- Home
- Entertainment
- శ్రీదేవి కమెడియన్ తో రొమాన్స్ చేసిన సినిమా ఏదో తెలుసా? చిరు, రజనీ లాంటి స్టార్స్ తో మెరిసిన నటి ఎందుకిలా చేసింది?
శ్రీదేవి కమెడియన్ తో రొమాన్స్ చేసిన సినిమా ఏదో తెలుసా? చిరు, రజనీ లాంటి స్టార్స్ తో మెరిసిన నటి ఎందుకిలా చేసింది?
Sridevi : స్టార్ హీరోయిన్లు చిన్నచిన్న హీరోల సరసన నటించడానికి ఒప్పుకోరు.. తమ ఇమేజ్ గురించి ఆలోచిస్తుంటారు. కానీ ఎన్టీఆర్ ఏఎన్నార్ నుంచి చిరు రజినీ వరకూ స్టార్స్ సరసన ఆడిపాడిన శ్రీదేవి... స్టార్ కమెడియన్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిందని మీకు తెలుసా?

స్టార్ డమ్ కోసం హీరోయిన్ల తంటాలు..
ప్రస్తుతం హీరోయిన్లు స్టార్ డమ్ తెచ్చుకోవడం కోసం ఎన్నో తంటాలు పడుతున్నారు. కొంత మందికి అది వెంటనే వస్తుంది.. మరికొంత మంది ఎన్ని ఏళ్లైనా.. స్టార్ హీరోయిన్ స్టేటస్ సాధించలేరు. చిన్ని హీరోల సరసన కెరీర్ స్టార్ట్ చేసిన రకుల్, తమన్నా ఎంత పెద్ద హీరోయిన్లు అయ్యారో తెలిసిందే. కానీ వీరితోపాటు కెరీర్ స్టార్ట్ చేసిన రెజీనా, నభ నటేష్ లాంటి వారు మాత్రం స్టార్స్ అవ్వలేకపోయారు. ఇండస్ట్రీలో ఒక్క సారి స్టార్ హీరోయిన్ స్టేటస్ వస్తే.. పెద్ద పెద్ద హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేయాలని కలలు కంటుంటారు.
చిన్న హీరోలతో సినిమాలు చేయరు..
ఒక్క సారి స్టార్ డమ్ వచ్చిన హీరోయిన్లు చిన్న హీరోలతో నటించడానికి అస్సలు ఇష్టపడరు. తమ ఇమేను దృష్టిలో పెట్టుకుని.. చిన్న హీరోలతో సినిమాలు చేస్తూ.. హీరోయిన్ గా పెద్ద అవకావాలు కోల్పోతామని భయపడుతుంటారు. అటువంటిది హీరోయిన్లు కమెడియన్ సరసన నటించమంటే ఎవరైనా ఆ సాహసం చేస్తారా? కానీ శ్రీదేవి చేసింది. ఓ కమెడియన్ తో ఏకంగా ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది. ఇంతకీ ఎవరాకమెడియన్.. ఏంటా సినిమా?
శ్రీదేవి సినిమా కెరీర్
శ్రీదేవి తన సినీమా కెరీర్ ను చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ చేసింది. చిన్న వయసులోనే సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆమె, ఆ తర్వాత క 16 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా మారింది. తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రజినీకాంత్, కమల్ హాసన్, అనిల్ కపూర్ వంటి అప్పటి అగ్ర హీరోల సరసన హీరోయిన్‌గా నటించి మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకుంది. తక్కువ కాలంలోనే ఆమె స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
కమెడియన్ తో రొమాన్స్ చేసిన శీదేవి
ఈ క్రమంలో 1975 సంవత్సరంలో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన “దేవుడు లాంటి మనిషి” అనే సినిమాలో శ్రీదేవి నటించింది. ఈ సినిమాలో ఆమె ప్రముఖ కమెడియన్ రాజబాబుకు జోడిగా శ్రీదేవి నటించడం విశేషం. అంతేకాదు, వీరిద్దరి మధ్య ఒక డ్యూయెట్ సాంగ్ కూడా ఈసినిమాలో ఉండటం విశేషం. శ్రీదేవి ఒక కమెడియన్ తో రొమాన్స్ చేసిందన్న విషయం చాలామందికి తెలియదు. ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు అవునా.. అని ఆశ్చర్యపోతున్నారు. ఆతరువాత కాలంలో ఆమె ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్ర్లేదు.
స్టార్ హీరోలతో ఆడిపాడిన అతిలోక సుందరి
తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా శ్రీదేవికి అవకాశాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. అక్కడ కూడా ప్రముఖ స్టార్ హీరోలతో కలిసి నటించి తిరుగులేని స్థాయికి చేరుకుంది. ఈ స్థాయికి చేరుకోవడానికి శ్రీదేవి తన కెరీర్ ఆరంభంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంది. హీరోయిన్‌గా గుర్తింపు పొందకముందు కూడా ఆమె కొన్ని చిన్న సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ అనుభవం సంపాదించింది.
తండ్రీ కొడుకులకు జంటగా శ్రీదేవి
కెరీర్ ప్రారంభ దశలోనే అన్ని రకాల పాత్రలు చేస్తూ ముందుకు సాగిన శ్రీదేవి.. తను బాలనటిగా ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు మనవరాలిగా కనిపించింది. ఆతరువాత కాలంలో వారి సరసనే ఆమె హీరోయిన్ గా నటించడం మరో విచిత్రం. ఈ విషయంలో ఎన్నో విమర్శలు వచ్చినా.. ఏమాత్రం లెక్క చేయకుండా .. బ్లాక్ బస్టర్ హిట్స్ ను ఈ కాంబినేషన్ సాధించింది. తరువాత కాలంలో ఏఎన్నార్ తనయుడు నాగార్జునతో కూడా శ్రీదేవి జంటగా నటించింది. బాలకృష్ణ మాత్రం శ్రీదేవితో ఒక్క సినిమాలో కూడా నటించలేదు.

