ఇండోర్ ప్లాంట్స్ నీరు వేసేటప్పుడు మట్టి పొడిగా ఉందో లేదో వేలితో తాకి చూశాకే నీళ్లు పోయాలి. నీళ్లు ఎక్కువగా పోయడం వల్ల కూడా మొక్కలు వాడిపోతాయి.
కుండీ అడుగున నీరు బయటకు వెళ్లేందుకు రంధ్రాలు కచ్చితంగా ఉండాలి. మొక్కలకు బరువైన మట్టికి బదులుగా 'పాటింగ్ మిక్స్' వాడటం మంచిది.
ఇండోర్ ప్లాంట్స్ కు కూడా అప్పుడప్పుడు ఎండ తగిలాలి. వారంలో రెండు సార్లు అయినా ఎండ తగిలాలి. కిటికీ దగ్గర పెడితే సరిపోతుంది.
ఏసీ ఉన్న గదుల్లో గాలి పొడిగా ఉంటుంది. అందుకే మొక్కల ఆకులపై అప్పుడప్పుడు నీళ్లు స్ప్రే చేయండి.
మొక్కలను గ్యాస్ స్టవ్ దగ్గర లేదా ఏసీ గాలి నేరుగా తగిలే చోట పెట్టకండి. ఉష్ణోగ్రత ఎప్పుడూ సమంగా ఉండేలా చూసుకోవాలి.
మొక్కలు బాగా పెరిగే సీజన్‌లో (వేసవిలో) నెలకు ఒకసారి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వండి. ఎరువు ఎక్కువైతే మొక్క వేర్లు దెబ్బతింటాయి.
Indoor Plants: ఇళ్లు అందంగా కనిపించాలంటే ఈ 7 మొక్కలు పెంచితే చాలు!
మీ బాల్కనీలోనే సొరకాయలు పెంచొచ్చు, ఎలానో తెలుసా?
బెడ్రూమ్ లో ఈ మొక్కలు ఎందుకు పెంచాలో తెలుసా?
లివింగ్ రూమ్ కి అనువైన ఇండోర్ ప్లాంట్స్ ఇవిగో..