా రాలేదు. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ రాబోతోందన్న వార్తలు సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే రామ్ చరణ్‌తో ఆర్ ఆర్ ఆర్’ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆతరువాత ఈ ఏడాది హృతిక్ రోషన్‌తో ‘వార్ 2’ లో నటించగా.. ఈసినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్‌తో కలిసి మరో మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. కానీ ఈ ఇద్దరు స్టార్లు ప్రస్తుతం పరిస్థితుల్లో ఉన్న బిజీకి ఇది సాధ్య మవుతుందా అనేది అందరి అనుమానం.
ఇంతకీ దర్శకుడు ఎవరు?
ఈ ఇద్దరి కాంబినేషన్‌ను వెండితెరపై అద్భుతంగా చూపించగల దర్శకుడు ఎవరు అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఎప్పటి నుంచో తెలుగు హీరోలతో సినిమాలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అల్లు అర్జున్, రామ్ చరణ్ లకు కొన్ని కథలు కూడా వినిపించాడట లోకేష్. అయితే తెలుగు హీరోతో ఆయన చేసే సినిమా భారీస్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. ఈక్రమంలోనే అల్లు అర్జున్ కు అతను ఓ కథను వినిపించాడని.. అందులో బన్నీతో పాటు తారక్ కూడా ఉంటే సినిమా ఓ రేంజ్ లో ఉంటందని భావిస్తున్నారట. అందుకే ఎన్టీఆర్ కు ఈ కథను వినిపంచే ప్రయత్నంలో ఉన్నాట లోకే. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. ఈ విషయం మాత్రం అభిమానుల్లో లో నరాలు తెగే ఉత్కంంటను రేపుతోంది. ఇది నిజంగా నిజం అయితే బాగుండు అని బన్నీ, తారక్ అభిమానులు అనుకుంటున్నారు.

