- Home
- Entertainment
- Gossips
- Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?
Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?
Samantha Honeymoon : స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇద్దరికి ఇది రెండో పెళ్లి కాగా.. వీరు హనీమూన్ కోసం రొమాంటిక్ ప్లేస్ లు సెర్చ్ చేస్తున్నట్టు టాక్. ఇంతకీ సమంత హనీమూన్ ట్రిప్ ఎప్పుడు?

సమంత - రాజ్ నిడిమోరు పెళ్లి
నాగచైతన్యతో విడాకుల తరువాత చాలా కాలం సింగిల్ గా ఉన్న సమంత.. ఆతరువాత ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడింది. కొద్ది కాలంగా కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన ఈ జంట.. తాము ఒక్కటవ్వబోతున్నట్టు హింట్స్ కూడా ఇచ్చారు. వీరిద్దరి పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఇక అందరు అనుకున్నట్టగానే సమంత రాజ్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో.. భూత శుద్ది పద్దతిలో వీరి పెళ్లి జరిగింది. పెళ్లి తరువాత ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడిస్తూ.. సమంత కొన్నిఫోటోలు కూడా తన సోషల్ మీడియా పేజ్ లో ఫోస్ట్ చేసింది.
పెళ్ళైన వెంటనే షూటింగ్ కు సమంత..
పెళ్లి తర్వాత పెద్దగా బ్రేక్ తీసుకోలేదు సమంత. మూడు రోజుల తరువాత తన పనిలో తాను నిమగ్నమయ్యింది. రీసెంట్ గా సమంత తన కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. తాను నటిస్తు, నిర్మిస్తోన్న 'మా ఇంటి బంగారం' సినిమా షూటింగ్ స్టార్ట్ చేయగా.. అందులో సామ్ పాల్గొన్నారు. నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా మహూర్తపు పూజలో కూడా ఆమె పాల్గొన్నారు. పెళ్లి తరువాత వెంటనే హనీమూన్ అని బ్రేక్ తీసుకోకుండా.. షూటింగ్ లో పాల్గొనడంతో.. ఆమెను అభిమానులు తెగ పొగిడేస్తున్నారు. చేసే పనిలో ఆమె డెడికేషన్ ను మెచ్చుకుంటున్నారు.
సమంత - రాజ్ హనీమూన్ ఎప్పుడు ఎక్కడ?
సమంత రాజ్ పెళ్లి చేసుకున్న తరువాత వారి హనీమూన్ పై రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఈ జంట తమ రొమాంటిక్ వెకేషన్ ను ఎక్కడికి ప్లాన్ చేసుకున్నారు? ఎప్పుడు వెళ్లబోతున్నారు అని అభిమానులు ఆసక్తిగా గమనించారు. అయితే సమంత షూటింగ్ లో పాల్గొనడంతో.. ఈజంట హనీమూన్ కు వెళ్లరేమో అని అంతా అనుకున్నారు. అయితే వీరు కాస్త లేట్ గా ట్రిప్ ను ప్లాన్ చేసినట్టు మరోక న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. కాస్త తీరిగ్గా అయినా.. లాంగ్ ట్రిప్ ను వేయాలని వారు అనుకుంటున్నట్టు సమాచారం. యూరప్ లోని రొమాంటిక్ లొకేషన్స్ ను చుట్టేసి రావాలని ఈ స్టార్ సెలబ్రిటీ కపుల్ అనుకుంటున్నారట. ప్రస్తుతం ఇక్కడ ఉన్న షూటింగ్ పనులు కంప్లీట్ చేసుకున్న తరువాత హనీమూన్ కు వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో సోషల్ మీడియా సమాచారం తప్పించి.. ఎటువంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు.
నిర్మాతగా సమంత బిజీ బిజీ..
నటిగా సమంత సినిమాలు తగ్గించింది. నిర్మాతగా కొత్త అవతారం ఎత్తిన సామ్.. శుభం సినిమాతో సూపర్ హిట్ ను అందుకుంది. ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమాలో నటిస్తూ.. నిర్మిస్తోంది. అంతే కాదు పలు వ్యాపారాలు కూడా ఆమె నిర్వహిస్తోంది. క్లాతింగ్ బ్రాండ్స్ తో పాటు జ్యూవెల్లరీ, పెర్ఫ్యూమ్ బ్రాండ్స్ కూడా ఆమె నిర్వహిస్తోంది. ఈ వ్యాపారంలో సమంత కోట్లు సంపాదిస్తున్నట్టు సమాచారం. నాగచైతన్యతో పెళ్లి.. విడాకుల తరువాత మయోసైటిస్ వ్యాధి భారిన పడింది హీరోయిన్. దాదాపు ఏడాదిన్నర ట్రీట్మెంట్ తరువాత ఆమె కోలుకున్నారు. అన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న సమంత.. ఇప్పుడిప్పుడే.. మళ్లీ యాక్టీవ్ అవుతున్నారు.

