MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Gardening
  • Papaya Tree: ఇదేం లాజిక్కు?.. బొప్పాయి చెట్టుకు మేకులు కొడితే గంపలకొద్దీ కాయలు కాస్తాయా?

Papaya Tree: ఇదేం లాజిక్కు?.. బొప్పాయి చెట్టుకు మేకులు కొడితే గంపలకొద్దీ కాయలు కాస్తాయా?

Papaya Tree: బొప్పాయి చెట్టుకు మేకులు కొడితే నిజంగానే కాయాలా కాస్తాయా? అలా అయితే తోటలు వేసినవాళ్లకు పంట దిగుబడి రావాలి కదా? ఇది కేవలం గుడ్డి నమ్మకమేనా? లేక దీనికి ఏమైనా శాస్త్రీయ ఆధారాలేమైనా ఉన్నాయా? 

2 Min read
Author : Nandini Arava
Published : Jun 27 2026, 06:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇదేం లాజిక్కు
Image Credit : our own

ఇదేం లాజిక్కు

 బొప్పాయి చెట్టుకు మేకులు కొడితే నిజంగానే కాయాలా కాస్తాయా? అలా అయితే తోటలు వేసినవాళ్లకు పంట దిగుబడి రావాలి కదా? ఇది కేవలం గుడ్డి నమ్మకమేనా? లేక దీనికి ఏమైనా శాస్త్రీయ ఆధారాలేమైనా ఉన్నాయా?
మీ ఇంట్లో బొప్పాయి చెట్టుకు మూడు నాలుగు నెలలైనా కాయలు కాయట్లేదా? అయితే, దాని కాండానికి మేకు కొట్టాలనే ఆలోచన వస్తోందా? పల్లెటూర్లలో చాలామంది నమ్ముతారు, పాటిస్తారు కూడా. బొప్పాయి కాండానికి ఇనుప మేకు కొడితే తొందరగా కాయలు కాస్తాయని నమ్ముతారు. కానీ, ఇందులో నిజమెంత?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బొప్పాయిలో ఫలసాయం కోసం సాంప్రదాయ నమ్మకం
Image Credit : pinterest

బొప్పాయిలో ఫలసాయం కోసం సాంప్రదాయ నమ్మకం

చాలామంది రైతులు బొప్పాయి చెట్టుకు కాయలు కాయకపోతే, దాని కాండానికి ఇనుప మేకు కొడతారు. ఇలా చేయడం వల్ల చెట్టుకు షాక్ తగిలి, ఆ ఒత్తిడిలో త్వరగా పూత, కాతకు వస్తుందని వాళ్లు నమ్ముతారు. మేకులోని ఐరన్ చెట్టుకు అంది, వేగంగా పెరిగి కాయలు కాస్తుందని కూడా కొందరు అంటారు. మరి సైన్స్ ఏమంటుందో చూద్దాం.

35
శాస్త్రీయ వాస్తవం ఏంటి?
Image Credit : Getty

శాస్త్రీయ వాస్తవం ఏంటి?

బొప్పాయి చెట్టుకు మేకు కొడితే తొందరగా కాయలు కాస్తాయనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. చెట్టు కాయలు కాయడం అనేది దాని రకం, పోషణ, ఎండ, ఉష్ణోగ్రత, నీటిపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. మేకు కొట్టడం వల్ల కాండానికి గాయమై, ఫంగల్ లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొన్నిసార్లు ఇది చెట్టు పెరుగుదలను కూడా దెబ్బతీస్తుంది. మరి కాయలు త్వరగా కాయాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
45
బొప్పాయి చెట్టుకు కాయలు త్వరగా కాయాలంటే ఏం చేయాలి?
Image Credit : Getty

బొప్పాయి చెట్టుకు కాయలు త్వరగా కాయాలంటే ఏం చేయాలి?

బొప్పాయి చెట్టుకు కాయలు తొందరగా, ఎక్కువగా కాయాలంటే, దానికి రోజూ కనీసం 6 నుంచి 8 గంటల ఎండ తగలాలి. ఆవు పేడ, వర్మీకంపోస్ట్, పొటాష్ వంటి ఎరువులు వాడితే చెట్టు ఎదుగుదలకు సహాయపడుతుంది. మొక్క నాటేటప్పుడే నాణ్యమైన విత్తనాలు లేదా మొక్కను ఎంచుకోవాలి. దీనివల్ల చెట్టు తొందరగా పెరిగి, కాయలు కూడా త్వరగా కాసే అవకాశం పెరుగుతుంది.

55
బొప్పాయి సాగు చిట్కాలు
Image Credit : Getty

బొప్పాయి సాగు చిట్కాలు

బొప్పాయి చెట్టుకు మేకు కొట్టమని చాలామంది మీకు సలహా ఇవ్వొచ్చు, కానీ మీరు అలా చేయకండి. దానివల్ల చెట్టుకు నష్టం జరిగే అవకాశం ఉంది. సరైన తోటపని పద్ధతులు పాటిస్తేనే చెట్టు నుంచి ఎక్కువ ఫలసాయం పొందవచ్చు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
తోటపని
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ginger : ఇంట్లో కుండీలోనే అల్లం పెంచేయండి ఇలా, సింపుల్ చిట్కాలు
Recommended image2
Rainy Season Plants : వర్షాకాలంలో వేగంగా పెరిగే మొక్కలు ఇవే!
Recommended image3
Tulsi Plant: తులసి మొక్క సడెన్ గా ఎండిపోయిందా? కారణం ఇదే
Related Stories
Recommended image1
Mumbai Facts: అక్కడ రాత్రి 8 తర్వాతే వ్యాపారాలు మొదలవుతాయి..కారణమేంటో తెలుసా?
Recommended image2
Telugu saying: నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు.. బడాయిపోయేవాళ్లకు బాగా సరిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved