- Home
- Entertainment
- Gossips
- బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్, మోక్షజ్ఞ సినిమాకు న్యూ ఇయర్ లో మోక్షం, డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?
బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్, మోక్షజ్ఞ సినిమాకు న్యూ ఇయర్ లో మోక్షం, డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?
Mokshagna Debut : నందమూరి అభిమానులకు కొత్త సంవత్సరంలో గుడ్ న్యూస్ అందేలా ఉంది. బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్దమయ్యింది. ఇంతకీ ఈసినిమాకు డైరెక్టర్ ఎవరు?

బాలయ్య అభిమానులకు శుభవార్త
చాలా కాలంగా నందమూరి అభిమానులను ఊరిస్తున్న వార్త మోక్షజ్ఞ ఎంట్రీ. ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరో వారసున్ని, వెండితెరపై చూస్తామా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు. వాళ్ళు ఎంత ఎదురుచూన్నారో.. అంతా వెనక్కి వెళ్తోంది మోక్షజ్ఞ సినిమా. రెండు సంవత్సరాలుగా ఈ యంగ్ హీరో ఎంట్రీపై రకరకాల వార్తలు వైరల్ అవుతునే ఉన్నాయి. ఈ ఏడాది పక్కాగా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అభిమానులు అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే.. మోక్షజ్ఞ లుక్స్ కూడా బయటకు రావడంతో.. అంతా హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ అనుకోని విధంగా ఈసినిమా ఆగిపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
కొత్త ఏడాది మోక్షజ్ఞ సినిమా మొదలుపెడతారా.. ?
గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ సినిమా రానుందని ప్రకటించినప్పటికీ, ఆ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లలేదు. మోక్షజ్ఞ న్యూ లుక్స్ మాత్రం అభిమానులను అలరించాయి. కంప్లీట్ గా లుక్ చేంజ్ చేసి.. ఆడియన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు నందమూరి హీరో. ఇదే ఊపుతో సినిమా స్టార్ట్ అవుతుంది అనుకుంటే.. రకరకాల కారణాల చేత ఆ సినిమా ఆగిపోయింది. దాంతో మరోసారి అభిమానులకు నిరాశ తప్పలేదు. అయితే తాజా తాజా సమాచారం ప్రకారం, బాలయ్య తన కుమారుడి డెబ్యూ కోసం కొత్త ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. 2026 న్యూ ఇయర్ సందర్భంగా మోక్షజ్ఞ కొత్త సినిమా స్టార్ట్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. అంతే కాదు 2026 ఏడాది చివరికల్లా ఈ సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ కూడా వేశారని సమాచారం. దర్శకుడి విషయంలో కూడా బాలయ్య ఒకరిని ఫిక్స్ అయినట్టు సమాచారం.
బోయపాటి డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ?
ఇక మోక్షజ్ఞ మొదటి సినిమాకు దర్శకుడు ఎవరు అన్న ప్రశ్నపై టాలీవుడ్ లో ఫిల్మ్ సర్కిల్స్‌లో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం, మోక్షజ్ఞ డెబ్యూ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణకు కలిసొచ్చిన దర్శకుడిగా బోయపాటికి నందమూరి అభిమానుల్లో మంచి పేరు ఉంది. ఇప్పటికే బాలకృష్ణతో నాలుగు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఆయన తెరకెక్కించారు. దాంతో మోక్షజ్ఞ డెబ్యూ బాధ్యతలను కూడా ఆయన బోయపాటిపైనే పెట్టినట్టు సమాచారం. ఇక మోక్షజ్ఞ కోసం మంచి లవ్ స్టోరీతోపాటు, ఆ కథలో ఎమోషన్స్, ఎలివేషన్స్‌కు కూడా భారీ స్థాయిలో ఉండేలా సెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఇందులో నిజమెంత అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అధికారికంగా మాత్రం ఆ వార్త బయటు రాలేదు.
బాలకృష్ణ డైరెక్షన్ లో మోక్షజ్ఞ
ఇక మోక్షజ్ఞ సినిమాను జనవరి 1న పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టబోతున్నారు అని నెట్టింట టాక్ గట్టిగా వనిపిస్తుంది. ఈ విషయం పక్కన పెడితే.. చాలా కాలంగా బాలకృష్ణ డైరెక్షన్ లో మోక్షజ్ఞ సినిమాపై కూడా రకరకాల వార్తలు వినిపించాయి. బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ చేయబోతున్నారని, అదే మోక్షజ్ఞ డెబ్యూ అవుతుందని, ఆ సినిమాను బాలయ్య స్వయంగా డైరెక్ట్ చేయబోతున్నారన్న వార్తలు వైరల్ అయ్యాయి. ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ రావడం మాత్రం నిజం అని బాలకృష్ణ పలు సందర్బాల్లో వెల్లడించారు. కానీ అందులో మోక్షజ్ఞ నటిస్తారా లేదా అన్న విషయంలోనే క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ నందమూరి అభిమానులను ఇంకా ఊరిస్తూనే ఉంది. మరి ఇది ఎప్పుడు జరుగుతుందో చూడాలి.
అఖండ 2 హడావిడిలో బాలకృష్ణ..
ప్రస్తుతం అఖండ2 హడావిడిలో ఉన్నారు బాలకృష్ణ. ఈసినిమా ఈరోజు (12 డిసెంబర్ ) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన నాలుగో సినిమా ఇది. అఖండ 2 సినిమా రిలీజ్ పై కొన్ని వివాదాలు నడిచాయి. డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కావల్సి ఉంది. కానీ నిర్మాతకు సబంధించిన ఆర్దిక లావాదేవీల సమస్య వల్ల.. ఈమూవీ రిలీజ్ ఆగిపోయింది. అవన్నీ క్లియర్ చేసుకుని డిసెంబర్ 12న రిలీజ్ అయిన అనౌన్స్ చేసిన తరువాత కూడా.. తెలంగాణాలో అఖండ2 రిలీజ్ కు సంబంధించి లీగల్ ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఈమూవీ రిలీజ్ అయ్యింది.. అయితే వరుస విజయాలతో దూసుకుపోతోన్న బాలకృష్ణకు అఖండ2 సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

