MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Gardening
  • Fast Growing Vegetables: ఈ కూరగాయలు ఇంట్లోనే కేవలం 15 రోజుల్లో పెరుగుతాయి..!

Fast Growing Vegetables: ఈ కూరగాయలు ఇంట్లోనే కేవలం 15 రోజుల్లో పెరుగుతాయి..!

 Fast Growing Vegetables: ఇంట్లోనే కూరగాయలు పెంచాలని అనుకుంటున్నారా? తక్కువ రోజుల్లో, ఎక్కువ శ్రమ లేకుండా చేతికి పంట రావాలి అంటే ఈ కూరగాయలు పెంచాల్సిందే. చాలా సింపుల్ గా, కేవలం 15 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తుంది. అవేంటో చూద్దాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 23 2026, 05:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Home Gardening..
Image Credit : Asianet News

Home Gardening..

బయట కూరగాయల రేట్లు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. అంత రేట్లు పెట్టి కొనడం సామాన్యులకు చాలా కష్టంగా ఉంటుందనే చెప్పొచ్చు. అలా అని ఇంట్లో పెంచుకుందామా అంటే.. అంత ప్లేస్ దొరకదు. ప్రస్తుతం దాదాపు అందరూ ఉండేది అపార్ట్మెంట్స్ లోనే.. వీటిలో మొక్కలు పెంచే అంత స్పేస్ ఉండదు. కానీ.. ఉన్న కొద్దిగా ప్లేస్ లోనే మనం చాలా ఈజీగా కూరగాయలు పెంచుకోవచ్చు. అన్ని రకాల కూరగాయలను ఇంట్లో పెంచడానికి కుదరకపోవచ్చు.కానీ.. తక్కువ ప్లేస్ లో కూడా చాలా ఈజీగా తక్కువ సమయంలో పెరిగే కొన్ని రకాల కూరగాయలు ఉన్నాయి. అవేంటి? వాటిని ఎలా పెంచాలి..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మైక్రోగ్రీన్స్..
Image Credit : Asianet News

మైక్రోగ్రీన్స్..

నార్మల్ కూరగాయలు పండటానికి ఎక్కువ సమయం పట్టొచ్చు. కానీ.. ఆకుకూరలు, కొన్ని రకాల మైక్రో గ్రీన్స్ చాలా ఈజీగా పెరుగుతాయి. నిజానికి..మైక్రో గ్రీన్స్ లో పోషకాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని పెంచడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదు. కేవలం పది నుంచి 15 రోజుల్లో ఈజీగా పెరిగేస్తాయి. మీ ఇంటి బాల్కనీలో చిన్న కుండీ పెట్టుకునే ప్లేస్ ఉన్నా.. వీటిని పెంచేయచ్చు. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉండటమే కాదు.. వీటిని పెంచే ప్రాసెస్ కూడా చాలా సులభం. గింజలను ఒక రోజు నానపెట్టి కుండీలో చల్లితే సరిపోతుంది.. రెండు రోజులకే మొక్క రావడం మొదలౌతుంది. వారం పది రోజులకు వాటిని కోసుకొని మనం తినేయచ్చు కూడా..

34
  కొత్తిమీర..
Image Credit : Getty

కొత్తిమీర..

చాలా మంది కొత్తిమీర కేవలం వంట అయిపోయాక పైన గార్నిష్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది అనుకుంటారు. కానీ.. కొత్తిమీర చాలా పోషకాలు ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.ఈ కొత్తిమీర పెంచడం చాలా ఈజీ. దీని కోసం మీరు కొత్తిమీర గింజలను నలిపి, నీటిలో నానపెట్టి.. ఆ తర్వాత వాటిని మట్టిలో పాతిపెడితే సరిపోతుంది. 15 రోజుల్లో ఆకులు మొలకెత్తుతాయి. వాటిని మనం కట్ చేస్తూ ఉంటే మళ్లీ కొత్తగా ఆకులు చిగురిస్తూనే ఉంటాయి.

44
మెంతి కూర..
Image Credit : Getty

మెంతి కూర..

మీ ఇంట్లో మెంతులు ఉంటే.. మెంతికూర కూడా ఈజీగా పెంచొచ్చు. ఏ సీజన్ లో అయినా ఈజీ పెరుగుతుంది. ఒక రాత్రంతా మెంతులను నీటిలో నానపెట్టి.. తర్వాత.. మట్టిలో చల్లితే.. పది రోజుల్లో మొలకెత్తి ఆకులు రావడం మొదలౌతాయి. మైక్రో గ్రీన్స్ గా ఉన్నప్పుడే కట్ చేసి..వంటల్లో వేసుకోవచ్చు. కొద్దిగా ఎండ తగిలితే చాలు.. ఈజీగా పెరుగుతుంది.

పాలకూర..

పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని కూడా మనం ఇంట్లో పెంచొచ్చు. పాలకూర పెరగడానికి ఎక్కువ రోజులు పట్టొచ్చు. కానీ.. మైక్రో గ్రీన్స్ గా ఉన్నప్పుడు అంటే చిన్న చిన్న ఆకులుగా ఉన్నప్పుడే కట్ చేసుకొని వంటల్లో వేసుకోవచ్చు. ఇవి కూడా 15 రోజుల్లో పెరిగేస్తాయి.

పచ్చి వెల్లుల్లి ఆకులు

వెల్లుల్లి రెబ్బలను మట్టిలో నాటితే, సుమారు 15 నుండి 20 రోజులలో పచ్చని ఆకులు వస్తాయి. ఈ ఆకులను సూప్‌లు, సలాడ్‌లు కూరగాయలలో ఉపయోగించుకోవచ్చు. చిన్న కుండీకి బదులుగా, ప్లాస్టిక్ బాటిల్ ప్లాంటర్‌లో కూడా వెల్లుల్లిని నాటవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
తోటపని
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ginger : ఇంట్లో కుండీలోనే అల్లం పెంచేయండి ఇలా, సింపుల్ చిట్కాలు
Recommended image2
Rainy Season Plants : వర్షాకాలంలో వేగంగా పెరిగే మొక్కలు ఇవే!
Recommended image3
Tulsi Plant: తులసి మొక్క సడెన్ గా ఎండిపోయిందా? కారణం ఇదే
Related Stories
Recommended image1
Samantha: కడుపుతో ఉంటే కత్తి ముట్టుకోకూడదా? సమంత అలా ఎందుకు చెప్పింది?
Recommended image2
Bike Seat: బైక్ వెనక సీటు ఎత్తుగా ఎందుకు ఉంటుంది..? స్టైల్ అయితే కాదు, కారణం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved